ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అఖిల భారతీయ శిక్షా సమాగమ్‌ కార్యక్రమం.. ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

నాడు పోస్టు చేయడమైనది: 29 JUL 2023 2:11PM by PIB Hyderabad

మంత్రిమండలిలో నా సహచరులైన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారుఅన్నపూర్ణా దేవి గారురాజ్‌కుమార్ రంజన్ సింగ్ గారుసుభాష్ శంకర్ గారుదేశంలో వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులుగౌరవనీయులైన మేధావులతో పాటు దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రియమైన నా విద్యార్థి మిత్రులారా.
దేశాన్ని విజయపథంలో నడపాలన్నాదేశ భాగ్యాన్ని మార్చాలన్నా అత్యంత శక్తిమంతమైన సాధనం విద్యఇరవై ఒకటో శతాబ్ది భారత్‌.. తన లక్ష్యాల సాధన దిశగా ముందుకు దూసుకుపోతోందిఈ నేపథ్యంలో విద్యావ్యవస్థకు ఎంతో ప్రాధాన్యం ఉందిఈ వ్యవస్థకు మీరంతా ప్రతినిధులుమార్గదర్శకులుఈ కారణంగాఅఖిల భారతీయ శిక్షా సమాగంలో పాలుపంచుకోవడం నాకు కూడా చాలా ముఖ్యమైన అవకాశం.
జ్ఞానానికి చర్చ అత్యవసరంవిద్యార్జనకు కూడా చర్చ అవసరమని నేను నమ్ముతానుమనం అఖిల భారతీయ శిక్షా సమాగమ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ద్వారా సంప్రతింపులూఆలోచనలు చేయడమనే మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు నాకు సంతోషంగా ఉందిఇదివరకు ఇలాంటి ఒక కార్యక్రమాన్ని కాశీలో కొత్తగా కట్టిన రుద్రాక్ష్ ఆడిటోరియంలో నిర్వహించారుఈ సారిఈ సమాగమాన్ని ఢిల్లీలో కొత్తగా కట్టిన భారత్ మండపంలో నిర్వహిస్తున్నారుభారత్ మండపాన్ని లాంఛనంగా ప్రారంభించిన తరువాత ఇదే తొలి కార్యక్రమం కావడం మరింత ఆనందాన్నిచ్చే విషయంమొదటి కార్యక్రమమే విద్యకు సంబంధించింది అయినందువల్ల కలుగుతున్న ఆనందానికి ఒక హద్దంటూ లేదు.
మిత్రులారా,
కాశీలోని రుద్రాక్ష్ మొదలు ఈ ఆధునిక ‘భారత్ మండపం’ వరకు చూస్తేఅఖిల భారతీయ శిక్షా సమాగమ్ ప్రస్థానం ఒక సందేశాన్ని అందిస్తోందిఈ సందేశం ప్రాచీనతఆధునికతల సంగమానికి సంబంధించిందిఒక వైపుమన విద్యావ్యవస్థ భారత్‌లో ప్రాచీన సంప్రదాయాల్ని పరిరక్షిస్తోందిమరో వైపుమనం ఆధునిక విజ్ఞానశాస్త్ర రంగంలోనూఉన్నత సాంకేతికతలోనూ శరవేగంగా ముందుకు పోతున్నాంఈ సందర్బంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకూవిద్యావ్యవస్థకు మీరు అందిస్తున్న సేవలకూ మీకు నేను శుభాకాంక్షలతో పాటు మనస్ఫూర్తిగా అభినందనలను కూడా తెలియజేస్తున్నాను.
ఈ రోజు మన జాతీయ విద్యావిధానానికి మూడు సంవత్సరాలు పూర్తి అయిన రోజు కూడా కావడం యాదృచ్ఛికందేశవ్యాప్తంగా పండితులువిద్యావేత్తలుఉపాధ్యాయులు దీనిని ఒక ఉద్యమంగా అక్కున చేర్చుకునిదీని లక్ష్యాలను ముందుకు తీసుకుపోతున్నారుఈ రోజు ఈ సందర్బంగా నేను కూడా వారందరికీ నా కృతజ్ఞతలనుహృదయపూర్వక ధన్యవాదాలనూ తెలియజేస్తున్నాను.
