ప్రధాన మంత్రి కార్యాలయం
షహీద్ దివస్ సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
10 DEC 2025 8:51AM by PIB Hyderabad
ఈ రోజు షహీద్ దివస్ సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చారిత్రక అస్సాం ఉద్యమంలో పాలుపంచుకున్న అమర యోధులందరినీ స్మరించుకున్నారు.
అస్సాం ఉద్యమం రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుందనీ, రాష్ట్ర సాంస్కృతిక శక్తితో పాటు సమగ్ర అభివృద్ధి సాధనను సాకారం చేయడానికి ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందనీ శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ఈ రోజు షహీద్ దివస్.. అస్సాం ఉద్యమంలో పాలుపంచుకున్న యోధులందరినీ మనం స్మరించుకునే రోజు. ఈ ఉద్యమం మన చరిత్రలో ఒక ప్రధాన స్థానాన్ని ఎప్పటికీ పదిలపరుచుకుంది. అస్సాం ఉద్యమంలో పాల్గొన్న వారి కలలను నెరవేర్చడానికి, మరీ ముఖ్యంగా అస్సాం సంస్కృతిని పటిష్ఠపరచడంతో పాటు రాష్ట్ర సర్వతోముఖ ప్రగతికి కృషి చేస్తామన్న మన సంకల్పాన్ని పునరుద్ఘాటించుదాం’’ అని పేర్కొన్నారు.
“আজি শ্বহীদ দিৱস উপলক্ষে অসম আন্দোলনত অংশগ্ৰহণ কৰা সকলোৰে শৌৰ্য্যক স্মৰণ কৰিছো। এই আন্দোলনে সদায় আমাৰ ইতিহাসত এক গুৰুত্বপূৰ্ণ স্থান অধিকাৰ কৰি থাকিব। আমি পুনৰ উল্লেখ কৰিব বিচাৰো যে, অসমৰ সংস্কৃতিক সবল কৰাৰ লগতে ৰাজ্যখনৰ সৰ্বাংগীন উন্নয়নৰ সপোন যিসকল আন্দোলনকাৰীয়ে দেখিছিল, সেই সপোনসমূহ পূৰণ কৰিবলৈ আমি প্ৰতিশ্ৰুতিবদ্ধ।”
(रिलीज़ आईडी: 2201354)
आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam