హోం మంత్రిత్వ శాఖ
ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్ లో 9 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు సహా మొత్తం 20 పతకాలతో అద్భుత ప్రదర్శన చేసిన భారత బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా
దేశ గౌరవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారత బృందం
మీ శ్రమ, పట్టుదల, నైపుణ్యాలు వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమైన సువర్ణ మార్గం
प्रविष्टि तिथि:
24 NOV 2025 2:40PM by PIB Hyderabad
ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్ లో 9 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలతో సహా మొత్తం 20 పతకాలతో అద్భుత ప్రదర్శన చేసిన భారత బృందానికి కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
సోషల్ మీడియా ఎక్స్ లో శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు.
"మన బాక్సర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ లో అసాధారణ ప్రతిభ కనబరిచిన భారత బృందానికి హృదయపూర్వక అభినందనలు. మీరు సాధించిన 9 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు సహా మొత్తం 20 పతకాల విజయంతో మన దేశ గౌరవం మరో స్థాయికి పెరిగింది. మీ శ్రమ, పట్టుదల, నైపుణ్యాలు వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమైన సువర్ణ మార్గాన్ని సుగమం చేశాయి. మీ ప్రయాణంలో ఎల్లప్పుడూ విజయం వరించాలని ఆకాంక్షిస్తున్నాను"
(रिलीज़ आईडी: 2193851)
आगंतुक पटल : 23