సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘మేరా గావ్-మేరీ ధరోహర్’ కార్యక్రమం కింద సాంస్కృతిక గుర్తింపు నిమిత్తం 6.38 లక్షల గ్రామాల ఎంపిక

प्रविष्टि तिथि: 04 DEC 2025 4:26PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా సాంస్కృతిక గుర్తింపు నిమిత్తం ‘మేరా గావ్-మేరీ ధరోహర్’ (ఎంజీఎండీ) కార్యక్రమం కింద 6,38,365 గ్రామాలను గుర్తించగా, ఇప్పటిదాకా 6,23,449 గ్రామాల సమాచారాన్ని సాంస్కృతిక మంత్రిత్వశాఖ సంబంధిత పోర్టల్‌లో అప్‌లోడ్ చేసింది.

ఈ పత్రాల రూపకల్పన కార్యకలాపాల్లో భాగంగా మౌఖిక సంప్రదాయాలు, నమ్మకాలు, ఆచారాలు, చారిత్రక ప్రాధాన్యం, కళారూపాలు, వారసత్వ ప్రదేశాలు, సంప్రదాయ ఆహారం, ప్రముఖ కళాకారులు, ఉత్సవాలు, పండుగలు, సంప్రదాయ దుస్తులు, ఆభరణాలు, స్థానిక విశేషాలు సహా స్పష్ట, అస్పష్ట సాంస్కృతిక అంశాలను విస్తృత శ్రేణిలో నమోదు చేశారు.

స్థానిక సంప్రదాయాలు, ఆచారాలు సహా వారసత్వ ఆస్తులను గుర్తించే ప్రామాణిక, గ్రామ-స్థాయి సాంస్కృతిక అంశాల  సృష్టి ద్వారా గ్రామీణ గుర్తింపును బలోపేతం చేయడానికి ‘ఎంజీఎండీ’ కార్యక్రమం దోహదం చేస్తుంది. అలాగే తన పోర్టల్ ద్వారా సామాజిక నేతృత్వంలోని పత్రాల నమోదు, క్రౌడ్-సోర్స్డ్ ధ్రువీకరణకు శ్రీకారం చుట్టడం ద్వారా సామాజిక భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. సాంస్కృతిక సాముదాయక అభివృద్ధి, వారసత్వ పర్యాటకం, సంప్రదాయ నైపుణ్యాల ప్రోత్సాహం దిశగా ప్రణాళికకు ఒకే జాతీయ పోర్టల్‌లో నిర్మాణాత్మక సాంస్కృతిక సమాచార లభ్యత తోడ్పడుతుంది. తద్వారా సుస్థిర జీవనోపాధి కల్పన, గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది.

కేంద్ర సాంస్కృతిక-పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.

 

***


(रिलीज़ आईडी: 2199134) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil