తాష్కెంట్ పర్వతాల నుంచి స్లోవేకియాలోని మారుమూల గ్రామాల దాకా... ఐఎఫ్ఎఫ్ఐ 56వ ఎడిషన్‌లో వెండితరపై అలరించిన మానవీయ కథలు
జ్ఞాపకాలు, వలసలతో ముడిపడిన మానవీయ కథలను హైలైట్ చేసిన ఉజ్బెక్, స్లోవేక్ సినిమాలు
భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ 56వ ఎడిషన్ ప్రపంచవ్యాప్తంగా గల శక్తిమంతమైన కథనాలను, విభిన్నమైన ప్రపంచస్థాయి సినిమాలను ప్రదర్శిస్తూనే ఉంది. అంతర్జాతీయ చిత్రాల్లో ఉజ్బెక్ చిత్రం ఇన్ పర్సూట్ ఆఫ్ స్ప్రింగ్, స్లోవాక్ చిత్రం ఫ్లడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ రెండు చిత్రాల దర్శక-నిర్మాతలు, నటీనటులు తమ చిత్ర రూపకల్పన ప్రయాణాల గురించి తమ అనుభవాలను పంచుకున్నారు.
స్లోవేక్ చిత్రం "ఫ్లడ్" నిర్మాత కటారినా క్రనాకోవా మాట్లాడుతూ... ఈ చిత్రం నీటి రిజర్వాయర్ నిర్మాణం కోసం ఒక గ్రామం వలస ఆధారంగా రూపొందించారు. స్లోవేకియాలోని మజోవా ప్రాంతంలో చిత్రీకరించిన ఈ చిత్రంలో దాదాపు 80 శాతం మంది తారాగణం రుథేనియన్ మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారు. "ఈ చిత్రం వెండితెరపై వారి సొంత భాషలో ప్రదర్శన ఇచ్చే అరుదైన అవకాశాన్ని రుథేనియన్ కమ్యూనిటీకి అందించింది" అని ఆమె వ్యాఖ్యానించారు.
అర్జెంటీనాలో జరిగిన చలనచిత్రోత్సవంలో తొలి ప్రదర్శన తర్వాత ఈ ఫ్లడ్ చిత్రం ఐఎఫ్ఎఫ్ఐ గోవాలో రెండో ప్రపంచస్థాయి ప్రీమియర్‌ను ప్రదర్శించింది. నిజ జీవిత ప్రాజెక్ట్ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం ద్వారా ఈ ప్రాజెక్ట్ ప్రభావిత కమ్యూనిటీల కోసం చిత్ర బృందం ప్రత్యేక స్క్రీనింగ్‌ను ప్లాన్ చేస్తోంది.
ఉజ్బెక్ చిత్రం "ఇన్ పర్సూట్ ఆఫ్ స్ప్రింగ్" తరపున దర్శకుడు అయూబ్ షఖోబిద్దినోవ్, ప్రముఖ నటి ఫరీనా జుమావియాలు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని పరిచయం చేస్తూ... ఈ చిత్ర కథ ప్రధానంగా బాధాకరమైన జ్ఞాపకాలు, చాలా కాలంగా దాచి ఉంచిన రహస్యాలను చిత్ర ప్రధాన పాత్ర రహత్ షుకురోవా ఎదుర్కొనే ప్రయాణాన్ని హృద్యంగా చూపిస్తుందని దర్శకుడు తెలిపారు. "గతం తిరిగి కళ్లముందుకు వచ్చినప్పుడు తనతో తాను సయోధ్య కోసం రాహత్ పాత గాయాలు, దాచిన సత్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది" అని ఆయన వివరించారు.
ఉజ్బెకిస్తాన్‌లో సోవియట్ శకం చివరి సంవత్సరాల్లో జరిగినప్పటికీ… ఈ చిత్ర ఇతివృత్తాలు, భావోద్వేగ పోరాటాలు నేటికీ సంబంధితంగా ఉన్నాయి. చిత్రరూపకర్తలకు వారి ప్రతిభను ప్రదర్శించడానికి, ప్రపంచ నెట్‌వర్క్‌లను నిర్మించడానికి ఒక విలువైన అంతర్జాతీయ వేదికను ఐఎఫ్ఎఫ్ఐ అందిస్తున్నదని దర్శకుడు ప్రశంసించారు. "ఐఎఫ్ఎఫ్ఐలో భాగం కావడం మాకు సంతోషంగా ఉంది" అని ఆయన అన్నారు.
