రక్షణ మంత్రిత్వ శాఖ
అమెరికాలో పర్యటించనున్న నౌకాదళ ప్రధానాధికారి
प्रविष्टि तिथि:
12 NOV 2025 9:00AM by PIB Hyderabad
నౌకాదళ ప్రధానాధికారి (సీఎన్ఎస్) అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి నవంబరు 12 మొదలు ఈ నెల 17 వరకు యునైటెడ్ స్టేట్స్‌లో ఆధికారిక పర్యటనకు బయలుదేరివెళ్లారు. భారతీయ నౌకాదళానికీ, అమెరికా నౌకాదళానికీ మధ్య చిరకాలంగా కొనసాగుతూ వస్తున్న పటిష్ఠ భాగస్వామ్యాన్ని మరింత బలపరచడం ఈ పర్యటన లక్ష్యం. భారతీయ నౌకాదళానికీ, అమెరికా నౌకాదళానికీ మధ్య గల భాగస్వామ్యం భారత్-యూఎస్ రక్షణ భాగస్వామ్యంలో కీలక పాత్రను పోషిస్తోంది.

అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులతో సీఎన్ఎస్ చర్చిస్తారు. ఆయన యునైటెడ్ స్టేట్స్ ఇండో-పసిఫిక్ కమాండ్ (యూఎస్ఐఎన్‌డీఓపీఏసీఓఎమ్) కమాండర్ అడ్మిరల్ సామ్యూల్ జె. పాపారో, యునైటెడ్ స్టేట్స్ పసిఫిక్ ఫ్లీట్ (యూఎస్‌పీఏసీఎఫ్‌ఎల్‌టీ) కమాండర్ అడ్మిరల్ స్టీఫెన్ టి. కొహ్లర్‌తో పాటు నౌకాదళానికి చెందిన ఇతర సీనియర్ అధికారులతో, ప్రముఖులతో కూడా భేటీ అవుతారు. ఈ సమావేశాలు ప్రస్తుత నౌకా వాణిజ్య సహకారాన్ని సమీక్షించడానికీ, కార్యకలాపాల స్థాయి సంబంధాలను పెంపొందించుకోవడానికీ, సమాచారాన్ని పంచుకోవడంతో పాటు రెండు నౌకాదళాల మధ్య నౌకా వాణిజ్య అవగాహనను బలపరుచుకోవడానికీ ఒక అవకాశాన్ని అందిస్తాయి.
ఈ పర్యటనలో అమెరికా నౌకాదళంలోని ప్రముఖ నౌకాదళ సంస్థలతో పాటు కార్యకలాపాల కమాండ్లతో సమావేశాలు కూడా చోటుచేసుకొంటాయి. చర్చల్లో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి నౌకా వాణిజ్య ప్రాధాన్యాలు, మిలన్ (ఎంఐఎల్ఏఎన్) వంటి బహుళపక్ష ప్రణాళికల్లో భాగంగా సమన్వయం, సంయుక్త నౌకావాణిజ్య బలగాల (సీఎంఎఫ్) కార్యక్రమాలపైన కూడా దృష్టిని కేంద్రీకరిస్తారు.
భారత్, అమెరికాల మధ్య పరస్పర విశ్వాసానికి తోడు ఉమ్మడి విలువలపై ఆధారపడిన నౌకా వాణిజ్య ప్రధాన భాగస్వామ్యం దీర్ఘకాలంగా కొనసాగుతోంది. నౌకాదళ ప్రధానాధికారి ప్రస్తుత పర్యటన.. స్వతంత్రమైన, బహిరంగ, సమ్మిళితత్వ స్ఫూర్తి ప్రధానమైన ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని ఆవిష్కరించాలన్న దృష్టికోణంతో సాగుతుంది.
***
(रिलीज़ आईडी: 2189160)
आगंतुक पटल : 35