ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

17వ భారత సహకార సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 01 JUL 2023 2:46PM by PIB Hyderabad

కేబినెట్ సహచరులు శ్రీ అమిత్ షాజాతీయ సహకార సంఘం అధ్యక్షులు శ్రీ దిలీప్ సంఘానిడాక్టర్ చంద్రపాల్ సింగ్ యాదవ్దేశ నలుమూలల నుంచి విచ్చేసిన సహకార సంఘాల సభ్యులందరూరైతు సోదరీసోదరులుఇతర ప్రముఖులుమహిళలుపెద్దలందరికీ నమస్కారం! 17వ భారత సహకార సదస్సు సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలుఈ సదస్సుకు మీకు సాదర స్వాగతం!

మిత్రులారా,

నేడు మన దేశం అభివృద్ధి చెందినస్వావలంబన భారత్ లక్ష్యం దిశగా పయనిస్తోందిమన లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరి కృషి అవసరమని నేను ఎర్రకోట నుంచి ప్రకటించానుసమష్టి కృషి అనే సందేశాన్ని సహకార స్ఫూర్తి చాటి చెబుతుందిపాల ఉత్పత్తిలో ఇవాళ మనం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండటానికిడైరీ సహకార సంఘాలు ఎంతో కృషి చేశాయిప్రపంచంలోనే అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ఒకటిఇందులోనూ సహకార సంఘాల పాత్ర కీలకమైనదిదేశవ్యాప్తంగా చిన్న రైతులకు సహకార సంఘాలు ప్రధానంగా ఊతమిచ్చాయిముఖ్యంగా డైరీ వంటి సహకార రంగాల్లో మన తల్లులుఅక్కాచెల్లెళ్ల భాగస్వామ్యం సుమారు 60 శాతం ఉందిఅభివృద్ధి చెందిన భారతదేశం కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు సహకార రంగానికి ప్రాధాన్యతనివ్వాలని మేం నిర్ణయించుకున్నాంఅమిత్ షా చెప్పినట్లుగా మొదటిసారిగా మేం సహకార శాఖకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిబడ్జెట్‌ను కేటాయించాంకార్పొరేట్ రంగానికి అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలువేదికలు సహకార సంఘాలకూ కల్పిస్తున్నాంసహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు పన్ను రేట్లను తగ్గించాంఈ రంగంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నాంసహకార బ్యాంకులను కూడా మా ప్రభుత్వం బలోపేతం చేసిందిఈ బ్యాంకులు కొత్త శాఖలను ప్రారంభించటానికిప్రజలకు ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందించటానికి వీలుగా నిబంధనలను సరళతరం చేశాం.

మిత్రులారా,

ఈ కార్యక్రమంలో మన రైతు సోదరీసోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారుగత ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలుసంస్కరణల ద్వారా వచ్చిన మార్పులను మీరు ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. 2014 కంటే ముందు రైతులు ఎదుర్కొన్న సమస్యలుచేసిన డిమాండ్లు మీకు గుర్తుండే ఉంటాయిఅప్పట్లో ప్రభుత్వాల నుంచి అందే సాయం చాలా తక్కువనిఅది కూడా మధ్యవర్తుల పాలవుతోందని రైతులు ఫిర్యాదు చేసేవారుదేశంలోని చిన్నమధ్యకారు రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేవి కాదుకానీ, 9 ఏళ్లలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయిందిఇవాళ కోట్ల మంది చిన్న రైతులకు నేరుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అందుతోందిఇప్పుడు మధ్యవర్తుల ప్రమేయమే కాదు.. నకిలీ లబ్దిదారులకు తావు లేదుగత నాలుగేళ్లలో ఈ పథకం కింద రూ. 2.5 లక్షల కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశాంమీరంతా సహకార రంగానికి నాయకత్వం వహిస్తున్నారుఈ గణాంకాలను మీరు నిశితంగా గమనిస్తారని ఆశిస్తున్నానుమరో గణాంకంతో దీన్ని పోల్చి చెబితేఇది ఎంత పెద్ద మొత్తమో మీకు అర్థమవుతుంది. 2014కు ముందు ఐదేళ్ల మొత్తం వ్యవసాయ బడ్జెట్‌ రూ. 90 వేల కోట్ల కంటే తక్కువేఅప్పట్లో వ్యవసాయ సంబంధిత వ్యవస్థపై దేశం ఖర్చు చేసిన దానికంటే దాదాపు రెట్లు ఎక్కువ మొత్తాన్ని కేవలం ఒకే ఒక్క పథకం.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి మేం ఖర్చు చేశాం.