ఇక్కడికి వచ్చే ముందుదగ్గర్లోనే ఉన్న ఒక పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనకు నేను వెళ్లి ఆ ప్రదర్శనను చూశానుమన విద్యారంగానికీమన నైపుణ్యాలకున్న శక్తినీఈ రంగం సాధించిన విజయాల్నీ ఆ ప్రదర్శన కళ్లకు కడుతోందికొత్త పద్ధతుల్నీకొత్త ఆలోచనల్నీ పరిచయం చేస్తోంది. ‘బాల వాటిక’లో పిల్లలతో నేను భేటీ అయ్యాను.. వారితో మాట్లాడే అవకాశం నాకు లభించిందిఆటలాడుకుంటూనే బాలలు అన్ని విషయాల్నీ ఎలా నేర్చుకొంటోందీవిద్యార్జనకీ బడికి వెళ్లడానికీ అర్థాలు ఎలా మారిపోతోందీ గమనించినప్పుడునాకు నిజంగా ఎంతో ప్రోత్సాహకరంగా అనిపించిందిమీరంతా ఈ కార్యక్రమం ముగిసిన తరువాత అక్కడికి వెళ్లిఅక్కడి కార్యకలాపాల్ని పరిశీలించాల్సిందిగా మిమ్మల్ని కూడా నేను కోరుతున్నాను.
మిత్రులారా,
యుగాన్ని మార్చివేసే పరివర్తనలు చోటు చేసుకొనేటప్పుడుఅందుకు కొంత సమయం పడుతుందిమూడు సంవత్సరాల కిందట మేం జాతీయ విద్యావిధానాన్ని ప్రకటించినప్పుడుచేయాల్సిన అనేక పనులు మా ముందుకు వచ్చి నిలిచాయిఅయితే జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయడంలో మీరంతా కర్తవ్య భావంఅంకిత భావంనిబద్ధతకొత్త ఆలోచనలను స్వీకరించడంలో అరమరికలు లేని తనాన్ని చాటుకొన్నారుఇది నిజంగా ఆకట్టుకొనేదిగా ఉంది.. ఇది ఒక కొత్త విశ్వాసాన్ని కూడా ఇస్తోంది.
దీనిని ఒక ఉద్యమంగా మీరు భావించారుజాతీయ విద్యావిధానం సాంప్రదాయిక జ్ఞాన వ్యవస్థలు మొదలు భావికాలపు సాంకేతికత వరకూసమాన ప్రాధాన్యాన్నిస్తోందిప్రాథమిక విద్యకు ఒక కొత్త పాఠ్యక్రమాన్ని సిద్ధం చేయడానికీపుస్తకాలను ప్రాంతీయ భాషల్లో తీసుకురావడానికీదేశంలో పరిశోధనకు సంబంధించిన వ్యవస్థను పటిష్ఠపరచడానికీఉన్నత విద్య రంగంలో అన్ని ప్రయత్నాల్నీ చేయడానికీ ఈ రంగంలోని మహనీయులందరూ ఎంతో శ్రమించారు.
కొత్త వ్యవస్థ పట్ల దేశంలోని సామాన్య ప్రజానీకంతో పాటు మన విద్యార్థిలోకం కూడా మంచి పరిచయాన్ని పెంచుకున్నారు. ‘టెన్ ప్లస్ టూ’ విద్యావ్యవస్థ స్థానంలో ‘ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్’ వ్యవస్థ వచ్చిన సంగతిని వారు గ్రహించారుఇప్పుడు చదువుకోవడమనేది మూడేళ్ల వయసు నుంచే ఆరంభం అవుతుందిఇది దేశమంతటా ఏకరూపతను తీసుకువస్తుంది.
