హోం మంత్రిత్వ శాఖ
ఢిల్లీలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో ప్రఖ్యాత నటుడు ధర్మేంద్రకు నివాళులు అర్పించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
నటనతో భాషా, ప్రాంతీయ సరిహద్దులను దాటి కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకున్న ధర్మేంద్ర
అన్ని వర్గాల ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన నటుడు
ఈ గొప్ప నటుడిని భారత చలనచిత్ర పరిశ్రమ ఎప్పటికీ మరిచిపోదు
प्रविष्टि तिथि:
11 DEC 2025 7:15PM by PIB Hyderabad
నేడు ఢిల్లీలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో ప్రముఖ నటుడు ధర్మేంద్ర గారికి కేంద్ర హోం, సహకారశాఖ మంత్రి శ్రీ అమిత్ షా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సినిమా ప్రపంచానికి ధర్మేంద్ర అందించిన సేవలను ఆయన సర్మించుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో.. ధర్మేంద్ర గారు తన నటనతో భాషా, ప్రాంతీయ సరిహద్దులను దాటి కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులపై ఆయన చెరగని ముద్ర వేశారని, ఇంతటి గొప్ప నటుడిని భారత సినీ పరిశ్రమ ఎప్పటికీ మరిచిపోదని ఆయన అన్నారు.
(रिलीज़ आईडी: 2202665)
आगंतुक पटल : 6