ప్రధాన మంత్రి కార్యాలయం
అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాని
ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారాన్ని అందించనున్నట్లు ప్రకటించిన ప్రధాని
प्रविष्टि तिथि:
11 DEC 2025 6:39PM by PIB Hyderabad
ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
"అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం కలగటం బాధించింది. ప్రియమైన వారిని కోల్పోయిన వారితో నా ఆలోచనలు ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను.
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. గాయపడిన వారికి రూ. 50,000 అందిస్తాం’’.
(रिलीज़ आईडी: 2202661)
आगंतुक पटल : 3