జాతీయ పరిశోధన ఫౌండేషన్‌ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి మంత్రిమండలి ఇటీవలే ఆమోదం తెలిపిందిజాతీయ విద్యావిధానంలో భాగంగాజాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేంవర్క్‌ను కూడా త్వరలో అమలు చేయనున్నారుపునాది దశలో అంటే, 3 ఏళ్లు మొదలు ఏళ్ల వయసు కల చిన్నారుల అవసరాలకు తగినట్లు ఉండే ఫ్రేంవర్క్‌ను ఇప్పటికే రూపొందించారుఇతర దశలకు పాఠ్యప్రణాళికను త్వరలో రూపొందిస్తారుసహజంగానేదేశంలో సీబీఎస్ఈ పాఠశాలలకు ఇక  ఏకరూప పాఠ్య ప్రణాళికే ఉంటుందిఈ లక్ష్యంతో కొత్త పాఠ్యపుస్తకాలను ఎన్‌సీఈఆర్‌టీ   రూపొందిస్తోంది. 3వ తరగతి మొదలు 12వ తరగతి వరకు సుమారు 130 విషయాలపై కొత్త పుస్తకాలు రాబోతున్నాయిప్రాంతీయ భాషల్లోనూ విద్యను ప్రోత్సహించడానికి ఈ పుస్తకాలు 22 భారతీయ భాషల్లో అందుబాటులోకి వస్తాయన్న సంగతి తెలిసి నేను సంతోషిస్తున్నాను.
మిత్రులారా,
యువతను వారి ప్రతిభ ఆధారంగా కాక వారి భాషను బట్టి జడ్జ్ చేయడం వారికి తీవ్ర అన్యాయం చేయడమే అవుతుందిమాతృభాషలో విద్యాబోధన భారత్‌లో ప్రతిభావంతులైన యువతకు నిజమైన న్యాయాన్ని అందించడానికి నాందీ ప్రస్తావనఇది సామాజిక న్యాయం దిశగా కూడా వేసిన ఒక ముఖ్యమైన ముందడుగుప్రపంచంలో వందల సంఖ్యలో వివిధ భాషలున్నాయిప్రతి ఒక్క భాషకీ దానిదైన ప్రాధాన్యం ఉందిఅభివృద్ధి చెందిన దేశాలు చాలావరకు వాటి సొంత భాషలను ప్రొత్సహించిపురోగతిని సాధించాయిఒక్క యూరోపునే చూస్తేఅక్కడి చాలా దేశాలు తమ సొంత భాషను మాత్రమే ఉపయోగిస్తున్నాయిఏమైనాభాషల పరంగా ఇన్ని సమృద్ధ భాషలు ఉన్నప్పటికీమనం మన భాషలను వెనుకబడిన భాషలుగా ప్రస్తావించుకుంటున్నాంఇంతకన్నా పెద్ద దురదృష్టం ఏమైనా ఉంటుందాఎవరైనా ఎంతో వినూత్నంగా ఆలోచించే ప్రజ్ఞను కలిగి ఉంటే ఉండవచ్చుగాకవారికి ఇంగ్లిషులో మాట్లాడటం రాకపోతే అప్పుడు ఆ వ్యక్తి ప్రతిభను తొందరగా ఒప్పుకోకపోయేవారుదీనివల్ల అతి భారీగా నష్టపోయింది మన పల్లె ప్రాంతాలకు చెందిన తెలివైన బాలలేస్వాతంత్య్ర ‘అమృత కాలం’లో మన దేశం జాతీయ విద్యావిధానాన్ని తీసుకువచ్చిఈ న్యూనతా భావాన్ని పక్కకు నెట్టడం మొదలుపెట్టిందినేను ఐక్యరాజ్యసమితిలోనూ భారతీయ భాషలోనే సగర్వంగా మాట్లాడతానువినేవారు మెచ్చుకొని ప్రతిస్పందించడంలో కొంత సమయం పడితే పట్టనివ్వండి.