మిత్రులారా,

ప్రపంచవ్యాప్తంగా ఎరువులురసాయనాల ధరలు పెరుగుతున్నప్పటికీమన రైతులపై ఆ భారం పడకుండా చూస్తామని మోదీ హామీ ఇస్తున్నారుకేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీకు ఈ గ్యారెంటీ ఇచ్చిందిమన రైతులకు ఈరోజు ఒక బస్తా యూరియా రూ. 270 కంటే తక్కువ ధరకే లభిస్తోందిఅదే బస్తా యూరియా బంగ్లాదేశ్‌లో రూ. 720, పాకిస్తాన్‌లో రూ. 800, చైనాలో రూ. 2100 ధర పలుకుతోందిసోదరీసోదరులారాఅమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలోనూ యూరియా బస్తాను రైతులు రూ. 3,000పైగా వెచ్చించి కొంటున్నారుబహుశా నేను చెప్పే విషయం మీకు అర్థం కావడం లేదనుకుంటానుఈ తేడాను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలిఅసలు గ్యారెంటీ అంటే ఏమిటిరైతు జీవితాన్ని మార్చటానికి ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తోందో ఇది తెలియజేస్తుందిగత ఏళ్లలో కేవలం ఎరువుల సబ్సిడీ కోసమే బీజేపీ ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసిందిదీనికంటే పెద్ద గ్యారెంటీ మరొకటి ఉంటుందా?

మిత్రులారా,

మొదట్నుంచి పంటలకు గిట్టుబాటు ధర అందించాలని మా ప్రభుత్వం భావించిందిగత ఏళ్లలో ఎంఎస్‌పీ పెంచడం ద్వారా రూ.15 లక్షల కోట్లకు పైగా రైతులకు లబ్ధి చేకూరిందిమీరు లెక్కించి చూస్తేకేంద్ర ప్రభుత్వం ఏటా వ్యవసాయానికిరైతులకు రూ. 6.5 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందిఅంటే ప్రభుత్వం ఏటాప్రతి రైతుకు ఏదో ఒక రూపంలో సగటున రూ. 50 వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తోందిబీజేపీ ప్రభుత్వంలో రైతులకు ఏటా పలు మార్గాల ద్వారా రూ. 50 వేలు అందుతాయనే గ్యారెంటీ ఉందిఇది మోదీ గ్యారెంటీఇవి కేవలం వాగ్దానాలు కాదు.. ఇప్పటికే మేం చేసిచూపిించిన వాటి గురించి నేను మాట్లాడుతున్నా.

మిత్రులారా,

రైతులకు అనుకూల విధానాల్లో భాగంగా కొన్ని రోజుల కిందట ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందిరైతుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 3,70,000 కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిందిచెరకు రైతులకు గిట్టుబాటు ధరను రికార్డు స్థాయిలో క్వింటాలుకు రూ. 315కు పెంచిందిదీనిద్వారా దేశవ్యాప్తంగా కోట్ల మందికిపైగా చెరుకు రైతులకుచక్కెర మిల్లుల్లో పనిచేసే లక్షలాది మంది కార్మికులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది.

