సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సామాజిక మాధ్యమాల నుంచి ఓటీటీ వేదికల వరకు: ఆన్‌లైన్‌లో అశ్లీలత, తప్పుడు సమాచారం, సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు
ముఖ్యంగా మహిళలు, చిన్నారుల కోసం సురక్షితమైన, విశ్వసనీయమైన,
జవాబుదారీతనంతో కూడిన ఇంటర్నెట్ వాతావరణాన్ని కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం
ఐటీ చట్టం, ఐటీ నియమాలు 2021, భారతీయ న్యాయ సంహిత ద్వారా అశ్లీలమైన, హానికరమైన,
చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ సమాచారాన్ని అరికట్టేందుకు చర్యలు
50 లక్షలకు పైగా వినియోగదారులను కలిగిన ప్రధాన సామాజిక మాధ్యమాల వేదికలు కచ్చితంగా
స్థానిక అధికారులను నియమించి, సమ్మతి నివేదికలను ప్రచురించాలి
प्रविष्टि तिथि:
17 DEC 2025 2:23PM by PIB Hyderabad
వినియోగదారులకు ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన, నమ్మకమైన, జవాబుదారీతనంతో కూడిన ఇంటర్నెట్‌ను అందించడమే ప్రభుత్వం విధానాల ముఖ్య లక్ష్యం.
ఇంటర్నెట్‌లో ఎలాంటి చట్టవిరుద్ధమైన సమాచారం, ముఖ్యంగా అశ్లీలత, అసభ్యకరమైనదిగా ఉండకూడదని ప్రభుత్వం సంకల్పించింది.
సామాజిక మాధ్యమాల్లో చట్టవిరుద్ధమైన సమాచారాన్ని అరికట్టేందుకు చట్టపరమైన చర్యలు
సమాచార సాంకేతిక చట్టం 2000
ఐటీ చట్టం, సమాచార సాంకేతికత (మధ్యవర్తుల మార్గదర్శకాలు,సామాజిక మాధ్యమాల నైతిక నియమావళి) నియమాలు, ఐటీ నియమాలు 2021 సంయుక్తంగా కలిసి డిజిటల్ వేదికల్లో చట్టవిరుద్దమైన, హానికరమైన సమాచారాన్ని నియంత్రించేందుకు కఠినమైన వ్యవస్థను ఏర్పాటు చేశాయి.
ఈ చట్టాలు మధ్యవర్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా స్పష్టమైన బాధ్యతలను విధిస్తాయి.
ఐటీ చట్టం ప్రకారం గోప్యత ఉల్లంఘనలు (సెక్షన్ 66ఈ), అసభ్యమైన, అశ్లీల సమాచారాన్ని ప్రచురించడం లేదా ప్రసారం చేయడం (సెక్షన్లు 67, 67ఏ, 67బీ) వంటి వివిధ సైబర్ నేరాలకు శిక్షలు విధించనుంది.
నేరాలను దర్యాప్తు చేయడానికి (సెక్షన్ 78), బహిరంగ ప్రదేశాల్లో తనిఖీ చేయడం, అనుమానిత వ్యక్తులను అరెస్టు చేయడం (సెక్షన్ 80) వంటి అధికారాలను పోలీసులకు ఈ చట్టం కల్పిస్తోంది.
ఐటీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) నియమాలు, 2021
సామాజిక మాధ్యమాల మధ్యవర్తులతో సహా ఇతర మధ్యవర్తులపై తగిన శ్రద్ధ వహించాల్సిన బాధ్యతను ఐటీ నియమాలు 2021 తెలుపుతుంది. చట్టవిరుద్ధమైన సమాచారాన్ని ప్రసారం చేయకుండా, నిరోధించడానికి ఈ బాధ్యతలను సమర్థవంతంగా అమలు చేయాలని వాటిని ఆదేశిస్తాయి.