మిత్రులారా,
ఇకసాంఘిక శాస్త్రాల మొదలు ఇంజినీరింగ్ వరకు విద్యాబోధనను భారతీయ భాషల్లో అందించనున్నారుయువతకు వారి భాష పట్ల విశ్వాసం ఉందంటేవారిలోని నైపుణ్యాలువారి ప్రతిభాపాటవాలు ధైర్యంగా ముందుకు వస్తాయిపైగాదీంతో దేశానికి మరో లాభం కూడా కలుగుతుందిభాషను రాజకీయ ఉద్దేశాల కోసమూద్వేషాన్ని వ్యాపింపచేయడానికీ ఉపయోగించుకొనే వారికి వారి దుకాణాన్ని మూసేసుకోవాల్సి వస్తుందిజాతీయ విద్యావిధానం రాకతోదేశంలో ప్రతి భాషకూ గౌరవం లభిస్తుంది.. ప్రోత్సాహం లభిస్తుంది.
మిత్రులారా,
రాబోయే 25 సంవత్సరాలకు స్వాతంత్య్ర అమృత మహోత్సవంలో ఎంతో ప్రాధాన్యం ఉందిఈ 25 ఏళ్లలోనూమనం ఉత్సాహం ఉప్పొంగేస్వేచ్ఛతో ఉరకలు వేసే యువతరాన్ని తయారు చేసుకొని తీరాలిఈ యువత బానిసత్వ ఆలోచనావిధానం గుప్పిట్లో చిక్కుకొని ఉండకూడదుఈ తరం కొత్త కొత్త ఆలోచనలు చేయడానికి తహతహలాడాలిఈ తరం.. విజ్ఞానశాస్త్రం మొదలు క్రీడల వరకు ప్రతి రంగంలో భారత్ పేరు మారుమోగేటట్లు చేయాలిభారత్‌ను ముందుకు తీసుకు పోవాలిఈ తరం.. 21వ శతాబ్ది భారత్ అవసరాలను అర్థం చేసుకొంటూనే తన శక్తియుక్తులను పెంచుకొనే తరం కావాలికర్తవ్యం పట్లబాధ్యతల పట్ల చక్కని స్పృహను కలిగి ఉండే తరం అవ్వాలిఇలాంటి తరాన్ని తీర్చిదిద్దడంలో జాతీయ విద్యావిధానం ఒక కీలక పాత్రను పోషిస్తుంది.
మిత్రులారా,
నాణ్యమైన విద్యాజగతిలో ఎన్నో ప్రమాణాలు ఉన్నాయిఅయితేమనం భారత్‌ను గురించి మాట్లాడుకుంటే.. మన ప్రధాన లక్ష్యం సమానతేభారత్‌లో ప్రతి యువ ప్రతినిధికీ సమాన విద్యసమాన విద్యావకాశాలూ లభించేటట్లు చూడటమే జాతీయ విద్యావిధానం ప్రాథమ్యంఏమైనాసమాన విద్యసమాన విద్యావకాశాలు అంటేఅది స్కూళ్లను తెరవడంతోనే సరిపోదుదీనికి అర్థంవిద్యతో పాటు వనరులను అందరికీ సమానంగా అందజేయాలిసమాన విద్య అంటే ప్రతి చిన్నారికీ వారి వారి అవగాహనఎంపికలను లెక్కలోకి తీసుకొని తగిన ఐచ్ఛికాలను అందించే ఏర్పాట్లు చేయడంసమాన విద్య అంటే.. బాలలు వారి స్థానంకులంలేదా మతం కారణంగా చదువుకు దూరం కాకూడదు అని అర్థం.  