మిత్రులారా,

దేశంలోని గ్రామాలురైతుల సామర్థ్యాన్ని మరింత పెంపొందించటానికి అమృత కాలంలో సహకార రంగం కీలక పాత్ర పోషించనుందిఅభివృద్ధి చెందిన భారత్స్వావలంబన భారత్ తీర్మానానికి ప్రభుత్వంసహకార రంగాలు కలిసి రెట్టింపు శక్తినిస్తాయిడిజిటల్ ఇండియా ద్వారా పారదర్శకతను పెంచిప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం నేరుగా ప్రయోజనాలను అందించిందిఉన్నత స్థాయిల్లో అవినీతిబంధుప్రీతి అంతమయ్యాయని దేశంలోని నిరుపేదలు సైతం నమ్ముతున్నారుసహకార రంగానికి ప్రోత్సాహం లభిస్తున్న తరుణంలో సామాన్యులురైతులుపశుపోషకులు కూడా దైనందిన జీవితంలో ఈ మార్పులను గమనించివిశ్వసించాల్సిన అవసరం ఉందిపారదర్శకతకుఅవినీతి రహిత పాలనకు సహకార రంగం ఒక నమూనాగా మారడం అత్యవసరందేశంలోని సహకార సంస్థలపై సాధారణ పౌరులకు నమ్మకం మరింత బలపడాలిఅది సాధ్యం కావాలంటే సహకార రంగంలో డిజిటల్ వ్యవస్థను వీలైనంత ఎక్కువగా ప్రోత్సహించాలినగదు లావాదేవీలపై ఆధారపడటాన్ని తగ్గించాలిదీనికోసం సహకార రంగం ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలిమీ కోసం నేను ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసికీలకమైన పనిని పూర్తి చేశానుఇప్పుడు మీరు కూడా డిజిటల్నగదు రహిత లావాదేవీల ద్వారా పూర్తి పారదర్శకతతో అంతే కీలకమైన బాధ్యతను నిర్వర్తించండిమనమంతా కలిసి కృషి చేస్తేఖచ్చితంగా అతి త్వరలోనే విజయం సాధిస్తాండిజిటల్ లావాదేవీల్లో భారత్ ప్రపంచ గుర్తింపును పొందిందిఈ నేపథ్యంలో సహకార సంఘాలుసహకార బ్యాంకులు కూడా ముందుండాలిదీనివల్ల పారదర్శకతతో పాటు మార్కెట్లో మీ పనితీరు మెరుగుపడిపోటీని ఎదుర్కోవటం సాధ్యమవుతుంది.

మిత్రులారా,

ప్రాథమిక స్థాయి సహకార సంఘాలలో అత్యంత కీలకమైన పీఏసీఎస్.. ఇకపై పారదర్శకతకుఆధునికతకు నమూనాగా మారనున్నాయిఇప్పటివరకు 60 వేలకు పైగా పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ పూర్తయిందిఇందుకు నా అభినందనలుసహకార సంఘాలు కూడా తమ పనితీరును మెరుగుపరుచుకోవటంసాంకేతిక పరిజ్ఞానం వాడకంపై దృష్టి సారించటం ఎంతో ముఖ్యంసహకార సంఘాలు అన్ని స్థాయిల్లో కోర్ బ్యాంకింగ్ వ్యవస్థను అవలంబించినప్పుడుసభ్యులందరూ 100 శాతం ఆన్‌లైన్ లావాదేవీలను నిర్వహించిప్పుడుదేశానికి ఎంతో మేలు జరుగుతుంది.

మిత్రులారా,

ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డులను సృష్టించటం మీరు చూస్తున్నారుమేక్ ఇన్ ఇండియాపై నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందిఇటువంటి పరిస్థితుల్లోఎగుమతుల రంగంలో సహకార సంఘాల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందిఈ లక్ష్యంతోనే ప్రత్యేకంగా తయారీ రంగానికి సంబంధించిన సహకార సంఘాలను మేం ప్రోత్సహిస్తున్నాంవాటిపై ఉండే పన్నులను కూడా చాలావరకు తగ్గించాంఎగుమతులను పెంచడంలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తోందిముఖ్యంగా పాల ఉత్పత్తి రంగంలో సహకార సంఘాలు ప్రశంసనీయమైన పనితీరును కనబరుస్తున్నాయిపాలపొడివెన్ననెయ్యి భారీ పరిమాణంలో ఎగుమతి అవుతున్నాయితేనె ఉత్పత్తి రంగంలోనూ సహకార సంఘాలు ప్రారంభమవుతున్నాయిగ్రామాలుగ్రామీణ ప్రాంతాల్లో శక్తికి కొదవ లేదుకానీ దృఢ నిశ్చయంతో మనం ముందుకు సాగాలిభారతదేశంలో తృణధాన్యాలుప్రపంచవ్యాప్తంగా 'శ్రీ అన్న'గా గుర్తింపు పొందిన మిల్లెట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయివీటి కోసం ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్కెట్ తయారవుతోందిఇటీవల నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి అధ్యక్షుడు ఇచ్చిన విందులో కూడా వివిధ రకాల 'శ్రీ అన్నవంటకాలున్నాయిభారత ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్ల ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్నాంసహకార సంఘాల మిత్రులు మన దేశ ఆహార ధాన్యాలను ప్రపంచ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు కృషి చేయలేరాదీనివల్ల చిన్న రైతులకు ఆదాయ వనరు లభిస్తుందిపోషక విలువలతో కూడిన ఆహారం విషయంలో ఒక కొత్త సంప్రదాయానికి ఇది నాంది పలుకుతుందిప్రభుత్వ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ మీరు దిశగా కృషి చేయాలి.

