ప్రధాన మంత్రి కార్యాలయం
విజయ్ దివస్ సందర్భంగా వీర సైనికులకు ప్రధాని నివాళి
प्रविष्टि तिथि:
16 DEC 2025 9:03AM by PIB Hyderabad
విజయ్ దివస్ సందర్భంగా... 1971లో ధైర్యం, త్యాగంతో భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన వీర సైనికులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. వారి దృఢ సంకల్పం, నిస్వార్థ సేవ దేశాన్ని రక్షించాయని, దేశ చరిత్రలో గర్వించదగిన క్షణాలను లిఖించారని శ్రీ మోదీ అన్నారు.
ఈ విజయ్ దివస్ వారి పరాక్రమానికి వందనమర్పించేదిగా, వారి అసమాన స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తుందని ప్రధానమంత్రి అన్నారు. సైనికుల వీరత్వం తరాల పాటు భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని చెప్పారు.
‘‘విజయ్ దివస్ సందర్భంగా.. 1971లో తమ ధైర్యం, త్యాగంతో దేశానికి చారిత్రక విజయాన్ని అందించిన వీర సైనికులను మనం స్మరించుకుందాం. వారి దృఢ సంకల్పం, నిస్వార్థ సేవ మన దేశాన్ని రక్షించి, చరిత్రలో గర్వించదగిన క్షణాలను లిఖించాయి. వారి పరాక్రమానికి ప్రణామంగా, వారి అసమాన స్ఫూర్తికి చిహ్నంగా రోజు నిలుస్తుంది. వారి వీరత్వం తరాల పాటు భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’’ అని ప్రధానమంత్రి అన్నారు.
***
(रिलीज़ आईडी: 2204514)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam