ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రజలు, మంత్రిత్వ శాఖలు, విభాగాలను కలుపుతూ సురక్షితమైన, పరస్పరం పనిచేసే, జవాబుదారీతనంతో డిజిటల్ పాలనను అందించే విశ్వసనీయ వేదిక డిజీలాకర్: ఎమ్ఈఐటీవై కార్యదర్శి ఎస్.కృష్ణన్

'డిజీలాకర్ - కాగిత రహితంగా అందరికీ డిజిటల్ పత్రాలను అందుబాటులో ఉంచటం' అంశంపై ఎన్ఈజీడీ జాతీయ సదస్సు.. డిజిటల్ విశ్వాసానికి, సమర్థతకు మూలస్తంభం డిజీలాకర్

'డిజీలాకర్ యాక్సిలరేటర్స్'గా ఏడు రాష్ట్రాల గుర్తింపు: అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, కేరళ, మహారాష్ట్ర, మిజోరాం.. ఆయా రాష్ట్రాలు సాధించిన విజయాలకు అభినందనలు

పాలన, విద్య, ఆర్థిక రంగాల్లో డిజీలాకర్‌ను పెద్దఎత్తున విస్తరించటంపై రాష్ట్రాలు, పరిశ్రమల భాగస్వాముల ప్రదర్శన

Posted On: 08 NOV 2025 9:29AM by PIB Hyderabad

'డిజీలాకర్ - కాగిత రహితంగా అందరికీ డిజిటల్ పత్రాలను అందుబాటులో ఉంచటం అంశంపై ఈ వారం న్యూఢిల్లీలో జాతీయ సదస్సు జరిగిందిఈ సదస్సులో సీనియర్ ప్రభుత్వాధికారులుసాంకేతికఆర్థిక రంగాల ప్రముఖులువిద్యావేత్తలుడిజిటల్ పాలనా నిపుణులు పాల్గొన్నారుకాగిత రహిత పాలనసమ్మిళిత విద్యసురక్షిత డిజిటల్ సేవలను సులభతరం చేయటంలో డిజీలాకర్ పరివర్తనాత్మక పాత్రను ఈ సదస్సు స్పష్టం చేసిందిఇది దేశ డిజిటల్ విశ్వాస విప్లవంలో కీలక మైలురాయి.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఈ-గవర్నెన్స్ విభాగం ద్వారా భారత మండపంలో నిర్వహించిన ఈ సదస్సు.. డిజీలాకర్ అనేది డాక్యుమెంట్లను సురక్షితంగా భద్రపరచుకునే సదుపాయం అనే స్థాయి నుంచి  ప్రభుత్వవిద్యపారిశ్రామిక రంగాల్లో విశ్వాసంసౌలభ్యంసామర్థ్యానికి మూలస్తంభంగా అభివృద్ధి చెందిన విధానాన్ని చర్చించటానికిప్రదర్శించటానికి సహకార వేదికను అందించింది.

ఎమ్ఈఐటీవై కార్యదర్శి ఎస్.కృష్ణన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. దేశంలో డిజిటల్ పరంగా జరిగిన ప్రయాణాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అనుసంధానం చేయటం, సామర్థ్యంతో సేవలు అందించే స్థాయి నుంచి స్వావలంబన వైపుపాలనలో కీలకంగా మారి విశ్వాసాన్ని నిలబెట్టే దిశగా డిజిటలైజేషన్ పురోగమిస్తుందని అన్నారు. "డిజీలాకర్ అనేది ప్రజలుమంత్రిత్వ శాఖలువిభాగాలను కలుపుతూ సురక్షితమైనపరస్పరం పనిచేసేజవాబుదారీతనంతో డిజిటల్ పాలనను అందించే విశ్వసనీయ వేదికనమ్మకమైన డిజిటల్ లావాదేవీలుసాధికారత సాధించిన పౌరులుప్రతి సంస్థ బాధ్యతాయుతంగా ఉండే భవిష్యత్తే మా లక్ష్యంఅని తెలిపారు.

కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అభిషేక్ సింగ్ ప్రసంగిస్తూసాంకేతిక ఆధారిత పాలనలో భారతదేశ ప్రయాణాన్ని 'డిజిటల్ విశ్వాస విప్లవం'గా అభివర్ణించారులక్షలాది మంది ప్రజల కోసం పాలనా వ్యవస్థలపై విశ్వాసాన్ని పెంచటంలో డిజీలాకర్ కీలక పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారుడిజీలాకర్ భవిష్యత్తు గురించి వివరిస్తూఏఐ ఆధారిత ఈ-కేవైసీ ప్రపంచస్థాయి అర్హత పత్రాల ధ్రువీకరణ ప్రణాళికలను వివరించారుకాగిత రహిత పాలన కోసం డిజీలాకర్‌ను ప్రపంచ నమూనాగా నిలపాలని ఆకాంక్షించారు.