మిత్రులారా,

సంకల్ప బలంతో ఎంత పెద్ద సవాళ్లనైనా ఎదుర్కోవచ్చని కొన్నేళ్లుగా మనం నిరూపించాంఉదాహరణకుచెరకు సహకార సంఘాల గురించే మాట్లాడుకుందాంఒకప్పుడు చెరుకు రైతులకు తక్కువ ఆదాయం వచ్చేదిపైగా ఆ డబ్బు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండేదిచెరకు ఉత్పత్తి పెరిగినాతగ్గినా రైతులకు కష్టమే అన్నట్లుగా పరిస్థితి ఉండేదిదీంతో సహకార సంఘాలపై చెరకు రైతులకు నమ్మకం సన్నగిల్లిందిఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించటంపై మేం దృష్టి సారించాంచెరకు రైతుల పాత బకాయిలను చెల్లించటానికి చక్కెర మిల్లులకు రూ. 20 వేల కోట్ల ప్యాకేజీని మేం అందించాంచెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేసిపెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపటంపై మేం ప్రత్యేకంగా దృష్టి సారించాంఒక్కసారి ఊహించండిగత ఏళ్లలో చక్కెర మిల్లుల నుంచి రూ.70 వేల కోట్ల విలువైన ఇథనాల్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసిందిఇది రైతులకు చక్కెర మిల్లులు సకాలంలో చెల్లింపులు చేసేందుకు సహాయపడిందిగతంలో చెరకుకు ధర ఎక్కువగా చెల్లిస్తే పన్ను విధించేవారుమా ప్రభుత్వం ఆ పన్నును రద్దు చేసిందిదీనివల్ల దశాబ్దాలుగా ఉన్న పన్ను సంబంధిత సమస్యలు పరిష్కారమయ్యాయిఈ ఏడాది బడ్జెట్‌లోనూ పాత క్లెయిమ్‌లను పరిష్కరించుకోవటానికి సహకార చక్కెర మిల్లులకు రూ. 10,000 కోట్ల ప్రత్యేక సాయాన్ని అందించాంఈ ప్రయత్నాలన్నీ శాశ్వత మార్పులను తీసుకొస్తూచెరకు రంగంలోని సహకార సంఘాలను బలోపేతం చేస్తున్నాయి.

మిత్రులారా,

మనం ఎగుమతులను పెంచుకుంటూనేదిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలిఆహార ధాన్యాల విషయంలో భారతదేశం స్వయంసమృద్ధిని సాధించిందని మనం తరచుగా చెబుతుంటాంకానీ వాస్తవమేంటికేవలం గోధుమలువరిచక్కెరలో స్వయంసమృద్ధి సాధిస్తే సరిపోదుమనం ఆహార భద్రత గురించి మాట్లాడేటప్పుడు కేవలం గోధుమలుబియ్యానికే పరిమితం కాకూడదుమీకు కొన్ని విషయాలను గుర్తు చేయాలనుకుంటున్నానురైతు సోదరీసోదరులారామనం మేల్కోవాలిమీకు ఒక విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారువంట నూనెలుపప్పుధాన్యాలుచేపల ఆహారంఆహార రంగంలోని ఇతర ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల దిగుమతికి ఏటా రూ. 2 నుంచి 2.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాంఈ డబ్బు విదేశాలకు వెళ్తోందిఇంత మొత్తాన్ని మనం విదేశాలకు పంపాల్సి వస్తోందివ్యవసాయ ప్రాధాన్యత కలిగిన భారతదేశానికి ఇది సరైనదేనాఇంతటి అపారమైన అవకాశాలున్న సహకార రంగానికి నాయకత్వం వహిస్తున్న వారంతా నా ముందున్నారుమనం ఒక విప్లవాత్మక దిశగా అడుగులు వేయాలని ఆశిస్తున్నానుఈ డబ్బు భారతీయ రైతుల జేబుల్లోకి వెళ్లాలాలేక విదేశాలకు వెళ్లాలా?