సారాంశం: ఇన్ పర్సూట్ ఆఫ్ స్ప్రింగ్
తాష్కెంట్ నివాసి రహత్ షుకురోవా తన గతంలోని ఒకరి మరణం గురించి తెలుసుకుని, ఒకప్పుడు తాను ఉపాధ్యాయురాలిగా పనిచేసిన మారుమూల పర్వత గ్రామమైన ఆర్కలీకి తిరిగి వస్తుంది. దశాబ్దాల క్రితం సోవియట్ యుగంలో అవమానం, బహిష్కరణకు దారితీసిన ఒక కుంభకోణంతో ఆమె జీవితం ఛిన్నాభిన్నమైంది. ఇప్పుడు ఆర్కలీకి తిరిగి వచ్చిన ఆమె... బాధాకరమైన జ్ఞాపకాలను, చాలా కాలంగా దాచి ఉంచిన రహస్యాలను ఎదుర్కోవలసి వస్తుంది. గతం తిరిగి బయటపడుతున్నప్పుడు, రాహత్ తనతో తాను సయోధ్య కోరుతూ పాత గాయాలు, దాచిన సత్యాల ద్వారా తన మార్గాన్ని అన్వేషించాల్సి వస్తుంది.
సారాంశం: ఫ్లడ్
మారా స్వస్థలమైన లోయలోని గ్రామాల భవిష్యత్తు కొత్త నీటి రిజర్వాయర్ ప్రాజెక్టు ద్వారా ప్రశ్నార్థకం అవుతుంది. గ్రామస్తులంతా క్రమంగా తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వస్తుంది. మారా గ్రామీణ ప్రాంతాలను వదిలి పట్టణంలో చదువుకోవాలని కోరుకుంటుంది. అయితే రుథేనియన్ రైతు అయిన ఆమె తండ్రి ఆమెను వారసత్వంగా వస్తున్న భూమిని సాగు చేయడంలో ఉంచాడు. అంతం సమీపిస్తున్నప్పటికీ అతను దానిని వదులుకోవడానికి నిరాకరించాడు. మౌలిక సదుపాయాల లేమి, అధికారుల నుంచి భయం, రాబోయే వరదలకు వ్యతిరేకంగా పోరాడుతున్న గ్రామ సమాజంలో మారా తనను తాను కనుగొంటుంది.
పీసీ లింక్:
ఐఎఫ్ఎఫ్ఐ గురించి
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం దక్షిణాసియాలోనే పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలుస్తుంది. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్... భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... గోవా రాష్ట్ర ప్రభుత్వం... గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ప్రపంచ సినిమాకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. ఇక్కడ అలనాటి అపురూప చిత్రాలు, సాహసోపేతమైన ప్రయోగాత్మక చిత్రాలు, లెజెండరీ మాస్ట్రోలు, నిర్భయంగా రూపొందించిన తొలి సినిమాలు ఒకే చోట కలిసి ఈ వేడుకలకు హాజరైన ప్రేక్షకులను అలరిస్తాయి. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్క్లాస్లు, ఘన నివాళులతో పాటు... ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలకు అపార అవకాశాలను అందించే శక్తిమంతమైన వేవ్స్ ఫిల్మ్ బజార్ వంటి కార్యక్రమాలు ఐఎఫ్ఎఫ్ఐని మరింత అద్భుత వేదికగా మార్చుతున్నాయి. నవంబర్ 20–28 వరకు అందమైన గోవా తీరప్రాంతంలో ప్రదర్శితమయ్యే 56వ ఎడిషన్.... ప్రపంచ వేదికపై భారత సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించే ఒక అద్భుతమైన వేడుకగా... భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుత సంగమంగా నిలుస్తుంది.
***
Release ID:
2193839
| Visitor Counter:
2