ఇందువల్లే పల్లెలూనగరాల యువతాధనికపేద యువతాప్రతి వర్గానికి చెందిన యువతా.. వీరందరికీ ఒకే విధమైన అవకాశాలు లభించాలనేదే జాతీయ విద్యావిధానం దార్శనికతా.. దేశం ప్రయత్నమూమీరు గమనించారు.. చాలా మంది పిల్లలు దూర ప్రాంతాల్లో నాణ్యమైన బళ్లు లేకపోవడం వల్ల మంచి విద్యకు నోచుకోని కాలమంటూ ఒకటి ఉండిందికానీ ఈ రోజునదేశంలో వేలాది పాఠశాలల స్థాయిని పీఎం-శ్రీ స్కూళ్ల స్థాయికి మెరుగుపరుస్తున్నారుఈ ‘5జీ’ కాలంలోఈ ఆధునిక హై-టెక్ స్కూళ్లు భారత విద్యార్థులకు ఆధునిక విద్యామాధ్యమంగా రూపొందనున్నాయి.
ప్రస్తుతంమనం కూడా గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసుకొంటున్నాంఇవాళ గ్రామ గ్రామాన ఇంటర్‌నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చిందిదీక్షస్వయంస్వయంప్రభ వంటి వేదికల సాయంతో సుదూర ప్రాంతాల బాలలు చదువుకుంటున్నారుచక్కని పుస్తకాలువిద్యను బోధించేందుకు సృజనాత్మకమైన పద్థతులను అనుసరిస్తుండడంతో పాటు డిజిటల్ సాంకేతికతను ఏకీకరించడంవల్ల భారత్‌లో ప్రతి గ్రామంలో కొత్త ఆలోచనలుకొత్త వ్యవస్థలునూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయిక్లుప్తంగా చెప్పాలంటేభారత్‌లో చదువుకోవడానికి అవసరమైన వనరుల అంతరం వేగంగా అంతమవుతోంది.
మిత్రులారా,
విద్యను పుస్తకాలకే పరిమితం చేయకూడదుదానికి బదులు అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని అందించే ప్రక్రియను అందులో ఒక భాగంగా చేయాలనేది జాతీయ విద్యావిధానం కీలక ప్రాథమ్యాల్లో ఒకటని మీకు తెలుసాఈ పరమార్థాన్ని నెరవేర్చడానికి వృత్తి విద్యను సాధారణ విద్యతో ఏకీకరిస్తున్నారుఈ విధానంలో అణగారిన వర్గాలుఆదరణకు నోచుకోని వర్గాలుగ్రామీణ ప్రాంతాల పిల్లలకు అతి పెద్ద ప్రయోజనం కలుగుతుంది.
విషయపరిజ్ఞానాన్ని తెలుసుకోకుండా పాఠ్యపుస్తకాలనే వల్లె వేసే చదువు తీరు ఈ పిల్లకు అతి భారమైవారు సతమతమైపోతుండే వారుఅయితే వారికి ఇప్పుడుకొత్త జాతీయ విద్యావిధానంలో  కొత్త కొత్త పద్ధతుల్లో చదువు చెబుతారువిద్య విద్యార్థుల్ని మమేకం చేసేదిగా ఉండడంతో పాటు వారిలో ఆసక్తిని పెంచేదిగా కూడా ఉంటుందిఇంతకు ముందుచాలా తక్కువ బళ్లలో మాత్రమే ప్రయోగశాలలూఅనుభవపూర్వకంగా విషయాలను తెలుసుకొనే పద్దతీ ఉండేవిఏమైనాఇప్పుడు 75 లక్షల కన్నా ఎక్కువ మంది బాలలు అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌లో విజ్ఞానశాస్త్రాన్నీకొత్త కొత్త అంశాల్నీ నేర్చుకుంటున్నారువిజ్ఞానశాస్త్రం అందరి అందుబాటులోకీ వస్తోందిఈ యువ శాస్త్రవేత్తలు రాబోయే కాలంలో దేశంలోని ప్రధాన ప్రాజెక్టులకు నాయకత్వం వహించడంతో పాటు భారత్‌ను ప్రపంచంలో పరిశోధనకు కూడలిగా రూపొందిస్తారు.