మిత్రులారా,

మనదేశంలో అపారమైన చమురు లభ్యత లేకపోవటం వల్ల పెట్రోల్డీజిల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందిఅది మనకు ఒక అనివార్యతవంట నూనెల విషయంలో మాత్రం మనం స్వయంసమృద్ధి సాధించవచ్చుదీనికోసం కేంద్ర ప్రభుత్వం మిషన్ పామ్ ఆయిల్ వంటి కార్యక్రమాలతో మిషన్ మోడ్‌లో పనిచేస్తోందన్న విషయం మీకు తెలిసే ఉంటుందిమనం పామాయిల్ సాగును ప్రోత్సహించాంతద్వారా మనమే నూనెను ఉత్పత్తి చేసుకోవచ్చునూనెగింజల సాగును పెంచటానికి అనేక చర్యలు చేపడుతున్నాందేశంలోని సహకార సంస్థలు ఈ బాధ్యతను తీసుకుంటే అతి త్వరలోనే మనం వంట నూనెల విషయంలో స్వయంసమృద్ధి సాధించగలమని విశ్వసిస్తున్నానురైతుల్లో అవగాహన కల్పించటం నుంచి ప్లాంటేషన్సాంకేతికతకొనుగోలుకు సంబంధించిన సమాచారంసౌకర్యాలను అందించే వరకు మీరు ఎన్నో పనులను చేయవచ్చు.

మిత్రులారా,

మత్స్య రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరొక ముఖ్యమైన పథకాన్ని ప్రారంభించిందిపీఎం మత్స్య సంపద యోజన ద్వారా చేపల ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి కనిపిస్తోందిదేశవ్యాప్తంగా నదులుచిన్న చెరువుల ద్వారా గ్రామస్తులురైతులు ఈ పథకంతో అదనపు ఆదాయాన్ని పొందుతున్నారుఈ పథకం ద్వారా స్థానిక స్థాయిలోనే చేపల కోసం ఆహార ఉత్పత్తికి కూడా సహాయం అందిస్తున్నారుఇవాళ మత్స్య రంగంలో 25 వేలకు పైగా సహకార సంఘాలు పనిచేస్తున్నాయిఫలితంగా చేపల ప్రాసెసింగ్ఎండబెట్టటంనిల్వ చేయటంనిల్వ కేంద్రాలుడబ్బాల్లో ప్యాక్ చేయటంరవాణా వంటి కార్యకలాపాలన్నీ వ్యవస్థీకృత పద్ధతిలో బలోపేతమయ్యాయిఇది మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచటమే కాక ఉపాధిని కూడా పెంచిందిగత ఏళ్లలో స్థానిక మత్స్య సంపద రెట్టింపైందిప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినప్పుడు ఎలాగైతే కొత్త శక్తి పుట్టుకొచ్చిందోఅలాగే మత్స్య రంగానికీ ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలనే డిమాండ్ చాలా కాలంగా ఉండేదిమేం ఆ శాఖను కూడా ఏర్పాటు చేశాందానికి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాందీని ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయిఈ కార్యక్రమాన్ని సహకార రంగం ఎలా విస్తరించగలదోఆలోచించేందుకు మీరంతా ముందుకు రావాలినేను మీ నుంచి దీన్ని ఆశిస్తున్నానుపాత పద్ధతులను దాటి సహకార రంగం కొత్తగా ఏదైనా చేయాల్సి ఉందితన వంతుగా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందిఇప్పుడు చేపల పెంపకం వంటి అనేక రంగాల్లో పీఏసీఎస్ పాత్ర పెరుగుతోందిదేశవ్యాప్తంగా లక్షల కొత్త బహుళ ప్రయోజన సహకారం సంఘాలను సృష్టించే లక్ష్యంతో మేం పనిచేస్తున్నాంఅమిత్ షా చెప్పినట్లుగాఅన్ని పంచాయతీలను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుందిదీనివల్ల ప్రస్తుతం ఈ వ్యవస్థ లేని గ్రామాలకుపంచాయతీలకూ సహకార శక్తి చేరుతుంది.

