రాష్ట్రపతి సచివాలయం
ఈ నెల 20 నుంచి 22 వరకు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పర్యటించనున్న భారత రాష్ట్రపతి
Posted On:
19 NOV 2025 5:39PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ నెల 20 నుంచి 22 వరకు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పర్యటిస్తారు.
ఈ నెల 20న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అంబికాపూర్‌లో నిర్వహించే జన్ జాతీయ గౌరవ్ దివస్ వేడుకలకు రాష్ట్రపతి హాజరవుతారు.
ఈ నెల 21న సికింద్రాబాద్‌లోని బొలారంలో గల రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్ 2025ను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. భారతీయ కళా మహోత్సవ్ రెండో ఎడిషన్... గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, గోవా, దాద్రా-నగర్ హవేలీ, డామన్-డయ్యూల గొప్ప సాంస్కృతిక, పాక, కళాత్మక సంప్రదాయాలను ప్రదర్శిస్తుంది.
ఈ నెల 22న పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల ప్రత్యేక సమావేశానికీ రాష్ట్రపతి హాజరవుతారు.
(Release ID: 2191866)
Visitor Counter : 10