పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రయాణికులకు తిరిగి డబ్బులు చెల్లించే ప్రక్రియ.. ఇండిగో కార్యాచరణ సంక్షోభంపై ఎంఓసీఏ చర్య ప్రయాణికులకు తక్షణమే రీఫండ్ చేయాలని ఇండిగోకు మంత్రిత్వ శాఖ ఆదేశం

प्रविष्टि तिथि: 06 DEC 2025 1:47PM by PIB Hyderabad

ప్రయాణికులకు బకాయిలను తక్షణమే తిరిగి చెల్లించాలని ఇండిగో విమానయాన సంస్థకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చిందిరద్దయినసేవల్లో అంతరాయం కలిగిన అన్ని విమానాలకు సంబంధించిన రీఫండ్ ప్రక్రియను డిసెంబర్ 7, 2025 ఆదివారం రాత్రి గంటల లోపు పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసిందివిమానాల రద్దు వల్ల ప్రయాణాలు ప్రభావితమైన ప్రయాణికులపై రీషెడ్యూలింగ్ ఛార్జీలను విధించవద్దని చెప్పిందిరీఫండ్ ప్రక్రియలో ఆలస్యమైనానిబంధనల ఉల్లంఘన జరిగినా.. తక్షణమే నియంత్రణ చర్యలుంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రత్యేక ప్రయాణికుల మద్దతురీఫండ్ విభాగం

ఫిర్యాదుల పరిష్కారం సజావుగా జరిగేందుకు ప్రత్యేక ప్రయాణికుల మద్దతురీఫండ్ సౌలభ్యానికి విభాగాలను ఏర్పాటు చేయాలని ఆదేశించిందిబాధిత ప్రయాణికులను సంప్రదించివారు మళ్లీ మళ్లీ సంస్థను సంప్రదించాల్సిన అవసరం లేకుండానే రీఫండ్ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు పూర్తయ్యేలా ఈ విభాగాలు చూసుకుంటాయిసంస్థ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో సాగే వరకు ఆటోమేటిక్ రీఫండ్ వ్యవస్థ కొనసాగనుంది.

సామగ్రి నిర్వహణపై హామీ

విమానాల రద్దుఆలస్యం కావటంతో ప్రయాణికుల సామాగ్రి మొత్తాన్నివచ్చే 48 గంటల్లోగా వారి నివాసాలు లేదా ఇచ్చిన చిరునామాకు పంపించాలని ఇండిగోను మంత్రిత్వ శాఖ ఆదేశించిందిబ్యాగేజీ ట‌్రాకింగ్డెలివరీ సమయానికి సంబంధించిన వివరాలను ప్రయాణికులకు స్పష్టంగా తెలియజేయాలనిఇప్పటికే ఉన్న ప్రయాణికుల హక్కుల నిబంధనల ప్రకారం అవసరమైతే నష్టపరిహారం అందించాలని విమానయాన సంస్థకు తెలిపింది.

ప్రయాణికులకు సౌకర్యవంతమైన విధానం

ఈ అంతరాయం సమయంలో ప్రయాణికుల హక్కులకు పూర్తి భద్రత ఉంటుందని తెలిపేందుకు ఎయిర్‌లైన్స్విమానాశ్రయాలుభద్రతా ఏజెన్సీలుకార్యాచరణ వాటాదారులతో విమానయాన మంత్రిత్వ శాఖ నిరంతరం సమన్వయం చేసిందివృద్ధులువిభిన్న సామర్థ్యం గల ప్రయాణికులువిద్యార్థులురోగులుఅత్యవసర ప్రయాణం అవసరమైన వారందరికీ సరైన సదుపాయం కల్పించటానికి పర్యవేక్షణను బలోపేతం చేసిందిసేవల పునరుద్ధరణ ప్రక్రియను మంత‌్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తూనే ఉందివీలైనంత త్వరగా కార్యాచరణను పునరుద్ధరించేందుకు ప్రాధాన్యతనిస్తోంది.


(रिलीज़ आईडी: 2200042) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Tamil , Malayalam