మిత్రులారా,

గత కొన్నేళ్లుగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు.. ఎఫ్‌పీఓల ఏర్పాటుపైనా మేం ప్రత్యేక దృష్టి సారించాంప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,000 కొత్త ఎఫ్‌పీఓలను సృష్టించే పని కొనసాగుతోందిఇప్పటికే ఏర్పాటైన దాదాపు 5,000 సంఘాలు ఏర్పాటయ్యాయిఈ ఎఫ్‌పీఓలు చిన్న రైతులకు ఎంతో ప్రోత్సాహం అందిస్తాయిచిన్న రైతులను మార్కెట్లో ఒక పెద్ద శక్తిగా మార్చటానికి ఇవి ఒక సాధనంవిత్తనం నాటినప్పటి నుంచి పంటను మార్కెట్లో విక్రయించే వరకు ప్రతి వ్యవస్థనూ చిన్న రైతుకు అనుకూలంగా మార్చుకునేలామార్కెట్ శక్తులను సవాలు చేసేలా ఈ ప్రచారం భరోసానిస్తుందిపీఏసీఎస్ ద్వారా కూడా ఎఫ్‌పీఓలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందిఅందుకే ఈ రంగంలో సహకార సంఘాలకు అపారమైన అవకాశాలున్నాయి.

మిత్రులారా,

రైతులకు ఇతర ఆదాయ వనరులను కల్పించే విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలకు సహకార రంగం మరింత బలాన్ని చేకూర్చగలదుతేనె ఉత్పత్తి కావచ్చుసేంద్రీయ ఆహారం కావచ్చుపొలాల్లో సోలార్ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసివిద్యుత్తును ఉత్పత్తి చేసే కార్యక్రమం కావచ్చు లేదా భూసార పరీక్ష కావచ్చు.. వీటన్నింటిలో సహకార రంగం తోడ్పాటు అత్యంత అవసరం.

మిత్రులారా,

రసాయన రహితప్రకృతి వ్యవసాయం ఇవాళ ప్రభుత్వానికి అత్యంత కీలకమైన అంశాలుమన హృదయాలను కదిలించిన ఢిల్లీకి చెందిన ఆడబిడ్డలను అభినందిస్తున్నా. "నన్ను చంపవద్దుఅని భూమాత రోదిస్తూ చెబుతున్న మాటలను నాటక ప్రదర్శన ద్వారా చక్కగా వివరించిప్రజలను మేల్కొల్పే ప్రయత్నం చేశారుఇలాంటి బృందాన్ని ప్రతి సహకార సంస్థ ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నానుఆ బృందాలు ప్రతి గ్రామంలోనూ ప్రదర్శనలిచ్చి ప్రజల్లో అవగాహన కల్పించిచైతన్యపరచాలిఇటీవలే పీఎం-ప్రణామ్ భారీ పథకానికి ఆమోదం లభించిందివీలైనంత ఎక్కువ మంది రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని చేసేలా ప్రోత్సహించటమే దీని ముఖ్య ఉద్దేశ్యందీనిద్వారా ప్రత్యామ్నాయ ఎరువులుసేంద్రీయ ఎరువుల ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించటం వల్ల నేల సురక్షితంగా ఉండటమే కాకరైతులకు సాగు ఖర్చు కూడా తగ్గుతుందిఇందుకోసం సహకార సంస్థల తోడ్పాటు చాలా కీలకంఈ ప్రచారంలో వీలైనంత ఎక్కువ సహకార సంస్థలు భాగస్వాములు కావాలని కోరుతున్నామీ జిల్లాలోని కనీసం గ్రామాల్లో 100 శాతం రసాయన రహిత వ్యవసాయం జరిగేలాఆ గ్రామాల్లోని ఏ పొలంలోనూ ఒక్క గ్రాము రసాయనం కూడా వాడకుండా చూడాలిదీనివల్ల జిల్లావ్యాప్తంగా అవగాహన పెరిగిఅందరి కృషి కూడా రెట్టింపు అవుతుంది.

మిత్రులారా,

రసాయన రహిత వ్యవసాయాన్నిరైతులకు అదనపు ఆదాయాన్నితెచ్చిపెట్టే మరొక ముఖ్యమైన మిషన్ ఉందిఅదే గోవర్ధన్ యోజనఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా వ్యర్థాల నుంచి సంపదను సృష్టిస్తున్నారుఆవు పేడఇతర వ్యర్థాల నుంచి విద్యుత్తునుసేంద్రీయ ఎరువులను తయారుచేయటానికి ఇదొక గొప్ప మార్గమైందిఇలాంటి ప్లాంట్ల భారీ వ్యవస్థను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందిఇప్పటికే అనేక పెద్ద కంపెనీలు దేశంలో 50కి పైగా బయో-గ్యాస్ ప్లాంట్లను నిర్మించాయిఈ గోవర్ధన్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకార సంఘాలు ముందుకు రావాల్సిన అవసరం ఉందిదీనివల్ల పశుపోషకులకు తప్పకుండా లాభం చేకూరుతుందిఅదే సమయంలో రోడ్లపై వదిలివేసిన పశువుల వల్ల కూడా ప్రయోజనం పొందవచ్చు.

