సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రజా పాలనలో అత్యుత్తమ పనితీరుకు ప్రధానమంత్రి అవార్డులు-2025..


దేశవ్యాప్తంగా సివిల్ సర్వెంట్ల అసాధారణమైన పనిని గుర్తించి, అభినందించి, సత్కరించటానికి రూపొందించిన పురస్కారాలు

ప్రధానమంత్రి అవార్డులు-2025కు 2,035 నామినేషన్ల స్వీకరణ

ప్రజా పాలనలో అత్యుత్తమ పనితీరుకు ప్రధానమంత్రి అవార్డులు-2025కు నమోదు చేసుకున్న 737 జిల్లాలు..

మొత్తం జిల్లాల్లో ఇది 95 శాతం

प्रविष्टि तिथि: 01 DEC 2025 3:29PM by PIB Hyderabad

ప్రజా పాలనలో అత్యుత్తమ పనితీరు కోసం ప్రధానమంత్రి పురస్కారాల పథకం-2025కి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందిదేశవ్యాప్తంగా సివిల్ సర్వెంట్లు చేసిన అసాధారణ కృషిని గుర్తించిఅభినందించిసత్కరించటానికి ఈ పురస్కార పథకాన్ని రూపొందించారుప్రధానమంత్రి పురస్కారాలు-2025 సంవత్సరానికి గానూ మూడు విభాగాల్లో సివిల్ సర్వెంట్ల సేవలను గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు:

విభాగం 1: 11 ప్రాధాన్యతా రంగ కార్యక్రమాల ద్వారా జిల్లాల సమగ్రాభివృద్ధిఈ విభాగంలో అవార్డులను ప్రదానం చేస్తారు.

విభాగం 2: ఆకాంక్షాత్మక జిల్లాల అభివృద్ధి కార్యక్రమంఈ విభాగంలో పురస్కారాలను అందిస్తారు.

విభాగం 3: కేంద్ర మంత్రిత్వ శాఖలువిభాగాలురాష్ట్రాలుజిల్లాల స్థాయిలో ఆవిష్కరణలుఈ విభాగంలో అవార్డులను ప్రదానం చేస్తారు.

అక్టోబర్ 01, 2025న ప్రధానమంత్రి పురస్కారాల పోర్టల్ ప్రారంభమైంది. 01 అక్టోబర్ 2025 నుంచి 30 నవంబర్ 2025 వరకు నమోదు ప్రక్రియనామినేషన్ల దాఖలుకు ఈ పోర్టల్ అందుబాటులో ఉంది.

పీఎం అవార్డుల పోర్టల్ 2,035 నామినేషన్లు స్వీకరించిందివిభాగాలవారీగా అందిన నామినేషన్లు:

(a) జిల్లాల సమగ్రాభివృద్ధి - 513

(b) ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి కార్యక్రమం - 464

(c) ఆవిష్కరణలు - 1058

పురస్కారాల కోసం దరఖాస్తుల ఎంపిక ఈ విధంగా ఉంటుంది. (i) అదనపు కార్యదర్శుల అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ జిల్లాలుసంస్థలను ఎంపిక చేస్తుంది. (ii) డీఏఆర్ పీజీ కార్యదర్శి అధ్యక్షతన నిపుణుల కమిటీ వాటిని పరిశీలిస్తుంది. (iii) కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన అధికార కమిటీ తుది జాబితాను సిద్ధం చేస్తుందిపురస్కారాల కోసం అధికార కమిటీ చేసిన సిఫార్సులకు ప్రధానమంత్రి ఆమోదం తెలియజేస్తారు.

ప్రధానమంత్రి పురస్కారాలు 2025లో (i) ట్రోఫీ, (ii) ప్రశంసా పత్రం, (iii) రూ.20 లక్షల ప్రోత్సాహకం ఉంటాయిఅవార్డు పొందిన జిల్లాసంస్థ ప్రజల సంక్షేమానికి ఏదైనా రంగంలో ప్రాజెక్టుకార్యక్రమాన్ని అమలు చేయటానికి లేదా వనరుల లోటును భర్తీ చేయటానికి రూ.20 లక్షల ప్రోత్సాహకాన్ని వినియోగించాల్సి ఉంటుంది.

న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా 21 ఏప్రిల్ 2026న గౌరవ ప్రధానమంత్రి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు

 

***


(रिलीज़ आईडी: 2197104) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati