కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, శ్రీ సత్య నాదేళ్ల సమక్షంలో మైక్రోసాఫ్ట్ తో కార్మిక,ఉపాధి మంత్రిత్వ శాఖ ఒప్పందం

శ్రామిక శక్తి సంసిద్థత, ఏఐ నైపుణ్యం, ఉద్యోగ అవకాశాలను పెంచనున్న ఒప్పందం

భారతదేశపు జనాభా అనుకూలతను ఉపయోగించుకుని, ప్రపంచవ్యాప్తంగా పోటీపడగలిగే, డిజిటల్‌ నైపుణ్యాలు కలిగిన, భవిష్యత్తుకు అవసరమైన శ్రామిక శక్తిని సృష్టించాలనే ఉమ్మడి ఆశయాన్ని ఈ భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది: డాక్టర్ మన్సుఖ్ మాండవియా

దేశంలోని సామాజిక భద్రతా విస్తరణను ప్రశంసించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. త్వరలో ఉపాధి డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల నిర్మాణంలో భారత్ కు మద్దతిస్తామని హామీ
తమ వ్యవస్థ నుంచి 15,000 మందికి పైగా యజమానులు, భాగస్వాములను మంత్రిత్వ శాఖకు చెందిన ఎన్ సీఎస్ వేదికలోకి తీసుకురానున్న మైక్రోసాఫ్ట్

ఉద్యోగ అవకాశాలను పెంచడం, దేశంలోని నిపుణులు, యువత అంతర్జాతీయ చలనశీలతను బలోపేతం చేయనున్న ఒప్పందం

प्रविष्टि तिथि: 10 DEC 2025 1:15PM by PIB Hyderabad

కేంద్ర కార్మిక,ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ.. మైక్రోసాఫ్ట్ సీఈఓ శ్రీ సత్య నాదెళ్ల సమక్షంలో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ మైక్రోసాఫ్ట్ తో న్యూఢిల్లీలో నేడు కీలక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ సహకారం ఉపాధి సంబంధాలను విస్తరించడంలో, కృత్రిమ మేధ ఆధారిత నైపుణ్యాలను పెంపొందించడంలో, దేశ శ్రామిక శక్తిని ప్రపంచ అవకాశాల కోసం సిద్ధం చేయడంలో కీలకంగా వ్యవహరించనుంది.

మైక్రోసాఫ్ట్ తన విస్తృత అంతర్జాతీయ నెట్‌వర్క్ నుంచి 15,000 కంటే ఎక్కువ మంది యజమానులు, భాగస్వాములను మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్ సీఎస్) వేదికలో చేరేందుకు ప్రోత్సహించడమే ఈ భాగస్వామ్య ముఖ్య లక్షణం. ఇది ఉద్యోగ అవకాశాలను గణనీయంగా విస్తరించడంతోపాటు.. వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలకు మద్దతు ఇస్తుంది. దేశీయ అవసరాలకే కాకుండా, ప్రపంచం కోసం కూడా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడానికి వీలు కల్పిస్తుంది. దేశంలోని నిపుణులు, యువత అంతర్జాతీయ చలనశీలతను బలోపేతం చేస్తుంది.

ఈ ఒప్పందం ‘డిజిసాక్షం’ ద్వారా ఏఐ ఆధారిత నైపుణ్య కార్యక్రమాలను విస్తరిస్తుంది. దీని ద్వారా లక్షలాది మంది యువతకు కృత్రిమ మేధ, క్లౌడ్ టెక్నాలజీలు, సైబర్‌ సెక్యూరిటీ, ఉత్పాదకత సాధనాలు వంటి రంగాల్లో భవిష్యత్తుకు అవసరమైన సామర్థ్యాలను అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రయత్నాలు ప్రపంచ ప్రమాణాలు, కొత్త పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పనిచేసే శ్రామిక శక్తిని తీర్చిదిద్దడంలో దోహదపడతాయి.