మిత్రులారా,

మీరంతా పాడి పరిశ్రమపశుసంవర్ధక రంగాల్లో విస్తృతంగా పనిచేస్తున్నారుసహకార ఉద్యమంతో పెద్ద సంఖ్యలో పశుపోషకులు ముడిపడి ఉన్నారనే విషయం మనందరికీ తెలిసిందేజంతువులకు వచ్చే వ్యాధులు రైతును ఎంతటి చిక్కుల్లో పడేస్తాయో మీకు బాగా తెలుసుముఖ్యంగా గాలికుంటు వ్యాధి చాలా కాలంగా పశువులకు తీవ్రమైన బాధను కలిగిస్తోందిఈ వ్యాధి కారణంగా పశుపోషకులు ఏటా వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నారుమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దీని నివారణకు ఉచిత టీకా ప్రచారాన్ని ప్రారంభించిందిమనకు కోవిడ్ సమయంలో అందించిన ఉచిత వ్యాక్సిన్ బాగా గుర్తుందిఅదే తరహాలో పశువులకు ఉచిత టీకాలు అందించేందుకు ఈ భారీ కార్యక్రమం కొనసాగుతోందిదీనిద్వారా ఇప్పటికే 24 కోట్ల పశువులకు టీకాలు వేశారుఅయినప్పటికీ గాలికుంటు వ్యాధి నిర్మూలన పూర్తిగా జరగలేదుటీకా ప్రచారమైనాపశువుల గుర్తింపైనాసహకార సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు రావాలిపాడి పరిశ్రమలో కేవలం పశుపోషకులు మాత్రమే భాగస్వాములు కాదని గుర్తుంచుకోవాలిమిత్రులారానా భావాలను గౌరవించండిపాడి పరిశ్రమలో పశుపోషకులు మాత్రమే కాదు.. పశువులు కూడా సమాన భాగస్వాములేకాబట్టి ఈ పనిని బాధ్యతగా భావించిమన వంతు కృషి చేయాలి.

మిత్రులారా,

ప్రభుత్వ లక్ష్యాలను విజయపథంలో నడిపించేందుకు సహకార సంస్థలకున్న శక్తి సామర్థ్యాలపై నాకు ఎటువంటి సందేహం లేదునా సొంత రాష్ట్రంలో సహకార రంగ ప్రభావాన్ని స్వయంగా చూశానుస్వాతంత్ర్య ఉద్యమంలో కూడా సహకార సంస్థలు కీలక పాత్ర పోషించాయిఅందుకేమరో ముఖ్యమైన కార్యంలో భాగస్వాములు కావాలని మిమ్మల్ని కోరుతున్నానుదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగాప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవరాలను నిర్మించాలని పిలుపునిచ్చానుఆ తర్వాత ఏడాదిలోపు దేశవ్యాప్తంగా సుమారు 60 వేల అమృత్ సరోవరాల నిర్మాణం జరిగిందిగత ఏళ్లుగా ప్రతి ఇంటికిప్రతి పొలానికి తాగుసాగు నీరు అందించటానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది కొనసాగింపు కార్యక్రమంరైతులుపశువులకు నీటి కొరత లేకుండా వనరులను పెంచుకోవటానికి ఇది ఉత్తమ మార్గంఅందుకే సహకార రంగంలోని మిత్రులందరూ ఈ పవిత్రమైన ఉద్యమంలో చేరాలిమీరు సహకార రంగంలో ఏ విభాగంలో ఉన్నామీ శక్తి సామర్థ్యాల మేరకు ఎన్ని చెరువులు నిర్మించాలో నిర్ణయించుకోండిఅది ఒకటిరెండు లేదా పది కావచ్చుకానీ నీటి సంరక్షణ దిశగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయండిప్రతి గ్రామంలో అమృత్ సరోవరం నిర్మిస్తేరాబోయే తరాలు మనల్ని ఎంతో కృతజ్ఞతతో గుర్తుంచుకుంటాయితమకు లభిస్తున్న నీరు పూర్వీకుల శ్రమ ఫలితమని గర్విస్తారుభవిష్యత్తు తరాల కోసం మనం ఏదో ఒకటి మిగిల్చి వెళ్లాలినీటి సంరక్షణకు మరో ముఖ్యమైన ప్రచార కార్యక్రమం పర్ డ్రాప్ మోర్ క్రాప్స్మార్ట్ ఇరిగేషన్‌పై రైతులకు అవగాహన కల్పించటం ఎంతో ముఖ్యంఎక్కువ నీరు ఉంటేనే ఎక్కువ పంట పండుతుందని అనుకోవడం పొరపాటుప్రతి గ్రామంలో సూక్ష్మ నీటి పారుదల విస్తరణకు సహకార సంఘాలు కీలక పాత్ర పోషించాలిఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలనుప్రోత్సాహకాలను అందిస్తోంది.