మిత్రులారా,
ఏ సంస్కరణకైనా ధైర్యం అవసరంధైర్యం ఉన్న చోటే కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయిఈ కారణంగానే ప్రపంచం ప్రస్తుతం భారత్‌ను కొత్త అవకాశాలకు నిలయంగా భావిస్తోందిప్రస్తుతం సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ రంగంలో రాబోయే కాలం భారత్‌దేనన్న సంగతి ప్రపంచానికి తెలుసుఅంతరిక్ష సాంకేతిక రంగం విషయానికి వస్తేభారత్ సామర్థ్యాలు సాటిలేనివన్న సంగతీ ప్రపంచానికి తెలుసురక్షణ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానం విషయంలో భారత్ ‘తక్కువ ఖర్చు’లో అందిస్తున్న ‘అత్యుత్తమ నాణ్యత’ నమూనా విజయవంతం కానుందన్న సంగతి కూడా ప్రపంచానికి తెలుసుమన పట్ల ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని మనం బలహీనం కానీయకూడదు.
గత కొన్నేళ్లలోభారత్ పారిశ్రామిక రంగంలో సాధించిన సత్వర వృద్ధిమన అంకుర సంస్థలకు ప్రాధాన్యం అంతకంతకూ పెరుగుతూ ఉండడంమన విద్యాసంస్థలకు లభిస్తున్న ప్రపంచ ర్యాంకులు క్రమంగా అధికం అవుతూ ఉండడం మనకు ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని అందించాయివివిధ గ్లోబల్ ర్యాంకింగుల్ని కైవసం చేసుకుంటున్న భారతీయ సంస్థల సంఖ్య పెరుగుతోందిమన సొంత ర్యాంకింగులు కూడా మెరుగుపడుతున్నాయిప్రస్తుతంమన ఐఐటీలు.. జాంజిబార్అబూ ధాబీ వంటి దేశాల్లో క్యాంపసులను మొదలుపెడుతున్నాయిఅనేక ఇతర దేశాలు కూడా తమ తమ దేశాల్లో ఐఐటీ క్యాంపసులను ఏర్పాటు చేయాలని కోరుతున్నాయిమన విద్యావ్యవస్థలో ఇలాంటి సానుకూల మార్పుల వల్లప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలు కూడా భారత్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తున్నాయిఆస్ట్రేలియాకు చెందిన రెండు విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్‌లను గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేస్తున్నాయిఈ సాఫల్యాల నడుమమనం మన విద్యాసంస్థలను నిరంతరం పటిష్ఠపరుచుకోవాల్సిన అవసరం ఉందివాటిని రాబోయే కాలం అవసరాలకు తగ్గట్టుగా మలచుకోవడానికి మనం నిరంతరం కృషి చేయాలిమనం మన సంస్థలనూవిశ్వవిద్యాలయాలనూపాఠశాలలనూకళాశాలలనూ ఈ క్రాంతికి కేంద్రాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.
మిత్రులారా,
సమర్థులైన యువతను తీర్చిదిద్దడం ఒక బలమైన దేశాన్ని నిర్మించడంలో అతి పెద్ద పూచీకత్తుగా నిలుస్తుందియువతను తీర్చిదిద్దే పనిలో ఉపాధ్యాయులతో పాటు తల్లితండ్రులకు కూడా ప్రాథమిక బాధ్యత ఉంటుందిఅందువల్లపిల్లలకు వారు స్వేచ్ఛగా రెక్కలు తొడుక్కొనేందుకు అవకాశాలను అందించాల్సిందిగా ఉపాధ్యాయులతో పాటు తల్లితండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నానుమనం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పాదుగొల్పాల్సిన అవసరం ఉందిఅలా చేసినప్పుడు వారు ఎల్లప్పుడూ ఏదైనా కొత్త విషయం నేర్చుకొనేందుకుఏదైనా కొత్తగా చేసి చూపెట్టడానికీ ధైర్యాన్ని కనబరిచేందుకు ముందడుగు వేస్తారుమనం రాబోయే కాలంపై దృష్టి పెట్టిభావి కాలానికి తగ్గ ఆలోచనా విధానాన్ని అవలంబించాలిమనం బాలలను పుస్తకాల ఒత్తిడి నుంచి విముక్తులను చేయాల్సిన అవసరం ఉంది.  
