సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈనెల 12 నుంచి 14 వరకు జేఎల్ఎన్ స్టేడియంలో జరిగే 15వ నేషనల్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్‌లో


క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ విజేతల ప్రదర్శన
కైలాష్ ఖేర్ వంటి ప్రపంచ, జాతీయస్థాయి ప్రముఖులతో పాటు సీఐసీ విజేతల లైవ్ ప్రదర్శన

प्रविष्टि तिथि: 09 DEC 2025 6:11PM by PIB Hyderabad

వేవ్స్క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ (సీఐసీవంటి సమాచారప్రసార మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యక్రమాలు దేశంలో పెరుగుతున్న సృజనాత్మక ప్రతిభను వెలుగులోకి తెస్తూనే ఉన్నాయిబ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్సింఫనీ ఆఫ్ ఇండియా పోటీల విజేతలు ఢిల్లీ వేదికగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒకటైన నేషనల్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ 15వ ఎడిషన్‌లో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారుఇది రుచికరమైన ప్రాంతీయ వంటకాల నుంచి ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ వరకు విభిన్న రుచులను ఒకచోట చేర్చే గొప్ప ఉత్సవం.

ఈనెల 12 నుంచి 14 వరకు న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే ఈ ఉత్సవంలో ప్రసిద్ధ గాయకులు కైలాష్ ఖేర్నటులు ఆశిష్ విద్యార్థిశ్రీలంక పాప్ ఆర్టిస్ట్ యోహానిగీత రచయిత-గాయకులు అమితాబ్ ఎస్ వర్మహిప్-హాప్ కళాకారులు ఎమ్‌సీ స్క్వేర్కుల్లార్ జి.ల ప్రదర్శనలతో పాటు క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ విజేతల అద్భుత ప్రదర్శనను నిర్వహిస్తున్నారు.

మూడు రోజుల ఈ సాంస్కృతిక వేడుకలో ఉత్తేజకరమైన సీఐసీ సంగీత శ్రేణిని నిర్వహిస్తున్నారుఅందులో ఇవి ఉన్నాయి:

1. బ్యాండ్ శివోహం (బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్) — సభ్యులు ప్యాడీసన్నీఅషుహితేష్ సూఫీల బృందం మెలోడీలుబాలీవుడ్ క్లాసిక్‌లను ప్రదర్శిస్తారు.

2. చిరాగ్ తోమర్ (సింఫనీ ఆఫ్ ఇండియా) — పెర్కషనిస్ట్ సాహిల్ వర్మతో కలిసి ప్రసిద్ధ బాలీవుడ్ హిట్‌లను ప్రదర్శిస్తారు.

3. నిషు శర్మ (బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్) — రాజస్థానీ జానపద సంగీతాన్ని ఈ వేదికపై ప్రదర్శిస్తారు.

4. నయన్ కృష్ణ (సింఫనీ ఆఫ్ ఇండియా) — ఫ్లూట్ వాయిద్య ప్రదర్శన.

5. మాల్దీవులకు చెందిన విజయవంతమైన బ్యాండ్ భారత్‌లో తొలిసారి ప్రదర్శన ఇస్తుందిఇది ఈ వేడుకలకు అంతర్జాతీయ కోణాన్ని జోడిస్తుంది.

సీఐసీవేవ్స్ కార్యక్రమాల్లో భాగంగా ఈ యువ కళాకారులు జాతీయఅంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ తమదైన ముద్ర వేస్తున్నారుబాటిల్ ఆఫ్ బ్యాండ్స్సింఫనీ ఆఫ్ ఇండియా విజేతలు ముంబయిలోని వేవ్స్ కార్యక్రమంలో తమ కళాత్మక పరిధితో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారుమెల్‌బోర్న్‌లోని ప్రధాన వేవ్స్ బజార్ గ్లోబల్ ఔట్‌రీచ్ ఈవెంట్స్ఒసాకా వరల్డ్ ఎక్స్‌పోటొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ వంటి అంతర్జాతీయ వేదికలపైనా తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారునేషనల్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్‌లో వారి భాగస్వామ్యం వారి సృజనాత్మక ప్రయాణంలో మరో కీలక ముందడుగు కానుందిఇది మరింత విస్తృతమైనవిభిన్నమైన ప్రేక్షకులతో అనుసంధానమయ్యేందుకు వారికి సహాయపడుతుంది.

భారత ఆరెంజ్ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం

కళాకారులుఔత్సాహికులు తమ సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి... వేవ్స్ వేదికగా దానిని ప్రదర్శించడానికి... వారి ప్రతిభసృజనాత్మకతల ద్వారా ఆదాయాన్ని ఆర్జించడానికి... జాతీయఅంతర్జాతీయ స్థాయిలో విస్తృత అవకాశాలను పొందడానికి... తద్వారా భారత ఆరెంజ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

వేవ్స్, క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ గురించి

సమాచారప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వేవ్స్ ప్రధాన కార్యక్రమం కింద నిర్వహిస్తున్న ఒక కీలక కార్యక్రమమే ఈ క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ఇది సంగీతంచలనచిత్రంయానిమేషన్వీఎఫ్ఎక్స్గేమింగ్కామిక్స్ఏఐఎక్స్ఆర్డిజిటల్ మీడియా వంటి వివిధ మీడియా-వినోద రంగ విభాగాల్లో భారత సృజనాత్మక ప్రతిభను గుర్తించడంప్రోత్సహించడంనిర్వహించడంప్రదర్శించడం లక్ష్యంగా గలది.

ఎన్ఎస్ఎఫ్ఎఫ్ గురించి తక్షణ సమాచారం కోసం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి

 

 

****


(रिलीज़ आईडी: 2201187) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Gujarati