ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు ప్రధానమంత్రి ప్రకటన

Posted On: 21 NOV 2025 6:45AM by PIB Hyderabad

దక్షిణాఫ్రికా అధ్యక్షతన జోహెన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న జీ20 నాయకుల 20వ సదస్సులో పాల్గొనాలన్న శ్రీ సిరిల్ రామఫోసా ఆహ్వానం మేరకు 2025 నవంబర్ 21 నుంచి 23 వరకు ఆ దేశంలో పర్యటిస్తాను.

ఆఫ్రికాలో జరుగుతున్న తొలి జీ20 సదస్సు కావడంతో ఇది చాలా ప్రత్యేకమైనదిభారత్ అధ్యక్షతన 2023లో జరిగిన జీ20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్ సభ్య దేశంగా మారింది.

ముఖ్యమైన అంతర్జాతీయ సమస్యలను చర్చించేందుకు ఈ సదస్సు ఓ మంచి అవకాశం. ‘ఐక్యతసమానత్వంస్థిరత్వం’ అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఏడాది జీ20 ద్వారా గతంలో భారత్‌లోని న్యూఢిల్లీబ్రెజిల్లోని రియో డి జనీరోలో నిర్వహించిన సదస్సుల ఫలితాలను దక్షిణాఫ్రికా ముందుకు తీసుకెళుతుంది. ‘వసుధైక కుటుంబం’, ‘ఒకే భూమిఒకే కుటుంబంఒకే భవిష్యత్తు’ అన్న మన లక్ష్యానికి అనుగుణంగా భారత్ దృక్పథాన్ని నేను ఈ సదస్సులో వివరిస్తాను.

ఈ సదస్సు సందర్భంగా భాగస్వామ్య దేశాల నాయకులతో చర్చించేందుకుఐబీఎస్ఏ ఆరవ సదస్సులో పాల్గొనేందుకు నేను ఎదురు చూస్తున్నాను.

దేశం వెలుపల ఎక్కువ మంది భారత సంతతి ప్రజలున్న దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటిఈ పర్యటనలో భాగంగా ఇక్కడి భారతీయులతో ముచ్చటించేందుకు ఎదురుచూస్తున్నాను.

 

***


(Release ID: 2192675) Visitor Counter : 11