ఐటీ నియమాలు 2021లోని ముఖ్య నిబంధనలు:
|
నిబంధన
|
వివరాలు
|
|
నిబంధన 3(1)(బి) ప్రకారం పరిమిత సమాచారం
|
కింది పేర్కొన్న విధంగా ఉండే సమాచారాన్ని ప్రసారం చేయడం, నిల్వ చేయడం, ప్రదర్శించడం లేదా ప్రచురించడాన్ని పరిమితం చేస్తుంది.
-
అశ్లీలమైన, అసభ్యమైన, ఇతరుల గోప్యతను ఉల్లంఘించేది, లింగ ఆధారంగా అవమానకరంగా లేదా వేధింపుగా ఉండేది. జాతిపరంగా వంశ ఆధారంగా అభ్యంతరకరమైనది, ద్వేషం, హింసను ప్రోత్సహించడం;
-
పిల్లలకు హానికరమైనది;
-
డీప్‌ఫేక్‌లతో సహా, మోసం చేసే లేదా తప్పుదారి పట్టించడం;
-
కృత్రిమ మేధ సహా, ఇతరులను అనుకరించడం;
-
జాతీయ భద్రతకు, శాంతి భద్రతలకు ముప్పు కలిగించడం;
-
వర్తించే ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించడం.
|
|
వినియోగదారుల అవగాహన
బాధ్యతలు
|
చట్టవిరుద్ధమైన సమాచారాన్ని ప్రసారం చేయడం వల్ల కలిగే పరిణామాలు, సమాచారం తొలగింపు, ఖాతా నిలిపివేత లేదా రద్దు వంటి వాటి గురించి మధ్యవర్తులు సేవా నిబంధనలు, వినియోగదారు ఒప్పందాల ద్వారా వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలి.
|
|
సమాచారం తొలగింపులో జవాబుదారీతనం
|
కోర్టు ఆదేశాలు, ప్రభుత్వం నుంచి హేతుబద్దమైన సమాచారం, వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగా చట్టవిరుద్ధమైన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా తొలగించడానికి త్వరితగతిన చర్యలు మధ్యవర్తులు తీసుకోవాలి.
|
|
ఫిర్యాదుల పరిష్కారం
|
-
మధ్యవర్తులు ఫిర్యాదు అధికారులను నియమించాలి
-
చట్టవిరుద్ధమైన సమాచారాన్ని 72 గంటల్లోపు తొలగించడం ద్వారా ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించాలి.
-
గోప్యతను ఉల్లంఘించే, వ్యక్తులను నకిలీగా నటించే, అశ్లీలతను చూపించే సమాచారంపై వచ్చిన ఫిర్యాదుపై 24 గంటల్లోపు పరిష్కరించాలి.
|
|
ఫిర్యాదు అపీలేట్ కమిటీల వ్యవస్థ
|
తమ ఫిర్యాదులను మధ్యవర్తుల ఫిర్యాదు అధికారులు పరిష్కరించకపోతే వినియోగదారులు www.gac.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
ఫిర్యాదు అపీలేట్ కమిటీలు సమాచార నియంత్రణ నిర్ణయాలపై బాధ్యతాయుత పారదర్శకతను నిర్ధారిస్తాయి.
|
|
మధ్యవర్తుల ద్వారా ప్రభుత్వ సంస్థలకు
సహాయం
|
వ్యక్తుల గుర్తింపును ధ్రువీకరించడానికి, సైబర్ భద్రతా పరమైన సంఘటనలతో సహా ఇతర నేరాల
నివారణ, గుర్తింపు, దర్యాప్తు లేదా విచారణ కోసం మధ్యవర్తిత్వ సంస్థలు తమ నియంత్రణలో ఉన్న
సమాచారాన్ని, సహాయాన్ని అధికారిక ప్రభుత్వ సంస్థలకు తప్పనిసరిగా అందించాలి.
|
|
ప్రాముఖ్యత కలిగిన సోషల్ మీడియా మధ్యవర్తుల అదనపు బాధ్యతలు
(దేశంలో 50 లక్షల లేదా అంతకంటే ఎక్కువ నమోదు అయిన వినియోగదారులున్న సోషల్ మీడియా మధ్యవర్తులు)
|
-
మెసెజ్ సేవలను అందించే ఎస్‌ఎస్‌ఎంఐలు తీవ్రమైన, సున్నితమైన సమాచారాన్ని పోస్టు చేసే వారిని గుర్తించడంలో అధికారులకు సహకరించాలి.
