రైల్వే మంత్రిత్వ శాఖ
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 2019 నుంచి ఇప్పటి వరకు 7.5 కోట్ల మంది ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించింది
భారత్ అంతటా 164 వందే భారత్ రైలు సర్వీసులు నడుస్తున్నాయి..
ఇవి 274 జిల్లాల్లో సంధానతను, పర్యటనలను పెంచుతున్నాయి
प्रविष्टि तिथि:
16 DEC 2025 6:48PM by PIB Hyderabad
భారతీయ రైల్వేలకు చెందిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలను 2019లో మొదలుపెట్టినప్పటి నుంచీ భారత్‌లో రైలు ప్రయాణానికి సరికొత్త భాష్యాన్ని చెప్పింది. ప్రస్తుతం, 164 ప్రపంచ స్థాయి వందే భారత్ సర్వీసులు దేశంలో ప్రధాన నగరాలన్నిటినీ కలుపుతున్నాయి. ఇవి వేగవంతమైన, సురక్షితమైన, మరింత హాయిగా ఉండే ప్రయాణాల్ని అందిస్తున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ఎంత ప్రజాదరణ ఉందీ ఈ రైళ్లలో ప్రయాణిస్తున్న వారి సంఖ్యలను చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. 2019 నుంచీ, 7.5 కోట్ల కన్నా ఎక్కువ మంది ప్రయాణికులు ఈ అత్యాధునిక రైలులో ప్రయాణించిన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు.

చీనాబ్ వంతెనను దాటుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నిర్మించిన ప్రతి ఒక్క రైలునూ అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. ఆటోమేటిక్ ప్లగ్ కలిగి ఉండే తలుపులు, తిరిగే సీట్లు, బయో-వ్యాక్యూమ్ టాయిలెట్ల వంటివి ఈ సదుపాయాల్లో ఉన్నాయి. ఈ రైళ్లకు జీపీఎస్ ఆధారిత ప్రయాణికుల సమాచార వ్యవస్థలతో పాటు పూర్తి సీసీటీవీ సౌకర్యాన్ని కూడా అమర్చారు. ఈ సదుపాయాలు ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రయాణానుభవాన్ని అందజేస్తున్నాయి.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు ప్రయాణికులతో పాటు పర్యాటకులకూ ఒక పెద్ద వరంగా మారాయి. ఇవి భారత సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక కూడళ్లను వేగంగానూ, సౌకర్యవంతంగానూ సంధానిస్తున్నాయి. ఈ రైళ్లు దేశంలో 274 జిల్లాల్లో నడుస్తున్నాయి. ఈ విస్తృత నెట్‌వర్క్‌తో దేశమంతటా ప్రయాణం, పర్యటన, ప్రాంతీయ సంధానం మెరుగుపడుతున్నాయి.
ఢిల్లీ-వారణాసి మార్గం దేశ రాజధానిని భారత ఆధ్యాత్మిక కేంద్రంతో జోడిస్తోంది. ఇది యాత్రికులకూ, పర్యాటకులకూ అనుకూలంగా ఉండే విశ్వసనీయ ప్రయాణ ఐచ్ఛికాన్ని అందిస్తోంది. ఇదే మాదిరిగా, శ్రీనగర్ - శ్రీ మాతా వైష్ణో దేవి కట్‌రా మార్గం దేశంలో అత్యంత పవిత్రమైన తీర్ఘ స్థలాల్లో ఒక స్థలానికి చేరుకోవడాన్ని సులభతరం చేస్తోంది. ఈ మార్గాన్ని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 జూన్‌లో ప్రారంభించారు. ఇది ధార్మిక పర్యటనను ప్రోత్సహించడంతో పాటు ప్రాంతీయ సంధానాన్ని పటిష్ఠపరుస్తోంది.
ఇక బెంగళూరు - హైదరాబాద్ రైలు సర్వీసు ఎంతో మంది ప్రయాణికులకు అభిమాన పాత్రమైన ఎంపికగా మారింది. ఐటీ వృత్తి నిపుణులతో పాటు వ్యాపార పనుల కోసం ప్రయాణించే వారు కూడా తరచుగా దీనిలో ప్రయాణిస్తున్నారు. ఈ రైలు భారత్‌లోని రెండు ప్రధాన సాంకేతిక విజ్ఞాన కూడళ్లను కలుపుతోంది.
వందే భారత్ 2019లో ఒకే ఒక్క రైలు సర్వీసుతో ఆరంభమైంది. ఇవాళ, 164 రైళ్ల నెట్‌వర్క్ స్థాయికి ఎదిగింది. ఈ సర్వీసులు ప్రతి నెలా లక్షల మంది ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు తీసుకు వెళ్తున్నాయి. వ్యాపార ప్రయాణికులు తమ పనులను త్వరగా పూర్తి చేసుకోవడంలో ఈ రైళ్లు తోడ్పడుతున్నాయి. కుటుంబాలకు సౌకర్యవంతమైన యాత్రలను అందిస్తున్నాయి. తీర్థయాత్రికులకు గౌరవప్రద ప్రయాణాన్ని అనుభవంలోకి తీసుకువస్తున్నాయి ఈ రైళ్లు. రోడ్డు ప్రయాణం, విమాన ప్రయాణాలతో పోలిస్తే, ఈ సర్వీసులు వాతావరణంలోకి బొగ్గుపులుసు వాయువు వ్యాప్తిని తగ్గిస్తున్నాయి.
ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఎక్కువ ఆదరణ లభించడం భారత్‌లో ప్రపంచ స్థాయి రైల్వే మౌలిక సదుపాయాలకు డిమాండు అంతకంతకూ పెరుగుతున్న సంగతిని తెలియజేస్తోంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు నమో భారత్ ర్యాపిడ్ రైళ్ల వంటి ఉన్నత సాంకేతికత కలిగిన రైళ్లు ప్రజల ఆదరణను పొందుతున్నాయి. ఇవి ఆధునిక సదుపాయాలను వారి అందుబాటులోకి తీసుకువచ్చాయి. భవిష్యత్తులో, రాబోయే వందే భారత్ స్లీపర్ ప్రయాణ రంగ రూపురేఖలను మార్చడానికి సిద్ధంగా ఉంది. ఈ రైలు దూర ప్రాంత ప్రయాణికులకు వేగవంతమైన, హాయైన, ఆధునిక సౌకర్యాలను అందజేయనుంది.
***
(रिलीज़ आईडी: 2205251)
आगंतुक पटल : 9