ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీలంకలో దిత్వా తుపాను కారణంగా సంభవించిన ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం

प्रविष्टि तिथि: 28 NOV 2025 3:47PM by PIB Hyderabad

దిత్వా తుపాను సృష్టించిన విపత్తు కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన శ్రీలంక ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సంతాపం తెలిపారుబాధిత కుటుంబాల భద్రతమనోధైర్యంత్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.

భారత్ కు అత్యంత సన్నిహిత సముద్రతీర పొరుగు దేశమైన శ్రీలంకకు సంఘీభావం తెలుపుతూ.. తమ ప్రభుత్వం ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా అత్యవసర సహాయక సామగ్రినిమానవతా సహాయంవిపత్తు సహాయక మద్దతును వెంటనే పంపించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారుపరిస్థితులు మారుతున్న కొద్దీ అదనపు సాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని భరోసానిచ్చారు.

భారత్ అనుసరిస్తున్న పొరుగు దేశాల ప్రాధాన్యత విధానం, 'విజన్ మహాసాగర్’ మార్గదర్శక సూత్రాల ఆధారంగా మార్గనిర్దేశనం చేస్తూ కష్టకాలంలో శ్రీలంకకు భారత్ అండగా ఉంటుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మరోసారి స్పష్టం చేశారు.

 మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన పోస్టులో శ్రీ మోదీఇలా అన్నారు:

‘‘దిత్వా తుఫాను కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన శ్రీలంక ప్రజలకు నా హృదయపూర్వక సంతాపంబాధిత కుటుంబాల భద్రతఓదార్పుత్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను.

మా అత్యంత సన్నిహిత సముద్రతీర పొరుగు దేశమైన శ్రీలంకకు సంఘీభావంగా.. భారత్ ఆపరేషన్ సాగర్ బంధు కింద సహాయ సామాగ్రిని కీలకమైన హెచ్ఏడీఆర్ మద్దతును అత్యవసరంగా పంపిందిపరిస్థితులు మారుతున్న కొద్దీ మరింత సహాయాన్ని అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.

పొరుగు దేశాల ప్రాధాన్యత విధానంవిజన్ మహాసాగర్ సూత్రాల ఆధారంగా మార్గనిర్దేశనం చేస్తూ అవసర సమయాల్లో శ్రీలంకకు భారత్ అండగా నిలబడతుంది.

@anuradisanayake’’

 

(रिलीज़ आईडी: 2196717) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam