రైల్వే మంత్రిత్వ శాఖ
క్రిస్మస్, నూతన సంవత్సరం నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్న భారతీయ రైల్వేలు: 650 ట్రిప్పులకు ఆమోదం, వాటిలో ప్రకటించిన ట్రిప్పుల సంఖ్య 244
వచ్చే నెల రోజుల్లో 650 ట్రిప్పులను కవర్ చేయనున్న 138 ప్రత్యేక రైళ్లు
26 ప్రత్యేక రైళ్లు, 226 ఆమోదించిన ట్రిప్పులతో అగ్రస్థానంలో
నిలిచిన పశ్చిమ రైల్వే: ఆమోదించిన 118 ట్రిప్పులతో 18 రైళ్లను నడుపుతున్న మధ్య రైల్వే
प्रविष्टि तिथि:
18 DEC 2025 2:46PM by PIB Hyderabad
2025-26 క్రిస్మస్, నూతన సంవత్సర నేపథ్యంలో పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తొమ్మిది జోన్లలో ప్రత్యేక రైళ్లను విస్తృతంగా నడిపేందుకు రైల్వే ప్రణాళిక సిద్ధం చేసింది. 138 ప్రత్యేక రైళ్లను కేటాయించగా, ఇప్పటి వరకూ ఆమోదించిన 650 ట్రిప్పుల్లో 244 ట్రిప్పులను ప్రకటించారు.
పశ్చిమ రైల్వే (డబ్ల్యూఆర్) అత్యధికంగా 26 రైళ్లను, 226 ట్రిప్పులను ఆమోదించగా, 72 ట్రిప్పులను ప్రకటించారు. 118 ఆమోదించిన ట్రిప్పులతో 18 రైళ్లను మధ్య రైల్వే (సీఆర్) నడుపుతోంది. వీటిలో 76 ట్రిప్పులను ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) 34 ఆమోదిత ట్రిప్పులతో 26 రైళ్లను నడిపేందుకు ప్రణాళిక రచించింది. వీటిలో 26 ట్రిప్పులను ప్రకటించింది. ఆగ్నేయ మధ్య రైల్వే (ఎస్ఈసీఆర్) 12 రైళ్లను 82 ఆమోదిత ట్రిప్పులతో నడుపుతోంది. వాటిలో ప్రకటించిన ట్రిప్పులు 24.
నైరుతి రైల్వే (ఎస్‌డబ్ల్యూఆర్) 42 ఆమోదిత ట్రిప్పులతో 20 రైళ్లను నడిపాలని నిర్ణయించింది. 28 ట్రిప్పుల వివరాలను ప్రకటించారు. అలాగే వాయువ్య రైల్వే (ఎన్‌డబ్ల్యూఆర్) 72 ఆమోదిత ట్రిప్పులతో 14 రైళ్లను నడుపుతోంది. వాటిలో 6 ట్రిప్పులు నోటిఫై అయ్యాయి. ఈశాన్య రైల్వే (ఎన్ఈఆర్) 6 ఆమోదిత ట్రిప్పులతో రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని ప్రతిపాదించింది. వాటిలో దేనినీ నోటిఫై చేయలేదు. ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే (ఎన్ఎఫ్ఆర్) 4 ఆమోదిత ట్రిప్పులతో 2 ట్రైన్లను నడిపనుంది. వాటిలో 4 ట్రిప్పులను ప్రకటించింది.
క్రిస్మస్, నూతన సంవత్సరం 2025-26 కోసం షెడ్యూలు చేసిన రైళ్ల సంక్షిప్త సమాచారం
ముంబయి-గోవా (కొంకణ్) కారిడార్‌లో ముంబయి సీఎస్ఎంటీ/ఎల్‌టీటీ, కర్మాలీ/మడ్గావ్ మధ్య రోజువారీ, వారాంతపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ప్రధాన కేంద్రాలను అనుసంధానిస్తూ.. సీటింగ్, స్లీపర్ ఆప్షన్లను అందిస్తుంది. అదే విధంగా సాధారణ రైళ్లలో రద్దీని తగ్గించి ప్రయాణికులకు పండగ సీజన్లో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ముంబయి-నాగపూర్, పుణె-సంగనేర్, మహారాష్ట్రలోని ఇతర మార్గాల్లో నడుపుతున్న ప్రత్యేక సర్వీసులు దోహదపడుతున్నాయి. ఉత్తర, తూర్పు భారత దేశంలో ఢిల్లీ, హౌరా, లక్నో, పరిసర నగరాలను కలిపే రద్దీగా ఉండే కారిడార్లలో దూర ప్రాంత ప్రయాణికుల కోసం లేదా పర్యాటక ప్రాంతాలకు చేరుకునేందుకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.
ఈ రద్దీ సమయంలో ప్రయాణికులకు ప్రయాణ సౌలభ్యాన్ని అందించేందుకు దక్షిణ, మధ్య ప్రాంతాల్లో హైదరాబాద్, బెంగళూరు, మంగళూరు, ఇతర నగరాలను కలిపే మార్గాల్లో అదనపు సర్వీసులను నడుపుతున్నారు. ట్రైన్ 1151 సీఎస్ఎంటీ-కర్మాలీ, ట్రైన్ 1152 కర్మాలీ-సీఎస్ఎంటీ, ట్రైన్ 1171 ఎల్‌టీటీ-తిరువనంతపురం, ట్రైన్ 1405 పుణె-సంగనేర్, ట్రైన్ 1005 సీఎస్ఎంటీ-నాగపూర్‌తో పాటు ఇతర రైళ్లను పండగ రద్దీని తగ్గించడం కోసం నడుపుతున్నారు. అదనపు సామర్థ్యాన్ని, సౌకర్యాన్ని, సదుపాయాన్ని కల్పించేందుకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అలాగే ఎలాంటి ప్రయాణ ఒత్తిడి లేకుండా క్రిస్మస్, నూతన సంవత్సరం 2026 నిర్వహించుకొనేలా ప్రయాణికులకు సహకరిస్తుంది. అదే సమయంలో వారిని దేశవ్యాప్తంగా ఉన్న బీచులు, నగరాలు, పర్యాటక ప్రాంతాలకు సమర్థంగా చేరవేస్తుంది.
క్రిస్మస్, నూతన సంవత్సరం 2025-26 లో జోన్ల వారీగా రైళ్ల వివరాలు దిగువ పేర్కొన్న లింకులో ఉన్నాయి.
https://docs.google.com/spreadsheets/d/1qK7KiNmvQ25rf69I4YViLq7jkPjo6PkFY3kHEdd6sGk/edit?usp=sharing
***
(रिलीज़ आईडी: 2206122)
आगंतुक पटल : 7