ఈ భాగస్వామ్యాన్ని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా స్వాగతించారు. దేశంలో యువకుల జనాభాను ఉపయోగించుకునేలా, ప్రపంచ స్థాయి పోటీ సామర్థ్యం కలిగిన, డిజిటల్‌ నైపుణ్యం కలిగిన, భవిష్యత్తుకు అవసరమైన శ్రామిక శక్తిని సృష్టించాలనే ఉమ్మడి ఆశయాన్ని ఇది ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం ఉద్యోగ అవకాశాలను వేగవంతం చేస్తుందని, నైపుణ్యాన్ని మరింత పెంచుతుందని, ప్రపంచ కార్మిక చలనశీలతలో దేశ నాయకత్వాన్ని మెరుగుపరుస్తుందని ఆయన తెలిపారు.

‘‘ సామాజిక భద్రతలో భారత్ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. 2015లో కేవలం 19 శాతం ఉన్న విస్తరణ.. 2025 నాటికి ఏకంగా 64.3 శాతానికి పెరిగింది. దీని వల్ల 94 కోట్ల మంది పౌరులకు లబ్ది చేకూరింది. ఈ-శ్రమ్,నేషనల్ కెరీర్ సర్వీస్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో కృత్రిమ మేధను పొందుపరచడం ద్వారా మేము సామాజిక భద్రతను బలోపేతం చేస్తున్నాం. మార్చి 2026 నాటికి 100 కోట్ల మంది పౌరులకు సామాజిక భద్రత కల్పించాలనే మా లక్ష్యానికి మరింత చేరువవుతున్నాం.’’ అని డాక్టర్ మాండవీయా పేర్కొన్నారు.

 

చర్చ సందర్భంగా దేశంలోని సామాజిక భద్రతా పరిధి అద్భుతంగా విస్తరించడాన్ని మైక్రోసాఫ్ట్ సీఈఓ శ్రీ సత్య నాదెళ్ల ప్రశంసించారు. భారత్ ఇప్పుడు 64.3 శాతం పరిధికి చేరుకుందని, దీని ద్వారా 940 మిలియన్ల (94 కోట్ల) మంది ప్రజలు ప్రయోజనం పొందుతున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా లక్షలాది మంది అసంఘటిత కార్మికులను సామాజిక భద్రతా వలయంలోకి తీసుకురావడం, ప్రస్తుత డేటా ఆధారంగా కార్మిక-కేంద్రీకృత విధానాలను రూపొందించే భారత సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఈ-శ్రమ్ కార్యక్రమాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఉపాధి డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను నిర్మించే దిశగా భారత్ చేపట్టిన ప్రయాణానికి మద్దతు ఇవ్వడంలో మైక్రోసాఫ్ట్ ఆసక్తిగా ఉన్నట్లు శ్రీ నాదెళ్ల తెలిపారు. తదుపరి దశలో ఈ ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించడం, భారీ స్థాయిలో కార్మిక మార్కెట్లకు పరస్పర పరిష్కారాలను రూపొందించడం వంటి సామర్థ్యాలను ఈ వ్యవస్థ కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు.

మైక్రోసాఫ్ట్ శక్తిమంతమైన అజూర్, కృత్రిమమేధ సామర్థ్యాలు.. ఎన్ సీఎస్ ప్లాట్‌ఫారమ్‌ బలోపేతం,ఈ-శ్రమ్ అనలిటిక్స్, కార్మిక మార్కెట్ ఇంటెలిజెన్స్, ఉపాధి సేవలు, ఉద్యోగ-సరిపోలిక వ్యవస్థల ఆధునీకరణ వంటి మంత్రిత్వశాఖ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా మైక్రోసాఫ్ట్ భాగస్వామి వ్యవస్థను ఉపయోగించి, యజమానుల చేరువను పెంచడం, పరిశ్రమ, శిక్షణ భాగస్వాములు, సంస్థల్లో ఎన్ సీఎస్ వినియోగాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

 

***


(रिलीज़ आईडी: 2201692) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil