ప్రధాన మంత్రి కార్యాలయం
బేగమ్ ఖలీదా జియా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
01 DEC 2025 10:30PM by PIB Hyderabad
బంగ్లాదేశ్ ప్రజా జీవనం లో ఏళ్ల తరబడి సేవలను అందించిన బేగమ్ ఖలీదా జియా ఆరోగ్య స్థితిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ, ఆమె శీఘ్రంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అన్ని విధాలుగా సాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని శ్రీ మోదీ అన్నారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘బేగమ్ ఖలీదా జియా ఆరోగ్య విషయం గురించి తెలిసి, నేను ఎంతో చింతిస్తున్నాను. ఆమె బంగ్లాదేశ్ ప్రజా జీవనానికి అనేక సంవత్సరాల పాటు సేవలను అందించారు. ఆమె త్వరిత గతిన కోలుకోవాలని మేం హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్ని విధాలుగా సాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2197459)
సందర్శకుల సూచీ సంఖ్య : : 28
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam