ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌లోని చిత్తోర్‌గడ్‌లో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

प्रविष्टि तिथि: 02 OCT 2023 12:27PM by PIB Hyderabad

వేదికపై ఉన్న గౌరవ సభ్యులుసోదరీసోదరులారా,

స్ఫూర్తిదాయకులైన మహాత్మాగాంధీలాల్ బహదూర్ శాస్త్రి జయంతిని ఈ రోజు మనం నిర్వహించుకుంటున్నాంనిన్న.. అంటే అక్టోబర్ 1న రాజస్థాన్‌తో సహా దేశమంతా.. ముఖ్యమైన పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాంఈ స్వచ్ఛత ప్రచారాన్ని సామాజిక ఉద్యమంగా మార్చిన పౌరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

స్నేహితులారా,

పరిశుభ్రతస్వావలంబనసమగ్రాభివృద్ధి గురించి బాపు చెప్పేవారుబాపు బోధించిన ఈ విలువలను గడచిన తొమ్మిదేళ్లుగా మన దేశం అనుసరిస్తోంది. చిత్తోర్‌గఢ్‌లో ఈ రోజు ప్రారంభిస్తున్న రూ.7,200 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఈ అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

స్నేహితులారా,

గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ పునాదిని బలోపేతం చేసే దిశగా.. గ్యాప్ పైప్‌లైన్ వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరించేలా గతంలో ఎన్నడూ లేని విధంగా పనులు కొనసాగుతున్నాయిమెహసానా నుంచి బటిండా వరకు గ్యాస్ పైప్‌లైన్లను ఏర్పాటు చేస్తున్నారుఈ రోజు పాలీ-హనుమాన్‌గఢ్ విభాగాన్ని ఈ రోజు దేశానికి అంకితం చేస్తున్నాంఇవి రాజస్థాన్లో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహిస్తాయి. వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాయిఅలాగే మన ఆడపడుచుల వంటగదులకు చౌకగా గ్యాస్ సరఫరా చేయాలన్న మా ప్రయత్నాన్ని వేగవంతం చేస్తాయి.

స్నేహితులారా,

రైల్వేరోడ్డు మౌలిక వసతులకు సంబంధించిన పలు కీలకమైన ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభమయ్యాయిఈ సౌకర్యాలు మేవార్ ప్రాంత ప్రజలకు జీవన సౌలభ్యాన్ని అందిస్తాయినూతన ఉపాధి అవకాశాలను కల్పిస్తాయికోటాలో ఏర్పాటు చేసిన ఐఐఐటీ నూతన క్యాంపస్ విద్యా కేంద్రంగా ఈ ప్రాంత గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది.

స్నేహితులారా,

గతం నుంచి వారసత్వంగా పొందిన సుసంపన్నమైన సంస్కృతిప్రస్తుతం అందిస్తున్న సామర్థ్యంభవిష్యత్తు కోసం గొప్ప అవకాశాలు రాజస్థాన్‌కు ఉన్నాయిఈ మూడు బలాలు దేశం మొత్తం సామర్థ్యాన్ని పెంచేందుకు తోడ్పడతాయినాథ్‌ధ్వారా పర్యాటకసాంస్కృతిక కేంద్రం కూడా ఈ రోజు ప్రారంభమైందిజైపూర్లోని గోవింద్ దేవ్ ఆలయాన్నిశికర్‌లోని ఖటుశ్యామ్ ఆలయాన్నినాథ్‌ద్వారాను టూరిజం సర్క్యూట్‌‌లో చేర్చడం ద్వారా రాజస్థాన్ గౌరవాన్ని ఈ కేంద్రం పెంచుతుందిపర్యాటక రంగానికి లబ్ధి చేకూర్చుతుంది.

స్నేహితులారా,

చిత్తోర్‌గఢ్ సమీపంలో కృష్ణునికి అంకితమైన సన్వారియా సేథ్ ఆలయం మన విశ్వాసానికి కేంద్రంగా ఉందిప్రతి ఏడాదికొన్ని మిలియన్ల మంది భక్తులు ‘సన్వారియా సేథ్‌’‌ను సందర్శించి భక్తితో నమస్కరిస్తారుఈ దేవాలయానికి వ్యాపార వర్గంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉందిస్వదేశ్ దర్శన్ పథకం ద్వారా సన్వారియా ఆలయంలో సౌకర్యాలను భారత ప్రభుత్వం ఆధునికీకరించిందివాటర్ లేజర్ షోలుపర్యాటక సౌకర్య కేంద్రంయాంఫిథియేటర్కెఫెటేరియాతో సహా వివిధ సౌకర్యాలను కల్పించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించాంఇవన్నీ భక్తులకు సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయని నేను విశ్వసిస్తున్నాను.

స్నేహితులారా,

రాజస్థాన్ అభివృద్ధికి భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందిరాజస్థాన్‌లో ఎక్స్‌ప్రెస్ వేలుజాతీయ రహదారులురైల్వేలు తదితర ఆధునిక మౌలిక వసతులపై మేం దృష్టి సారించాంఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ వే అయినాఅమృత్‌సర్-జామ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ వే అయినా ఈ ప్రాజెక్టులు రాజస్థాన్‌లో సరకు రవాణా రంగానికి కొత్త శక్తినిస్తాయితాజాగాఉదయ్‌పూర్-జైపూర్ వందేభారత్ రైలు కూడా ప్రారంభమైందిభారత్‌మాల ప్రాజెక్టు నుంచి గరిష్ఠ స్థాయిలో లబ్ధి పొందే రాష్ట్రం రాజస్థానే.

స్నేహితులారా,

ధైర్యంగర్వంఅభివృద్ధితో కలసి ముందుకు సాగాలని రాజస్థాన్ చరిత్ర మనకు బోధిస్తుందిప్రస్తుత భారత్ కూడా ఇదే సంకల్పంతో ముందుకు సాగుతోందిసబ్ కా ప్రయాస్ (సమష్టి ప్రయత్నాలు)తో అభివృద్ధి చెందిన భారత్ నిర్మించడంలో మేం నిమగ్నమై ఉన్నాంగతంలో అభివృద్ధికి దూరంగా ఉన్నవెనకబడిన ప్రాంతాలవర్గాల అభివృద్దికి ఇప్పుడు దేశం ప్రాధాన్యం ఇస్తోందిఅందుకేఆకాంక్షత్మక జిల్లా కార్యక్రమం గడచిన అయిదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతోందిమేవార్‌తో సహా రాజస్థాన్‌లో వివిధ జిల్లాలు ఈ కార్యక్రమం కింద అభివృద్ధి చెందుతున్నాయిఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత మెరుగుపరిచిఆకాంక్షత్మక బ్లాకులను గుర్తించి వాటిని వేగంగా అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది.

భవిష్యత్తులో ఈ కార్యక్రమం ద్వారా రాజస్థాన్‌లో అనేక బ్లాకులు అభివృద్ధి చెందుతాయివెనకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వైబ్రంట్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రారభించిందిఒకప్పుడు చివరి గ్రామాలుగా పరిగణించిన సరిహద్దు గ్రామాలను ఇప్పుడు మొదటి గ్రామాలుగా గుర్తించి వాటిని అభివృద్ధి చేస్తున్నాంఈ పథకం రాజస్థాన్లో డజన్ల కొద్దీ సరిహద్దు గ్రామాలకు అనేక ప్రయోజనాలను అందిస్తుందికొంత సమయం తర్వాత ఇలాంటి అంశాలపై నేను మరింత వివరంగాబహిరంగంగా చర్చిస్తానుఎందుకంటేఇలాంటి అంశాలను బహిరంగంగా చర్చించడం బాగుంటుందిఅయితే దానికి కొన్ని పరిమితులున్నాయినేను అక్కడికి వచ్చి వివరంగా చర్చిస్తానురాజస్థాన్ అభివృద్ధి కోసం మన సంకల్పాలు త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నానుఈ ఆశతోఅనేక కొత్త ప్రాజెక్టులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మేవార్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు.

గమనికఇది ప్రధామంత్రి హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.

 

***


(रिलीज़ आईडी: 2204162) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Malayalam