యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వివిధ మౌలిక వసతుల అభివృద్ధి, మెరుగుదల ప్రాజెక్టులకు సాయ్ పాలకమండలి ఆమోదం: యువ క్రీడా వ్యవస్థకు తోడ్పాటు అందించేలా అథ్లెట్-కేంద్రీకృత నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర క్రీడా మంత్రి సూచన


అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్న భారత క్రీడారంగానికి ఉజ్వల భవిష్యత్తు అందించేలా అన్ని విధాలా తక్షణమే బలోపేతం చేయాలి: డాక్టర్ మన్షుక్ మాండవీయ

కేఎస్ఎస్‌ఆర్‌‌లో కొత్త లేజర్ షూటింగ్ టార్గెట్లు, ఎన్ఎస్ఎస్‌సీ బెంగళూరులో కొత్త హాకీ టర్ఫ్, భోపాల్లోని సాయ్‌‌లో సింథటిక్ ట్రాకుతో సహా పలు ప్రాజెక్టులకు ఆమోదం

प्रविष्टि तिथि: 22 DEC 2025 7:32PM by PIB Hyderabad

ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన భారత క్రీడా సాధికార సంస్థ (సాయ్పాలకమండలి (జీబీసమావేశానికి కేంద్ర యువజన వ్యవహారాలుక్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్షుక్ మాండవీయ అధ్యక్షత వహించారుఈ సమావేశంలో దేశవ్యాప్తంగా మౌలిక వసతులను అభివృద్ధి చేసేమెరుగుపరిచే వివిధ ప్రాజెక్టులను ఆమోదించారు.

‘‘ప్రస్తుతం భారత క్రీడా వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న దశలో ఉందిదీనికి ఉజ్వల భవిష్యత్తు అందించే దిశగా అన్ని రకాలుగా ఈ రంగాన్ని బలోపేతం చేయాల్సిన తక్షణావసరం ఉందిక్రీడాకారులే కేంద్రంగాకామన్వెల్త్ఒలింపిక్ క్రీడల్లో పతకాలను సాధించడమే దృష్టిలో పెట్టుకొని వారికి ఉత్తమ మౌలిక వసతులను అందించడమే ఈ రోజు మనం తీసుకున్న నిర్ణయాల లక్ష్యం’’ అని సాయ్ పాలకమండలిని ఉద్దేశించి డాక్టర్ మాండవీయ అన్నారు.

ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా బెంగళూరులోని సాయ్ ఎన్ఎస్ఎస్‌సీ కోసం పాలిగ్రాస్ ప్యారిస్ జీటీ హాకీ టర్ఫును ఏర్పాటు చేయాలని పాలకమండలి సిఫార్సు చేసిందిఇది భారత పురుషులమహిళల జాతీయ, ‘ఎ’ హాకీ బృందాలకు శిక్షణా కేంద్రంగా పనిచేస్తుంది.

భారత దేశంలో అత్యుత్తమవర్థమాన షూటర్లకు శిక్షణ అందిస్తున్న కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్ (కేఎస్ఎస్ఆర్)లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ షూటింగ్ టార్గెట్ల స్థానంలో లేజర్ టార్గెట్ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు పాలకమండలి అంగీకరించింది.

ఈ కీలక నిర్ణయాలతో పాటుగా.. సాయ్ ఎన్‌సీవోఈ ఛత్రపతి శంభాజీ నగర్ (గతంలో సాయ్ ఔరంగాబాద్), సాయ్ ఎన్ఎస్ఎన్ఐఎస్‌ పటియాలాసాయ్ ఎల్ఎన్‌సీపీఈ త్రివేండ్రంలో మూడు మల్టీపర్పస్ హాళ్లను నిర్మించేందుకు కూడా పాలకమండలి ఆమోదం తెలిపిందిఇవి క్రీడాకారులకు అవసరమైన శిక్షణకుసమగ్రాభివృద్ధికి దోహదపడతాయి.

సాయ్ ఎన్‌సీఈవో ఛత్రపతి శంభాజీనగర్‌లో ఏర్పాటు చేసే ఈ సౌకర్యం.. వాతావరణ అనుకూల బాక్సింగ్ శిక్షణ జోన్‌గాక్రీడాకారుల బలంసామర్థ్యాన్ని పెంపొందించే కేంద్రంగా పని చేస్తుంది. వాలీబాల్బ్యాడ్మింటన్ కోసం ప్రత్యేకంగా ఇండోర్ స్థలాలను కేటాయిస్తారుఅలాగే సాయ్ ఎన్ఎస్ఎన్ఐఎస్ పటియాలాలో ఏర్పాటు చేసే ఇండోర్ శిక్షణ హాలు.. ఇండోర్ శిక్షణ సామర్థ్యాన్ని విస్తరిస్తుందనిక్రీడల్లో మెరుగైన ప్రదర్శనకుస్పోర్ట్స్ సైన్స్ సహకారానికిసామర్థ్య నిర్మాణానికిగాయాల నుంచి కోలుకోవడానికి అవసరమైన ఆధునికమైనసమీకృత వ్యవస్థను అందిస్తుందని అంచనా.

దేశంలో ప్రముఖ విద్యా సంస్థమెరుగైన క్రీడా శిక్షణ అందించే కేంద్రమైన ఎల్ఎన్‌సీపీఈ త్రివేండ్రానికి సైతం కొత్త మల్టీపర్పస్ హాల్ మంజూరు చేశారుఇది ఏడాది పొడవునా శిక్షణవిద్యా కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేందుకు తోడ్పడుతుంది.

పశ్చిమ బెంగాల్లో సాయ్ ఎస్‌టీసీ జల్పాయ్‌గురిలో 400-మీటర్లు, 8-లేన్ల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణానికి సైతం జీబీ ఆమోదం తెలిపిందిక్రీడా శిక్షణలో ముఖ్యమైన కేంద్రంగా సాయ్ ఎస్టీ‌సీ జల్పాయ్‌గురి ఆవిర్భవిస్తోందిపరిమితమైన మౌలిక వసతులున్నప్పటికీ.. ప్రాంతీయజాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తోంది.

సాయ్ ఎస్టీసీ జల్పాయ్‌గురితో పాటుగా.. భోపాల్లోని సాయ్ సీఆర్‌సీలో కొత్త సింథటిక్ ట్రాకు ఏర్పాటు చేయడానికి కమిటీ ఆమోదం తెలిపిందిఈ కేంద్రంలో వివిధ క్రీడా విభాగాలకు చెందినవారు శిక్షణ పొందుతున్నారు. ఇద్దరు ఒలింపియన్లతో సహా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను ఈ కేంద్రం అందించింది.

 

***


(रिलीज़ आईडी: 2207947) आगंतुक पटल : 60
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Malayalam , Urdu , हिन्दी , Tamil , Kannada