హోం మంత్రిత్వ శాఖ
'కేంద్ర హోం మంత్రి దక్షతా పతకం 2025' అందుకున్న పోలీసులకు అభినందనలు తెలియజేసిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
స్పెషల్ ఆపరేషన్స్, దర్యాప్తు, నిఘా, ఫోరెన్సిక్ వంటి రంగాలలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్‌లు), కేంద్ర పోలీసు సంస్థల (సీపీఓలు) సిబ్బంది భారతదేశాన్ని మరింత దృఢంగా, సురక్షితంగా చేసేందుకు దోహదపడ్డారు: కేంద్ర హోం మంత్రి
సాహసం, నిబద్ధత, అంకితభావానికి గుర్తింపుగా 2024లో ఈ అవార్డులను ప్రారంభించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఏంహెచ్ఏ)
దేశ సేవ మార్గాన్ని అనుసరించేందుకు మరింత మందికి స్ఫూర్తినందిస్తున్న అవార్డులు
प्रविष्टि तिथि:
31 OCT 2025 7:39PM by PIB Hyderabad
'కేంద్ర హోం మంత్రి దక్షతా పతకం 2025' అందుకున్న పోలీసందరికీ కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అభినందనలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర హోం, సహాకార శాఖ మంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
“‘కేంద్ర హోం మంత్రి దక్షతా పతకం 2025' అందుకున్న పోలీసులందరికీ అభినందనలు. స్పెషల్ ఆపరేషన్స్, దర్యాప్తు, నిఘా, ఫోరెన్సిక్ సైన్స్ వంటి రంగాలలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్‌లు), కేంద్ర పోలీసు సంస్థల (సీపీఓలు) సిబ్బంది మన దేశాన్ని మరింత దృఢంగా, సురక్షితంగా చేసేందురు దోహదపడ్డారు. సాహసం, నిబద్ధత, అంకితభావంతో కూడిన సేవను గౌరవిస్తూ 2024లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఓ) ఏర్పాటు చేసిన ఈ పురస్కారం.. మరింత మంది దేశ సేవ మార్గాన్ని అనుసరించేందుకు స్ఫూర్తిని అందిస్తుంది."
***
(रिलीज़ आईडी: 2185540)
आगंतुक पटल : 21