సినిమాలోని పాత్రల భావోద్వేగాలు, మానసిక సంఘర్షణలను విశ్లేషించిన “దిస్ టెంప్టింగ్ మ్యాడ్‌నెస్” చిత్ర బృందం
జ్ఞాపకాలు, స్త్రీ ద్వేషం, మనుగడ, వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన తీరును చర్చించిన చిత్ర బృందం
బాధ, దృక్కోణం, ఈ కథ ఈ రోజు ఎందుకు ముఖ్యమైందనే అంశాలపై ఆసక్తికర సంభాషణ
దిస్ టెంప్టింగ్ మ్యాడ్‌నెస్ చిత్ర బృందంతో ఐఎఫ్ఎఫ్ఐ వేదికగా జరిగిన విలేకరుల సమావేశం ఈ చిత్రంలోని పాత్రల మానసిక స్థితిని, సాన్నిహిత్యాన్ని, చాలా కాలం పాటు నిలిచి పోయే వాటి సంభాషణల్లోని సత్యాలను ప్రతిబింబించింది. దర్శకుడు జెన్నిఫర్ మోంట్‌గోమెరీ, నిర్మాత ఆండ్రూ డేవిస్, నటులు సూరజ్ శర్మ, జెనోబియా ష్రాఫ్‌లు మాట్లాడుతూ... జ్ఞాపకాలు, భావోద్వేగాలు, వాస్తవిక ఘటనల ఆధారంగా రూపొందించిన ఈ బాధాకరమైన కథను తెరకెక్కించడంలో వారి అనుభవాలను వివరించారు.
జెన్నిఫర్ మాట్లాడుతూ... "ఒక నిజమైన కథ, దురదృష్టం నిండిన జీవితంలోని కథ నుంచి ఈ కథ ప్రేరణ పొందింది." అన్నారు. కథనం గురించి మాట్లాడటం కూడా కష్టమని చెబుతూ... వర్ణించడానికి మాటలు కూడా సరిపోని భావాలను ఎన్నో సినిమా అందించగలదని ఆమె స్పష్టం చేశారు. "వాస్తవ సంఘటనల భారాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి తగిన వేదికను మేం ఇవ్వాలనుకున్నాం." అని వ్యాఖ్యానించారు.
ఆండ్రూ మాట్లాడుతూ... నిజ జీవిత గాయాన్ని స్వీకరించడంలో ఉన్న సవాలును ప్రతిబింబించారు. వాస్తవ కథను చెప్పడం బాధ్యతతో కూడుకున్నదని ఆయన పేర్కొన్నారు. “కథకులుగా, మేం ఒక సంఘటనను తిరిగి చెప్పడం మాత్రమే కాదు. అర్థం, వివరణ, సమాధానం లేని ప్రశ్నలకు సమాధానం కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాం. అదే మా నిజమైన పని.” అని వివరించారు.
నటుడు సూరజ్ శర్మ మాట్లాడుతూ... ఈ చిత్రం తనకు కేవలం మరొక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇది వ్యక్తిగత అనుబంధం గలది అన్నారు. ఈ అనుభవాన్ని "చాలా మందికి వర్తించేది" గా అభివర్ణిస్తూ... మానసిక, భావోద్వేగ వేధింపుల భయంకరమైన ప్రాబల్యం గురించీ ఆయన ప్రస్తావించారు. "ప్రపంచంలో పదకొండు శాతం మంది మహిళలు సమస్యను ఎదుర్కొంటున్నారు... భారత్ లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువ. చర్చను ప్రారంభించే చిత్రంలో భాగం కావడం చాలా ముఖ్యం అనిపించింది." అన్నారు.
తన స్నేహితుడి సోదరి... వేధింపులను భరించడాన్ని, ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన తన జీవితంలోని ఒక క్షణాన్నీ ఆయన పంచుకున్నారు. "ఈ చిత్రం నిజంగా బాధిత మహిళలకు నివాళి" అని ఆయన అన్నారు.
జెనోబియా ష్రాఫ్ మాట్లాడుతూ... భారతీయ తల్లిగా నటించడం గురించి ఆమె వర్ణన సూక్ష్మ నైపుణ్యాలను, ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. పైకి కూతురికి మద్దతునిస్తూనే... లోపల సాంస్కృతిక నిశ్శబ్దం ఒత్తిడికి లోనయ్యే పాత్ర అది అని తెలిపారు. "ఈ దేశంలో తల్లీకూతుళ్ల సమీకరణం మనందరికీ తెలుసు" అని ఆమె అన్నారు. "ఎవరికీ చెప్పకండి అనే పొర ఎప్పుడూ ఉంటుంది. తల్లులలో కూడా లోలోపల దాగి ఉన్న స్త్రీ ద్వేషం." ఉందన్నారు. ఈ పరిస్థితిలో వెలుగులు నింపడమే తన లక్ష్యమని ఆమె జోడించారు: "మనం మన స్త్రీలను జాగ్రత్తగా ఉండమని చెప్పడం మానేసి, మన పురుషులకు మంచి ప్రవర్తనతో ఉండాలని చెప్పడం ప్రారంభించాలి." అన్నారు.
