యు పి ఎస్ సి
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ పోస్టులకు ప్రత్యక్ష నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
प्रविष्टि तिथि:
05 DEC 2025 11:35AM by PIB Hyderabad
వివిధ కేంద్ర సర్వీసుల్లో ఉన్న 100 ఖాళీలను నేరుగా భర్తీ చేసేందుకు యూపీఎస్సీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ట్రేడ్ మార్క్- జియోగ్రాఫికల్ ఇండికేషన్ల పరిశీలకుడు, పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్ మార్కు కంట్రోలర్ జనరల్ కార్యాలయం, పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. వీటితో పాటుగా కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో డిప్యూటీ డైరెక్టర్ (పరీక్షా సంస్కరణలు) పోస్టు కోసం రెండు ఖాళీలను కూడా భర్తీ చేయనుంది.
అభ్యర్థుల కోసం వివరణాత్మక ప్రకటన 14/2025ను సూచనలతో కమిషన్ వెబ్‌సైట్ https://upsc.gov.in లో అప్లోడ్ చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రిక్రూట్మెంట్ అప్లికేషన్ పోర్టల్ https://upsconline.nic.in ద్వారా 2025 డిసెంబర్ 13 నుంచి 2026 జనవరి 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రకటనలో పేర్కొన్న సూచనలను పాటించాల్సిందిగా అభ్యర్థులను కోరింది.
***
(रिलीज़ आईडी: 2199681)
आगंतुक पटल : 26