ధైర్యం, మంచి మనసుల ప్రయాణం – ఐఎఫ్ఎఫ్ఐలో ప్రేక్షకులను కదిలించిన ‘తన్వి ది గ్రేట్’
“సాధారణానికి వ్యతిరేకం అసహజం కాదు... అద్భుతం”: అనుపమ్ ఖేర్
హృదయానికి హత్తుకునే సినిమాలు, స్ఫూర్తిదాయకమైన కథా కథనాలతో ఈ సాయంత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఆహ్లాదకరంగా సాగింది. ఎన్నో ప్రశంసలు పొందిన చిత్ర నిర్మాత, నటుడు, దర్శకుడు అనుపమ్ ఖేర్ తన తాజా దర్శకత్వ వెంచర్ ‘తన్వి ది గ్రేట్’ను ప్రదర్శించారు. ఆటిజం స్పెక్ట్రమ్ సమస్య గల ఒక అసాధారణ అమ్మాయి తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సైన్యంలో చేరాలనే తన కలను సాకారం చేసుకోవాలనుకునే ప్రయత్నమే ఈ చిత్రం. ఆటిజం లక్షణాల కారణంగా ఇతరులు తన గురించి తప్పుగా భావించినప్పటికీ... నిజమైన హీరోయిజం హృదయం నుంచే వస్తుందని నిరూపించే కథ ఇది. ఉత్సవంలో ఈ చిత్ర ప్రదర్శన తర్వాత నటి తన్వితో కలిసి అనుపమ్ ఖేర్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశానికి ప్రేక్షకులు, ప్రతినిధుల నుంచి అసాధారణమైన హృదయపూర్వక, ఉత్సాహభరితమైన స్పందన లభించింది.

మీడియాతో జరిగిన సంభాషణలో అనుపమ్ ఖేర్ ఈ చిత్ర వ్యక్తిగత ఔచిత్యం గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ కథ తన వ్యక్తిగత, కుటుంబ జీవితంలోని సందర్భాలతో ముడిపడి ఉన్నదనీ, చిత్రనిర్మాతగా ఈ ప్రాజెక్ట్ తనకు భావోద్వేగపరంగా ఎంతో ముఖ్యమైనదని ఆయన తెలిపారు. ఆటిజం గురించి అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ... మనం తరచుగా "సాధారణ" అనే పదానికి వ్యతిరేక పదం "అసహజం"అని భావిస్తామని, కానీ సాధారణం అనే పదానికి వ్యతిరేకం "అద్భుతం" కూడా అవుతుందని అన్నారు. మానవ సమర్థత, సానుభూతి, పరివర్తనను హైలైట్ చేసే కథనాల పట్ల తాను ఎక్కువగా ఆకర్షితుడనయ్యానని ఖేర్ స్పష్టం చేశారు. "మానవ భావోద్వేగాల మూలాన్ని స్పృశించే... వ్యక్తులు వారి జీవితాల్లో సానుకూలమైన, అర్థవంతమైన మార్పులను తీసుకురావడానికి ప్రేరేపించే" చిత్రాలపై నిరంతరం పనిచేయడం పట్ల తన నిబద్ధతను వ్యక్తం చేశారు.

ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యాంశాల్లో ఒకటి... ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన నటి శుభాంగి దత్. ఆమె ‘తన్వి ది గ్రేట్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. కెమెరా ముందు తన మొదటి అనుభవం గురించి మాట్లాడుతూ, అనుపమ్ ఖేర్ దర్శకత్వం... ఆయన క్రమశిక్షణ... అవగాహనతో కూడిన ఆయన విధానం అద్భుతమని శుభాంగి ప్రశంసించారు. ఆయనను "కఠినమైన గురువు"గా అభివర్ణించిన శుభాంగి... ఆయన మార్గదర్శకత్వం తన నటనను బలోపేతం చేయడమే కాకుండా తన సొంత కళాత్మక సామర్థ్యాన్ని కనుగొనడంలోనూ సహాయపడిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సినిమాల్లో నటించడం పట్ల శుభాంగి ఆసక్తి వ్యక్తం చేశారు. తన నైపుణ్యాన్ని సవాలు చేసే, అర్థవంతమైన కథ చెప్పడానికి దోహదపడే పాత్రలను పోషించాలని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఉత్తేజకరమైన సందేశం, చక్కగా రూపొందించిన పాత్రలు, భావోద్వేగాల ప్రయాణంతో తన్వి ది గ్రేట్ చిత్రం ఎన్నో ప్రశంసలను పొందింది. ఐఎఫ్ఎఫ్ఐలో ఈ చిత్రానికి లభించిన ఆదరణ... సినిమా అభివృద్ధి ప్రయాణంలో మరో ముఖ్యమైన విజయాన్ని సూచిస్తుంది. అన్ని వయసులు, సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన ప్రేక్షకులను ఇది ఆకర్షిస్తుంది.
ప్రెస్ కాన్ఫరెన్స్ లింక్:
https://x.com/PIB_Panaji/status/1992161286780829855?s=20
“తన్వి ది గ్రేట్” చిత్రం ట్రైలర్ లింక్:
ఐఎఫ్ఎఫ్ఐ గురించి
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం దక్షిణాసియాలోనే పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలుస్తుంది. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్... భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... గోవా రాష్ట్ర ప్రభుత్వం... గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ప్రపంచ సినిమాకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. ఇక్కడ అలనాటి అపురూప చిత్రాలు, సాహసోపేతమైన ప్రయోగాత్మక చిత్రాలు, లెజెండరీ మాస్ట్రోలు, నిర్భయంగా రూపొందించిన తొలి సినిమాలు ఒకే చోట కలిసి ఈ వేడుకలకు హాజరైన ప్రేక్షకులను అలరిస్తాయి. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, ఘన నివాళులతో పాటు... ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలకు అపార అవకాశాలను అందించే శక్తిమంతమైన వేవ్స్ ఫిల్మ్ బజార్ వంటి కార్యక్రమాలు ఐఎఫ్ఎఫ్ఐని మరింత అద్భుత వేదికగా మార్చుతున్నాయి. నవంబర్ 20–28 వరకు అందమైన గోవా తీరప్రాంతంలో ప్రదర్శితమయ్యే 56వ ఎడిషన్.... ప్రపంచ వేదికపై భారత సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించే ఒక అద్భుతమైన వేడుకగా... భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుత సంగమంగా నిలుస్తుంది.
మరింత సమాచారం కోసం, దీనిపై క్లిక్ చేయండి:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2191742
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2190381
IFFI Website: https://www.iffigoa.org/
PIB’s IFFI Microsite: https://www.pib.gov.in/iffi/56new/
PIB IFFIWood Broadcast Channel: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X Handles: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
***
Release ID:
2193026
| Visitor Counter:
2