ప్రధాన మంత్రి కార్యాలయం
కన్నడ ‘రాజ్యోత్సవ’ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
01 NOV 2025 9:37AM by PIB Hyderabad
కర్ణాటక అవతరణ దినోత్సవం (కన్నడ రాజ్యోత్సవ) సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
కర్ణాటక ప్రజలు ప్రతిభకు, శ్రమశక్తి స్ఫూర్తికి ప్రసిద్ధి పొందారని శ్రీ మోదీ అన్నారు. అంతేకాకుండా సాహిత్యం, కళలు, సంగీతం సహా ఎన్నో అంశాల్లో రాష్ట్ర విశిష్టత ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. జ్ఞాన సంపదతో విలసిల్లే ఈ రాష్ట్రంలో ప్రగతి స్ఫూర్తికీ కొదవలేదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు సదా ఆయురారోగ్యాలతో.. సుఖసంతోషాలతో వర్ధిల్లాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు ఒక ప్రకటనలో:
“మనం ఈ రోజు కన్నడ రాజ్యోత్సవం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో కర్ణాటక ప్రజల ప్రతిభను, కష్టపడి పనిచేసే తత్వాన్ని కూడా స్మరించుకుంటున్నాం. సాహిత్య, సంగీత, కళా తదితర రంగాల్లోనూ కర్ణాటక సుసంపన్న సంస్కృతీ వారసత్వం ప్రస్ఫుటం అవుతూంటుంది. జ్ఞాన సంపద ఆధారిత పురోగమన స్ఫూర్తికి ఈ రాష్ట్రం ఒక ఉదాహరణ. ఇక్కడి ప్రజలందరూ నిత్యం శాంతిసౌభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా ఆశీర్వదించాలని ఆ దైవాన్ని వేడుకుంటున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 2185527)
Visitor Counter : 3
Read this release in:
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam