సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉప్పొంగిన దేశభక్తి: ఉత్సాహంగా ప్రారంభమైన వందేమాతర ఉత్సవాలు


వందేమాతరానికి 150 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా సంవత్సరం పాటు జరగనున్న వేడుకలు

'వందేమాతరం' పాడుతూ రికార్డ్ చేసి పంపించిన 1.25 కోట్లకు పైగా భారతీయులు

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, 653 జిల్లాలలో కార్యక్రమాల నిర్వహణ

వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 'వందేమాతరం' ఇతివృత్తంగా కార్యక్రమాలు నిర్వహించిన 11632 పాఠశాలలు, 554 కళాశాలలు

प्रविष्टि तिथि: 14 NOV 2025 3:36PM by PIB Hyderabad

జాతీయ గేయం స్ఫూర్తిని, భారత చరిత్రలో దాని విశిష్ట పాత్రను గుర్తు చేసుకునేందుకు ఉద్దేశించిన ఒక జాతీయ కార్యక్రమమే ‘వందేమాతరం 150 సంవత్సరాల’ వేడుక. వందేమాతరం కేవలం ఒక పాట మాత్రమే కాదు.. ఇది భారతదేశపు సామూహిక చైతన్యం. స్వాతంత్య్రోద్యమంలో ఇది పోరాట వీరులకు ఒక ముఖ్య నినాదంగా నిలిచింది.

దేశవ్యాప్తంగా ఘనంగా 'వందేమాతరం' 150వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకోవాలన్న ప్రతిపాదనకు  అక్టోబర్ 1వ తేదీన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం ప్రజలను… ముఖ్యంగా మన యువతను, విద్యార్థులను జాతీయ గేయానికి ఉన్న అసలైన, విప్లవాత్మక స్ఫూర్తితో అనుసంధానం చేసే ఒక ప్రభావవంతమైన ఉద్యమాన్ని పెంపొందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. వందేమాతరం శాశ్వత సందేశాన్ని గౌరవించటంతో పాటు దీని వారసత్వాన్ని వేడుకగా చేసుకునేలా, భావి తరాల హృదయాల్లో బలంగా నాటుకుపోయేలా ఈ ఉత్సవాలు ఉపకరిస్తాయి. 

బంకించంద్ర ఛటర్జీ రాసిన 'వందేమాతరం' మొదటగా ఆయన ప్రసిద్ధ నవల ఆనంద్‌మఠ్‌లో వచ్చింది. ఈ నవల బెంగాలీ సాహిత్య పత్రిక బంగదర్శన్‌లో ధారావాహికగా ప్రచురణ అయింది. కాలక్రమేణా ఇది భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి ముఖ్య నినాదంగా మారింది. మాతృభూమిని దైవంగా కీర్తిస్తూ, ప్రకృతిని దేశాన్ని రెండింటినీ సూచించే ఉద్వేగభరితమైన ఈ గేయం తరతరాలుగా భారతీయులకు ఉమ్మడి భావోద్వేగ, సాంస్కృతిక గుర్తింపును ఇచ్చింది.

వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాల ప్రారంభోత్సవం

ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా 'వందేమాతరం 150 ఏళ్ల' ఉత్సవాల భారీ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు, యువజన ప్రతినిధులు, సమాజంలోని వివిధ వర్గాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్మారక నాణెం, తపాలా బిళ్లను విడుదల చేశారు.

వందేమాతరం సంగీత కచేరి: నాద్ ఏకమ్, రూపమ్ అనేకమ్

'వందేమాతరం: నాద్ ఏకమ్, రూపమ్ అనేకమ్' అనే సాంస్కృతిక వేడుకలో గాయకులు, సంగీతకారులు ఒకే వేదికపైన వచ్చారు. వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ వీరంతా వందేమాతరాన్ని ఆలపించారు. ఈ ప్రదర్శన భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తిని అద్భుతంగా తెలియజేసింది. గర్వాన్ని, ఐక్యతను ప్రేరేపించే విషయంలో సంగీతానికి ఉన్న సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబించింది. ప్రతి భారతీయుడి గుండెలో ప్రతిధ్వనించే ఈ శాశ్వత గేయానికి ఇదొక హృదయపూర్వక నివాళిగా నిలిచింది. 

వందేమాతరం కచేరీ ఇక్కడ చూడండి - నాద్ ఏకమ్, రూపమ్ అనేకమ్

వందేమాతరం సామూహిక గీతాలాపన: దేశభక్తి ఉప్పెన

ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో చారిత్రాత్మకంగా పూర్తి 'వందేమాతరం' గీతాన్ని సామూహికంగా పాడారు. ఇది ఒక అద్భుత ఘట్టంగా నిలిచింది. దీనికి సమాంతంగా.. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు, గవర్నర్‌లు, లెఫ్టినెంట్ గవర్నర్‌లు, పాఠశాల- కళాశాల విద్యార్థులు, అధికారులు- ప్రజలు సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమాలలో పాల్గొన్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని రగిలించటంతో పాటు దేశభక్తి ఉత్సాహాన్ని, ఐక్యతను, మాతృభూమి పట్ల అంకితభావాన్ని ప్రేరేపించిన జాతీయ గేయానికి ఘన నివాళిగా ఈ కార్యక్రమం నిలిచింది. ఇది దేశభక్తి ఉత్సాహం, ఐక్యతను అద్భుతమైన స్థాయిలో ప్రదర్శించింది.

36 రాష్ట్రాలు, 653 జిల్లాల్లో వందేమాతరం కార్యక్రమాలు

వందేమాతరానికి సంబంధించిన వేడుకలు, కార్యక్రమాల్లో భారీ ఉత్తేజం నిండింది. దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించారు. 36 రాష్ట్రాలు, 653 జిల్లాలకు సంబంధించిన 39,783కు పైగా కార్యక్రమ వివరాలు ఇప్పటికే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అయ్యాయి. 

సామూహిక వందేమాతరం గీతాలాపనను కేంద్రంగా చేసుకొని అనేక కార్యక్రమాలు, అవగాహన కార్యకలాపాల ద్వారా వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని 52 మంత్రిత్వ శాఖలు కార్యక్రమాలు, కార్యకలాపాల వివరాలను ఇప్పటికే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాయి.

ప్రపంచవ్యాప్తంగా వందేమాతర కార్యక్రమాలు

సామూహిక వందేమాతరం గీతాలాపనను కేంద్రంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ మిషన్లు, రాయబార కార్యాలయాలు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. స్థానిక ప్రజల సమక్షంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భారతీయ సమాజం చురుకుగా పాల్గొంటోంది.

విద్యాసంస్థల్లో వందేమాతర వేడుకలు

దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు వందేమాతరం సామూహిక గీతాలాపన కు సంబంధించిన ఈ సామూహిక ఉద్యమంలో పాలుపంచుకున్నాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్న 11,632 పాఠశాలలు, 554 కళాశాలలు ఇప్పటికే 'వందేమాతర గేయానికి’ సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించాయి.

2025 నవంబర్ 7వ తేదీన ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అనేక పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు- అధ్యాపక సిబ్బంది వీక్షించారు.

ఇప్పటికే 1.25 కోట్ల మంది భారతీయులు 'వందేమాతరం' గాన ప్రదర్శనలను రికార్డ్ చేశారు. వందేమాతరం పూర్తి గేయం రికార్డింగ్ వినటంతో పాటు మీ రికార్డింగ్‌ను ఇక్కడ అప్‌లోడ్ చేయండి - https://www.vandemataram150.in/

 

***


(रिलीज़ आईडी: 2190440) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Punjabi