ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గోవాలోని కనకోన పర్యటనకు సంబంధించిన దృశ్యాలను పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 28 NOV 2025 10:11PM by PIB Hyderabad

శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం 550వ వార్షికోత్సవ వేడుక 'సార్థ పంచశతమానోత్సవం'  సందర్భంగా ఇవాళ గోవాలోని కనకోన పర్యటన దృశ్యాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠంలో 77 అడుగుల శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరించారుమఠం అభివృద్ధి చేసిన 'రామాయణ థీమ్ పార్క్ గార్డెన్'ను ప్రారంభించారుఈ సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్ఒక స్మారక నాణెన్ని కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్ఖాతాలోని ఓ పోస్టులో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:

"పర్తగాళిఉడుపి మఠాలు రెండూ ఒకే ఆధ్యాత్మిక నదిలోని జీవధారలువినయంసంస్కారంసేవలకు ప్రతీకలైన ఈ మఠాల నుంచి రాబోయే తరాలు నిరంతరం స్ఫూర్తిని పొందుతాయని నేను విశ్వసిస్తున్నాను"

 

"గోవాలోని ఆలయాలుస్థానిక సంప్రదాయాలు ఆపదను ఎదుర్కొన్నప్పుడు పర్తగాళి మఠం వంటి సంస్థలు ఇక్కడి సాంస్కృతిక అస్తిత్వాన్ని రక్షించాయి"

 

"ఇవాళ అద్భుతమైన సాంస్కృతిక పునరుజ్జీవనానికి భారత్ సాక్షిగా నిలుస్తోందిదీనికి ఎన్నో ఉదాహరణలున్నాయి...”

 

"శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం 550వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా కనకోనలో జరిగిన అద్భుతమైన కార్యక్రమానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి"

 

"శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠంలో 77 అడుగుల శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించానుభక్తులందరూ ఈ విగ్రహాన్ని సందర్శించాలని కోరుతున్నానుతప్పకుండా మీరు ప్రత్యేకమైన అనుభూతిని పొందుతారు"


(रिलीज़ आईडी: 2196700) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Assamese , Manipuri , Gujarati , Odia , Telugu , Kannada , Malayalam