హోం మంత్రిత్వ శాఖ
కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్‌లో జరిగిన అహ్మదాబాద్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేసి, వివిధ స్టాల్‌లను సందర్శించారు.
పుస్తకాలు జ్ఞానానికి మూలం మాత్రమే కాదు.. వ్యక్తిత్వ వికాసానికి కూడా ఒక ముఖ్యమైన మాధ్యమాలు
సాహితీ కార్యక్రమాలు, జానపద గేయాలు, కవితా పఠనాలు, అంకుర సంస్థల ఫోరం అంశాలతో కూడిన ఈ ప్రదర్శన.. పఠనాసక్తిని, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా పిల్లలు, యువతను మేధోపరంగా సుసంపన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
प्रविष्टि तिथि:
22 NOV 2025 6:11PM by PIB Hyderabad
నేడు అహ్మదాబాద్‌లో జరిగిన అహ్మదాబాద్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో కేంద్ర హోం మంత్రి, సహకార మంత్రి శ్రీ అమిత్ షా పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేసి, వివిధ స్టాళ్లను సందర్శించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన ఒక పోస్టులో.. పుస్తకాలు కేవలం జ్ఞానానికి మూలం మాత్రమే కాదని, వ్యక్తిత్వ వికాసానికి కూడా ఒక కీలక సాధనమని కేంద్రమంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ‘‘నేడు ఏఎంసీ, జాతీయ పుస్తక ట్రస్టు (ఎన్‌బీటి) సంయుక్తంగా నిర్వహించిన అహ్మదాబాద్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలోని వివిధ స్టాళ్లను సందర్శించి, పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశాను’ అని తెలిపారు.
సాహితీ కార్యక్రమాలు, జానపద గేయాలు, కవితా పఠనాలు, అంకుర సంస్థల వేదికతో కూడిన ఈ ప్రదర్శన.. పఠనాన్ని, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా పిల్లలు, యువతలో మేధో వికాసాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2193020)
आगंतुक पटल : 4