హోం మంత్రిత్వ శాఖ
ఆధునిక తమిళ సాహిత్యానికి మార్గదర్శి సుబ్రమణ్య భారతి గారి జయంతి సందర్భంగా ఆయనకు నమస్సులు అర్పించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
మహాకవి క్రాంతి కాగడాను చేతపట్టి వలసవాద ప్రభుత్వ దురాగతాలకు ఎదురొడ్డి నిలిచి ,
దేశభక్తి ఉట్టిపడే కవితలతో స్వతంత్రోద్యమాన్ని రగిలించారు
సామాజిక సంస్కరణల ద్వారా న్యాయపూర్ణ, సమ సమాజాన్ని నిర్మించాలన్న భారత నాగరికత లక్ష్యానికి ఆయన ఉత్తేజాన్ని ఇచ్చారు
ఎప్పటికీ స్ఫూర్తిని పారించే జీవ నది ఆయన జ్ఞానం
प्रविष्टि तिथि:
11 DEC 2025 12:31PM by PIB Hyderabad
ఆధునిక తమిళ సాహిత్యానికి మార్గదర్శి సుబ్రమణ్య భారతి గారి జయంతి సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆయనకు నమస్సులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘ఆధునిక తమిళ సాహిత్యానికి మార్గదర్శి సుబ్రమణ్య భారతి గారి జయంతి సందర్భంగా ఆయనకు నా ప్రణామం. మహాకవి క్రాంతి కాగడాను చేపట్టి వలసవాద ప్రభుత్వ దురాగతాలకు ఎదురొడ్డి నిలిచారు. దేశభక్తి ఉట్టిపడే తన కవితలతో స్వతంత్రోద్యమాగ్నిని రగిలించారు. అదే కాలంలో, సామాజిక సంస్కరణల ద్వారా న్యాయపూర్ణ, సమ సమాజాన్ని నిర్మించాలన్న భారత నాగరికత లక్ష్య సాధనకు ఉత్తేజాన్ని అందించారు. ఆయన జ్ఞానం మనకు ఎప్పటికీ స్ఫూర్తిని పారిస్తూ ఉండే జీవనది’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2202317)
आगंतुक पटल : 8