ప్రస్తుతంమనం కృత్రిమ మేధ (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్..ఏఐవంటి సాంకేతికతను చూస్తున్నాంఅది నిన్నటి వరకూ సైన్స్ ఫిక్షన్‌లోనే కనిపించేదిఇప్పడు మన జీవితాల్లో ఒక అంతర్భాగంగా మారిందిరోబోటిక్స్డ్రోన్ సాంకేతికతలు ఇప్పటికే మన ఇంటి ముందుకు వచ్చి వాలాయిఈ కారణంగామనం పాత ఆలోచనా విధానం నుంచి బయటపడి తీరాలికొత్త ఆలోచనలు చేయాలిఇందుకోసం మనం మన పిల్లలను కూడా సిద్దం చేయాలిభావి సాంకేతికతలకు సంబంధించిన ఇంటరాక్టివ్ కార్యక్రమాల్ని మన పాఠశాలలు ఏర్పాటు చేస్తేచూడాలని ఉందిఅది విపత్తు నిర్వహణవాతావరణ మార్పులేదా స్వచ్ఛ ఇంధనం గురించి కావచ్చు.. మనం ఈ అంశాలను మన నవ తరానికి పరిచయం చేసి తీరాలిఅందువల్లఈ రంగాల్లో యువత అవగాహనను పెంచుకొని వాటి విషయంలో తమ జిజ్ఞాసను పెంపొందించుకొనేలా  మనం మన విద్యావ్యవస్థను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది.
మిత్రులారా,
భారత్ బలోపేతం అవుతున్న కొద్దీభారత్ గుర్తింపు పట్లసంప్రదాయాల పట్ల ప్రపంచానికి ఆసక్తి కూడా పెరుగుతోందిఈ మార్పును ప్రపంచం మన మీద పెట్టుకున్న అంచనాగా మనం భావించాలియోగాఆయుర్వేదకళలుసంగీతంసాహిత్యంసంస్కృతి.. ఈ రంగాలతో భవిష్యత్తులో అపారమైన అవకాశాలు ముడిపడి ఉన్నాయిఈ రంగాలతో మన కొత్త తరానికి  పరిచయాన్ని మనం తప్పక పెంచాలిఈ విషయాలకు అఖిల భారతీయ శిక్షా సమాగమ్ పెద్దపీట వేస్తుందని నేను నమ్ముతున్నాను.
ఒక నవ భారత్ నిర్మాణానికి పునాదిని వేసేదీమన దేశ భవిష్యత్తుకు రూపురేఖలను తీర్చిదిద్దేదీ మీరు చేసే ప్రయత్నాలే. 2047లో దేశం స్వాతంత్య్ర శత వార్షికోత్సవాలను జరుపుకొనేసరికల్లాభారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా ఆవిష్కరించాలన్న మన కలమన సంకల్పం నెరవేరుతాయని నేను బలంగా నమ్ముతున్నానుఈ కాలం.. ప్రస్తుతం మీ వద్ద శిక్షణను పొందుతున్న యువత చేతుల్లోనే ఉంది మరిమీరు తీర్చిదిద్దుతున్న వాళ్లురేపటి దేశాన్ని మలిచే వాళ్లుఅందువల్లమీ అందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుఈ కలను పండించాలన్న దృఢనిశ్చయాన్నీఈ సంకల్పాన్ని నెరవేర్చాలన్న అంకితభావాన్నీవిజయాన్ని సాధించాలన్న భావననీ కలబోసుకొని యువతీయువకులందరూ ముందుకు సాగాలి.
మీ అందరికీ నేను నా హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తున్నానుమీకు అనేకానేక ధన్యవాదాలు.
గమనికప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం.

 

***


(రిలీజ్ ఐడి: 2203364) సందర్శకుల సూచీ సంఖ్య : : 14