పాత్రల్లో భారతీయ నేపథ్యం ఉన్నప్పటికీ... కథ సార్వత్రికమైనదని జెన్నిఫర్ అన్నారు. "మేం ఈ పాత్రకు ఉత్తమ వ్యక్తి సైమన్ ఆష్లీని ఎంపిక చేశాం... ఆమె భారతీయ మూలానికి చెందినవారే" అని ఆమె అన్నారు. మిగిలిన తారాగణం ఆమెకు తెలియని సాంస్కృతిక ప్రత్యేకతలను గురించి అవగాహన కల్పించడంలో సహాయం చేశారని తెలిపారు.
సాంకేతికత పరంగా చిత్ర బృందం సినిమా గురించి వివరిస్తూ... మియా జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆమె దిక్కుతోచని స్థితిని ప్రతిబింబించడానికి ఇంటర్‌కట్ జ్ఞాపకాలను ఉపయోగించినట్లు తెలిపారు. "మీరు జ్ఞాపకశక్తిని కోల్పోయినప్పుడు, ఏదీ కచ్చితమైనది కాదు" అని జెన్నిఫర్ వివరించారు. "కాబట్టి మేం ప్రస్తుత, పాత జ్ఞాపకాల మధ్య నిరంతరం కదిలే దృశ్య నిర్మాణాన్ని నిర్మించాం." అని వ్యాఖ్యానించారు.
ఈ సినిమా చేస్తున్నప్పుడు జెన్నిఫర్ వర్జీనియా వోల్ఫ్ నుంచి ఏదైనా ప్రేరణ పొందారా అని ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు సంభాషణ సాహిత్యం దిశగానూ మళ్లింది. ఆమె మాట్లాడుతూ నేను అలా చేయలేదు.. కానీ ఇప్పుడు ఆమె గురించి చదివి ఆ కోణాన్నీ చూడాలనుకుంటున్నానని నవ్వుతూ చెప్పారు.
కథలోని భావోద్వేగ సారాంశాన్ని ప్రతిబింబిస్తూ, జెన్నిఫర్ దానిని హృదయపూర్వకంగా ఇలా సంగ్రహించారు: “ప్రతి పాత్రలోనూ మానవత్వాన్ని కనుగొనడం రచయిత-దర్శకురాలిగా నా పాత్ర. మనమందరం ఏదో ఒక సమయంలో పిచ్చితనంతో ఉద్రేకానికి గురయినట్లు భావిస్తాం.” అన్నారు.
"వాస్తవ సంఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ చిత్రం బలానికి నిదర్శనం. ప్రజలు మారగలరు, వారు బలంగా మారగలరు" అని ప్రకటిస్తూ ఆండ్రూ సమావేశాన్ని ముగించారు.
గాయం, ప్రేమ, స్వీయ సందేహం, మనుగడ ఇతివృత్తాలుగా, దిస్ టెంప్టింగ్ మ్యాడ్‌నెస్ ఐఎఫ్ఎఫ్ఐ ప్రేక్షకులకు కేవలం సినిమా చర్చ కంటే ఎక్కువ కంటెంట్ అందించింది. ఇది వారిలో ప్రశ్నలు, ప్రతిబింబాలు, ప్రజల వెంట నడిచే కనిపించని యుద్ధాల పట్ల సహానుభూతినీ మిగిల్చింది.
పీసీ లింక్:
ఐఎఫ్ఎఫ్ఐ గురించి:
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం దక్షిణాసియాలోనే పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలుస్తుంది. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్... భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... గోవా రాష్ట్ర ప్రభుత్వం... గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ప్రపంచ సినిమాకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. ఇక్కడ అలనాటి అపురూప చిత్రాలు, సాహసోపేతమైన ప్రయోగాత్మక చిత్రాలు, లెజెండరీ మాస్ట్రోలు, నిర్భయంగా రూపొందించిన తొలి సినిమాలు ఒకే చోట కలిసి ఈ వేడుకలకు హాజరైన ప్రేక్షకులను అలరిస్తాయి. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, ఘన నివాళులతోపాటు... ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలకు అపార అవకాశాలను అందించే శక్తిమంతమైన వేవ్స్ ఫిల్మ్ బజార్ వంటి కార్యక్రమాలు ఐఎఫ్ఎఫ్ఐని మరింత అద్భుత వేదికగా మార్చుతున్నాయి. నవంబర్ 20–28 వరకు అందమైన గోవా తీరప్రాంతంలో ప్రదర్శితమయ్యే 56వ ఎడిషన్.... ప్రపంచ వేదికపై భారత సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించే ఒక అద్భుతమైన వేడుకగా... భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుత సంగమంగా నిలుస్తుంది.
మరింత సమాచారం కోసం, క్లిక్ చేయండి:
IFFI Website: https://www.iffigoa.org/
PIB’s IFFI Microsite: https://www.pib.gov.in/iffi/56/
PIB IFFIWood Broadcast Channel: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X Handles: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
रिलीज़ आईडी:
2196714
| Visitor Counter:
2