ఎన్ఈజీడీ అధ్యక్షుడుసీఈఓ శ్రీ నంద్ కుమారుమ్ మాట్లాడుతూ.. డిజీలాకర్డాక్యుమెంట్లను సురక్షితంగా భద్రపరచుకునే స్థాయి నుంచి 'డిజిటల్ ఇండియా'లో మూలస్తంభంగా మారిన క్రమాన్ని వివరించారుదీని ద్వారా పౌరులు తమ ఐడీలుఆర్థిక ధ్రువీకరణ పత్రాలుసర్టిఫికెట్లను సురక్షితంగా యాక్సెస్ చేయటానికినిర్ధరించుకోవటానికిపంచుకోవడానికి వీలవుతుందని స్పష్టం చేశారు. "దేశ సహకార విధానాన్నిడిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రతి పౌరుడికి అందించే విశ్వాసాన్నిసౌలభ్యాన్ని ఈ వేదిక ప్రతిబింబిస్తుందిఅని అన్నారు.

మహారాష్ట్ర ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఏ అండ్ టీడాక్టర్ రిచా బగ్లాఆ రాష్ట్ర పెన్షన్ట్రెజరీ వ్యవస్థల్లో డిజీలాకర్ అనుసంధానానికి సంబంధించి ప్రారంభ సమావేశంలో ఒక ప్రజెంటేషన్‌ను ఇచ్చారుఅస్సాంలోని సేవ సేతు పోర్టల్ ద్వారా 500కు పైగా సేవల్లో డిజీలాకర్‌ను అనుసంధానం చేయడంపై ఆ రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కె.ఎస్గోపీనాథ్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

డిజీలాకర్‌ను వినియోగించి విజయం సాధించిన రాష్ట్రాలను 'డిజీలాకర్ యాక్సిలరేటర్స్గా గుర్తించారుమెరుగైన భద్రతపారదర్శకతతో వివిధ సేవల్లో డిజీలాకర్‌ను పెద్ద ఎత్తున అమలు చేసిన అస్సాంను 'ఇంటిగ్రేషన్ ఎక్సలెన్స్గుర్తింపుతో సత్కరించారుఅతిపెద్ద డిజిటల్ గుర్తింపు అనుసంధానంతో ప్రజా కార్యక్రమాలను రూపొందించటానికి డిజీలాకర్‌ను సమర్థవంతంగా వినియోగించుకున్నందుకు గానూ హిమాచల్ ప్రదేశ్మధ్యప్రదేశ్ రాష్ట్రాలు 'పీపుల్ ఫస్ట్ ఇంటిగ్రేషన్గుర్తింపును పొందాయిడిజీలాకర్ఎంటిటీ లాకర్ అనే రెండు వేదికలను అనుసంధానం చేసినందుకు గానూ మేఘాలయ 'ద్వి వేదిక సమన్వయ విజేతగుర్తింపును అందుకుందిడిజీలాకర్ ద్వారా  కాగిత రహిత పాలనను ప్రారంభించటంలో ఆవిష్కరణలకు గానూ కేరళను సత్కరించారుడిజీలాకర్‌ను త్వరితగతిన అమలు చేసినందుకు మహారాష్ట్రకు 'ఫాస్ట్ ట్రాక్ ఇంటిగ్రేషన్గుర్తింపు లభించిందిఅత్యధిక సంఖ్యలో 'అభ్యర్థన నమూనాఅనుసంధానం చేసిన మిజోరం 'రిక్వెస్టర్ యాక్సిలరేటర్గా గుర్తింపు పొందింది.

సదస్సులో జరిగిన సమాంతర బ్రేక్ అవుట్ సమావేశాల్లో.. ప్రభుత్వంవిద్యఫిన్‌టెక్అదనపు విలువ సేవలు వంటి కీలక రంగాల్లో డిజీలాకర్ స్పష్టమైన ప్రభావంపై దృష్టి సారించారు.

ప్రభుత్వంవిద్య:

జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా డిజీలాకర్ విద్యా వ్యవస్థను మార్చిన విధానాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖఉన్నత విద్య సంయుక్త కార్యదర్శి శ్రీ గోవింద్ జైస్వాల్ వివరించారుసాంకేతికత సాయంతో ఎన్ఈపీ 2020 లక్ష్యాన్ని ఎన్ఈటీఎఫ్ ఎలా ముందుకు తీసుకెళ్తుందనే అంశానికి సంబంధించిన వివరాలను నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరమ్ (ఎన్ఈటీఎఫ్ఛైర్మన్ ప్రొఫెసర్ అనిల్ డిసహస్రబుద్ధే తెలిపారుకేరళలో సర్టిఫికెట్‌లెస్ గవర్నన్స్ కార్యక్రమం గురించి ఆ రాష్ట్ర ఐటీ మిషన్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ కుమార్ వెల్లడించారుఒకే పోర్టల్‌లో డిజీలాకర్ఎంటిటీలాకర్ రెండింటినీ సమన్వయం చేయటంపై మేఘాలయ ఐటీ కమిషనర్కార్యదర్శి శ్రీ ప్రవీణ్ బక్షి వివరాలు తెలిపారుసమగ్ర/సింగిల్ సిటిజెన్ డేటాబేస్ గురించి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఈ-మిషన్ బృందం అధిపతి శ్రీమతి రూచా మహాలె వివరించారుటీసీఎస్ ఐయాన్ నుంచి శ్రీ వైభవ్ మంగళ్ఐసీఎఫ్‌ఏఐ యూనివర్సిటీ నుంచి డాక్టర్ ముఖేశ్ కల్లా మాట్లాడుతూ.. మార్కుల షీట్లుడిగ్రీలుసర్టిఫికెట్లను దానంతట అదేతారుమారు చేయలేని విధానంలో డిజీలాకర్ పాత్ర గురించి తెలిపారుడిజీలాకర్ వ్యవస్థను విస్తరించటంపై ఢిల్లీ ఐఐఐటీకి చెందిన శ్రీ అంకిత్ జైన్శ్రీ సలిల్ అరోరా దృష్టి సారించారురాజస్థాన్‌లో డిజీలాకర్‌కు అనుబంధంగా పనిచేసే రాజ్ ఈ-వాల్ట్ కేంద్రీకృత డిజిటల్ రిపాజిటరీగా ఎలా సేవలందిస్తుందో ఆ రాష్ట్ర ఐటీ ఉపాధికార్మిక పథకాల ధ్రువీకరణసంయుక్త సంచాలకులు శ్రీమతి వినీల శ్రీవాస్తవ వివరించారువిద్యారంగంలో డిజీలాకర్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతదానివల్ల కలిగే ప్రమాదాల గురించి ఐఐటీ మద్రాస్‌కు చెందిన శ్రీ జయ కృష్ణన్ ఎమ్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఫిన్‌టెక్అదనపు విలువ సేవలు (వీఏఎస్):

పాన్ ఆధారంగా ఎంటిటీ లాకర్ ద్వారా ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారెంటీలను (-బీజీలుఎలా పొందవచ్చనే అంశంపై ఇ-గవర‌్నెన్స్ సర్వీసెస్ లిమిలిడ్ (ఎన్ఈఎస్ఎల్ఎండీ అండ్ సీఈఓ శ్రీ దేబజ్యోతి రే చౌదరి ప్రజెంటేషన్ ఇచ్చారుబ్యాంకింగ్ రంగంలో సవాళ్ల స్వీకరణపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ చిరాగ్ జైన్ మాట్లాడారుడిజీలాకర్ ద్వారా ఎడెల్‌వైస్ సంస్థ సంపూర్ణ డిజిటల్ ప్రవేశ ప్రక్రియ గురించి ఎడెల్‌వైస్ మ్యూచువల్ ఫండ్ డిజిటల్ ఉత్పత్తుల అధిపతి శ్రీమతి హనీ జగ్యసి వెల్లడించారువీసా ప్రక్రియలో డిజీలాకర్ మద్దతుకు సిఫార్సులను దస్తావేజుల పరిశీలనవీసా ప్రక్రియ డైరెక్టర్ శ్రీ షమీమ్ జలీల్ అందించారుడిజీలాకర్‌కు వస్తున్న నూతనావకాశాలను ఐసీఐసీఐ బ్యాంకు డిజిటల్ బిజినెస్ హెడ్ శ్రీ సురేశ్ ముత్యాల ప్రతిపాదించారుబ్యాంకు ప్రక్రియల్లో డిజీలాకర్ విస్తృతమైన అనుసంధానాన్ని కోటక్ మహీంద్రా బ్యాంకు కార్యానిర్వహక ఉపాధ్యక్షుడు శ్రీ ప్రశాంత్ ఎమ్బ్యాంక్ ఆఫ్ బరోడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ కిరుబానందన్ కె ప్రదర్శించారుడిజీలాకర్ ద్వారా విశ్వసనీయమైన డిజిటల్ మౌలిక సదుపాయాలపై పరిశ్రమ వర్గ ఆలోచనలను డిజియో సహ-వ్యవస్థాపకులు శ్రీ సంకేత్ నాయక్ తెలిపారు.

డిజీలాకర్ ద్వారా దేశంలోని ప్రభుత్వ డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలన్న లక్ష్యానికి ఈ జాతీయ సదస్సు ఒక నిదర్శనండిజీలాకర్ కేవలం సాంకేతిక వేదిక మాత్రమే కాదు.. సుపరిపాలనకు సాధనమని ఈ సదస్సు నిరూపించిందివివిధ రంగాల్లో ఆవిష్కరణలనుడిజిటల్ సేవలకు భద్రతను డిజీలాకర్ ఎలా కల్పిందనే విషయాలను ఈ సదస్సు తెలియజేసిందివిశ్వాసంపారదర్శకతసాంకేతిక నైపుణ్యం అనే మూలాలపై పాలనా నమూనాను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.

 

***


(Release ID: 2188165) Visitor Counter : 13