రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవ సందర్భంగా జాతీయ ఇంధన పరిరక్షణ పురస్కారాలను ప్రదానం చేసిన భారత రాష్ట్రపతి ఇంధన సామర్థ్యాన్ని సాధించడంలో ప్రవర్తనాపరమైన మార్పు కీలకం: రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 14 DEC 2025 2:32PM by PIB Hyderabad

జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో జాతీయ ఇంధన పరిరక్షణ పురస్కారాలు-2025, జాతీయ ఇంధన పరిరక్షణ పోటీల బహుమతులను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు

ఈ సందర్భంగా ప్రసంగించిన రాష్ట్రపతి... పర్యావరణహితమైననమ్మకమైన శక్తి వనరుగా ఇంధన పరిరక్షణను ఆమె అభివర్ణించారుఇంధన పరిరక్షణ కేవలం ఒక ఎంపిక మాత్రమే కాదనీప్రస్తుతం అత్యంత కీలక అవసరమని ఆమె అభిప్రాయపడ్డారుఇంధన ఆదా అంటే ఇంధనాన్ని తక్కువ వాడటం మాత్రమే కాదు... తెలివిగాబాధ్యతాయుతంగాసమర్ధంగా ఉపయోగించడం అని ఆమె స్పష్టం చేశారువిద్యుత్ ఉపకరణాల అనవసర వాడకాన్ని నివారించడం... ఇంధన-సమర్థత గల పరికరాలను స్వీకరించడం... మన ఇళ్ళుకార్యాలయాల్లో సహజ వెలుతురువెంటిలేషన్‌ను ఉపయోగించడం... సౌరశక్తిపునరుత్పాదక ఇంధనాలను స్వీకరించడం ద్వారా మనం ఇంధనాన్ని ఆదా చేయడమే కాకుండా కార్బన్ ఉద్గారాలనూ తగ్గించగలమని రాష్ట్రపతి వ్యాఖ్యానించారుస్వచ్ఛమైన గాలిసురక్షిత జల వనరులనుసమతుల్య పర్యావరణ వ్యవస్థను నిర్వహించడానికీ ఇంధన పరిరక్షణ కీలకమని తెలిపారుమనం ఆదా చేసే ప్రతి యూనిట్ ఇంధనం ప్రకృతి పట్లభవిష్యత్ తరాల పట్ల మన నైతిక బాధ్యతకు చిహ్నంగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.

యువతపిల్లలు ఇంధన పొదుపు గురించి తెలుసుకునిఆ దిశగా ప్రయత్నాలు చేసినప్పుడు ఈ రంగంలో లక్ష్యాలను సాధించవచ్చనిఅప్పుడే దేశ సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ఉద్ఘాటించారు.

సరసమైనస్వచ్ఛమైన ఇంధనం అందుబాటులో ఉన్న సమాజాలకు శక్తి లభిస్తుందని రాష్ట్రపతి అన్నారుఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరుస్తుందికొత్త వృద్ధి అవకాశాలను సృష్టిస్తుందిఅందువల్ల హరిత ఇంధనం కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా సాధికారతసమగ్ర అభివృద్ధికి శక్తిమంతమైన సాధనం అవుతుందని ఆమె పేర్కొన్నారు.

ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజననేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వంటి కార్యక్రమాలు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయని రాష్ట్రపతి వివరించారుపునరుత్పాదక వినియోగ బాధ్యతఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల ద్వారా పునరుత్పాదక ఇంధన వినియోగాన్నిఇంధన సామర్థ్యాన్నీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. 2023-24లో భారత ఇంధన సామర్థ్య ప్రయత్నాల ఫలితంగా 53.60 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన ఇంధనం ఆదా అయిందని ఆమె తెలిపారుఈ ప్రయత్నాలు ప్రతియేటా గణనీయ ఆర్థిక పొదుపుతో పాటుగా కార్బన్-డై-ఆక్సైడ్ ఉద్గారాల విడుదల గణనీయంగా తగ్గిందని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు.

భారత ఇంధన పరివర్తన విజయవంతం కావడానికి ప్రతి రంగంప్రతి పౌరుడి భాగస్వామ్యం చాలా అవసరమని రాష్ట్రపతి అన్నారుఅన్ని రంగాల్లో ఇంధన సామర్థ్యాన్ని సాధించడానికి ప్రవర్తనాపరమైన మార్పు చాలా కీలకం అని ఆమె వ్యాఖ్యానించారుప్రకృతితో సామరస్యంగా సమతుల్య జీవనశైలిని అవలంబించాలనే స్పృహ భారత సాంస్కృతిక సంప్రదాయానికి మూలాధారమన్నారుఈ భావనే ప్రపంచానికి మనం అందిస్తున్న సందేశమైన "లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ లైఫ్"కి ఆధారమని శ్రీమతి ద్రౌపది ముర్ము తెలిపారుఇంధన పరిరక్షణ రంగంలో పనిచేస్తున్న వారందరినీ ఆమె అభినందించారువారి సహకారం రాబోయే తరాలకు ఆరోగ్యకరమైనఉజ్వల భవిష్యత్తును అందిస్తుందన్నారుసమష్టి బాధ్యతభాగస్వామ్యంప్రజా భాగస్వామ్యాల స్ఫూర్తితో... భారత్ ఇంధన పరిరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తూనే ఉంటుందనీహరిత భవిష్యత్తు దిశగా తన లక్ష్యాలను సాధిస్తోందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు.

Click here for President's Speech.

 

***


(रिलीज़ आईडी: 2204170) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Malayalam