ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ శిల్పి శ్రీ రామ్ సుతార్ మృతికి ప్రధాని సంతాపం
प्रविष्टि तिथि:
18 DEC 2025 12:01PM by PIB Hyderabad
శ్రీ రామ్ సుతార్ మరణం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
శ్రీ రామ్ సుతార్ అసాధారణ శిల్పి అని, కేవడియాలోని ఐక్యతా మూర్తితో సహా దేశంలో అనేక ప్రసిద్ధ శిల్పాలను అందించారని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశ చరిత్రను, సంస్కృతిని, సమైక్యతా స్ఫూర్తిని వ్యక్తం చేసే శక్తిమంతమైన చిహ్నాలుగా ఆయన శిల్పాలు ఎల్లప్పడూ ప్రశంసలు అందుకుంటూనే ఉంటాయన్నారు. భవిష్యత్తు తరాల కోసం ఈ దేశపు గొప్పతనాన్ని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారని కొనియాడారు. కళాకారులకు, ప్రజలకు ఆయన శిల్పాలు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు.
(रिलीज़ आईडी: 2206107)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam