ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హర్యానా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 01 NOV 2025 9:20AM by PIB Hyderabad

హర్యానా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

 

రైతుల అవిశ్రాంత శ్రమసైనికుల సాటిలేని పరాక్రమంయువత అద్భుతమైన విజయాల ద్వారా హర్యానా రాష్ట్రం ఎల్లప్పుడూ దేశానికి స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రధానమంత్రి అన్నారుఅభివృద్ధి పథంలో వేగంగా పురోగమిస్తున్న రాష్ట్ర ప్రజలకు సంతోషంఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నట్లు తెలియజేశారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు:

 

హర్యానా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలుఈ చారిత్రక నేల రైతు సోదరీసోదరుల అవిశ్రాంత శ్రమజవాన్ల సాటిలేని పరాక్రమంయువత అద్భుతమైన విజయాలతో దేశం మొత్తానికి ఒక ఆదర్శంగా నిలిచిందిఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని.. పురోగతి పథంలో వేగంగా ముందుకు సాగుతున్న రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఉజ్వల భవిష్యత్తుతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను."

 

***


(రిలీజ్ ఐడి: 2185518) సందర్శకుల సూచీ సంఖ్య : : 26