-
కొన్ని చట్టవిరుద్ధమైన సమాచార వ్యాప్తిని గుర్తించడానికి, పరిమితం చేయడానికి ఎస్‌ఎస్‌ఎంఐలు స్వయంచాలిత సాధనాలను ఉపయోగించాలి.
-
సమ్మతి నివేదికలను ప్రచురించడానికి స్థానిక అధికారులను నియమించాలి. పాలన, చట్ట అమలు సమన్వయానికి భారతీయ చిరునామాను అందించాలి.
-
ఎస్‌ఎస్‌ఎంఐలు స్వయంగా చర్యలు తీసుకునే ముందు స్వచ్ఛంద వినియోగదారు ధ్రువీకరణ, అంతర్గత అప్పీళ్లు, న్యాయమైన విచారణను అందించాలి.
|
ఒకవేళ ఐటీ నియమాలు 2021లో పేర్కొన్న చట్టపరమైన విధులను నిర్వర్తించడంలో మధ్యవర్తులు విఫలమైతే.. వారు ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద థర్డ్ పార్టీ సమాచారానికి సంబంధించి లభించే మినహాయింపును కోల్పోతారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం తదుపరి చర్యలు లేదా విచారణకు బాధ్యులవుతారు.
భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 2023
సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే నేరాలను, ఆన్‌లైన్‌లో హానికర, అశ్లీలత, తప్పుడు సమాచారం, ఇతర సైబర్-ఆధారిత నేరాలకు సంబంధించిన వాటిని పరిష్కరించడానికి న్యాయపరమైన చర్యలను 2023 బీఎన్‌ఎస్ చట్టం బలోపేతం చేస్తుంది.
అసభ్య చర్యలు (సెక్షన్ 296), ఎలక్ట్రానిక్ రూపంలో ప్రదర్శించే అశ్లీల సమాచారంతో సహా, అశ్లీల సామగ్రిని విక్రయించడం (సెక్షన్ 294) వంటి నేరాలకు శిక్షను విధిస్తుంది.
ఓటీటీ వేదికల్లో హానికర సమాచార ప్రతికూలప్రభావాలను నియంత్రించడానికి ప్రభుత్వం 25 ఫిబ్రవరి 2021న ఐటీ చట్టం 200 ప్రకారం సమాచార సాంకేతికత (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా, నైతిక నియమావళి) నియమాలు, 2021ని నోటిఫై చేసింది.
నిబంధనలు భాగం-3లో డిజిటల్ వార్తా ప్రచురణకర్తలు, ఆన్‌లైన్ క్యూరేటెడ్ కంటెంట్ ప్రచురకుల కోసం ఒక నైతిక నియమావళిని అందిస్తుంది.
ఓటీటీ వేదికలు ప్రస్తుత చట్టం ద్వారా నిషేధించిన ఏదైనా సమాచారాన్ని ప్రసారం చేయకూడదు.
ఇప్పటి వరకు దేశంలో అశ్లీల సమాచారాన్ని ప్రదర్శించిన కారణంగా 43 ఓటీటీ వేదికలను ప్రభుత్వం నిలిపివేసింది.
ఈ సమాచారాన్ని సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లోక్‌సభలో శ్రీ నిషికాంత్ దుబే అడిగిన ప్రశ్నకు సమాధానంగా అందించారు.
***
(रिलीज़ आईडी: 2205989)
आगंतुक पटल : 4