మిత్రులారా,

నిల్వ సౌకర్యం కూడా ఒక ప్రధాన సమస్యదీని గురించి అమిత్ షా సవివరంగా చెప్పారుసరైన నిల్వ వసతులు లేకపోవటం వల్ల ఆహార ధాన్యాలు వృథా అవుతున్నాయిఇది దీర్ఘకాలంలో ఆహార భద్రతకురైతులకు ముప్పుగా పరిణమించిందిప్రస్తుతం భారతదేశంలో పండించే ఆహార ధాన్యాల్లో 50 శాతం కంటే తక్కువ మాత్రమే నిల్వ చేయగలిగే పరిస్థితి ఉందిఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వ పథకాన్ని తీసుకువచ్చిందిదశాబ్దాలుగా దేశంలో జరిగిన కృషి ఫలితంగా ప్రస్తుతం మన వద్ద 1400 లక్షల టన్నులకు పైగా నిల్వ సామర్థ్యం ఉందిరాబోయే ఏళ్లలో దీనికి అదనంగా మరో 50 శాతంఅంటే సుమారు 700 లక్షల టన్నుల కొత్త నిల్వ సామర్థ్యాన్ని నిర్మించాలని మేం సంకల్పించాంఇదొక భగీరథ ప్రయత్నంఇది దేశంలోని రైతుల సామర్థ్యాన్ని పెంచడమే కాకగ్రామాల్లో నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందిమొదటిసారిగా మన ప్రభుత్వంగ్రామాల్లో వ్యవసాయ సంబంధిత మౌలిక సదుపాయాలకు లక్ష కోట్ల రూపాయల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిందిగత ఏళ్లలోనే దీనిద్వారా రూ. 40,000 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిసిందిఇందులో సహకార సంఘాలుపీఏసీఎస్ వాటా చాలా ఎక్కువవ్యవసాయ క్షేత్రాల వద్దే మౌలిక సదుపాయాలుకోల్డ్ స్టోరేజ్ వంటి వ్యవస్థల నిర్మాణంలో సహకార రంగం మరిన్ని ప్రయత్నాలు చేయాలి.

మిత్రులారా,

నవ భారతంలో సహకార సంఘాలు దేశ ఆర్థిక వ్యవస్థలో శక్తివంతంగా మారతాయని నేను విశ్వసిస్తున్నానుసహకార నమూనాను అనుసరిస్తూస్వయంసమృద్ధి సాధించే గ్రామాల నిర్మాణ దిశగా మనం అడుగులు వేయాలిఈ పరివర్తనను మరింత మెరుగుపరచాలన్న అంశంపై మీ చర్చలు అత్యంత కీలకం కానున్నాయిసహకార సంఘాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించటంపై కూడా మనం చర్చించాలిసహకార సంఘాలు రాజకీయ వేదికలు కాకుండా.. సామాజికజాతీయ విధానాలకు ప్రతిరూపాలుగా మారాలిమీ సూచనలు దేశంలోని సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాయనిఅభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో తోడ్పడతాయని నమ్ముతున్నామరోసారి మీ అందరి మధ్యకు వచ్చే అవకాశం లభించటాన్ని గౌరవంగా భావిస్తున్నామీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు!

ధన్యవాదాలు!

గమనికప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం.

 

***


(रिलीज़ आईडी: 2206325) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Kannada , Assamese , Manipuri , Odia , English , Bengali , Malayalam