బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

14వ దఫా వాణిజ్య బొగ్గు గనుల వేలం, కోయిల శక్తి, సీఎల్ఏఎంపీ పోర్టల్ లను ప్రారంభించనున్న బొగ్గు మంత్రిత్వ శాఖ

प्रविष्टि तिथि: 28 OCT 2025 11:57AM by PIB Hyderabad

2025 అక్టోబర్ 29 న్యూఢిల్లీలో 14 దఫా వాణిజ్య బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది కార్యక్రమానికి కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

భారత బొగ్గు రంగంలో పారదర్శకతపోటీస్వావలంబనను ముందుకు తీసుకెళ్లడంతో  ప్రారంభోత్సవం మరో మైలురాయిగా నిలవనుందిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2020లో ప్రారంభమైన వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రక్రియలో ఇప్పటివరకు ప్రఖ్యాతకొత్త పరిశ్రమల నుంచి బలమైన భాగస్వామ్యం కనిపించిందిఇది దేశీయ బొగ్గు ఉత్పత్తిని వేగవంతం చేయడంలోదేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి విశ్వసనీయ సరఫరా అందించడంలో కీలక పాత్ర పోషించింది.

రాబోయే 14 దఫా వేలం పాటలు  అభివృద్ధి ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నాయివ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించడానికివిభిన్న పెట్టుబడులను ఆకర్షించడానికివిస్తృత పరిశ్రమల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి అత్యంత అనుకూలమైన నిబంధనలతో బొగ్గు గనులను అందిస్తోంది వాణిజ్య వేలం పాట విధానం బొగ్గు రంగంలో పారదర్శకతను తీసుకురావడంపోటీని పెంపొందించడందేశీయ పరిశ్రమలకు బొగ్గు లభ్యతను విస్తరించడం ద్వారా దిగుమతి కోసం ఆధారపడటాన్ని తగ్గించి, ‘‘ఆత్మనిర్భర్ భారత్’’ లక్ష్యాన్ని బలోపేతం చేసింది.

వాణిజ్య వేలంపాట విధానంలో తొలిసారిగా అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (యూసీజీనిబంధనలను బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రవేశపెడుతోందిదేశంలో లోతైన బొగ్గు నిల్వలనుసంప్రదాయ పద్దతుల ద్వారా తవ్వడం సాధ్యం కాని వనరులను వినియోగించుకునేందుకు యూసీజీ  వ్యూహాత్మక ప్రయత్నం ఇది.  వినూత్న చర్య ద్వారా దిగుమతి చేసుకునే సహజ వాయువుముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించిపెట్టుబడులకుసాంకేతిక పురోగతికిసంబంధిత రంగాల్లో ఉపాధి అవకాశాలకు కొత్త మార్గాలను అందిస్తుంది.

14 విడత వేలంపాటలో పూర్తిగా పరిశీలించినపాక్షికంగా పరిశీలించిన బొగ్గు బ్లాక్లను వేలానికి తీసుకురానున్నారు ప్రక్రిలో అనుభవజ్ఞులైన తవ్వకదారులుకొత్తగా రంగంలోకి ప్రవేశించిన సంస్థలుసాంకేతికత ఆధారిత సంస్థలన్నింటినీ పాల్గొనడానికి ఆహ్వానించనున్నారు.

డిజిటల్ ఇండియా దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా బొగ్గు మంత్రిత్వ శాఖ  కార్యక్రమంలో రెండు విప్లవాత్మక డిజిటల్ వేదికలను సీఎల్ఏఎంపీకోయిల శక్తి పోర్టల్లను కూడా ప్రారంభించనుంది.

1.      సీఎల్ఏఎంపీ పోర్టల్

బొగ్గు భూ సేకరణనిర్వహణ చెల్లింపు వేదిక (కోల్ ల్యాండ్ అక్విజిషన్మేనేజ్మెంట్ అండ్ పేమెంట్ పోర్టల్).. బొగ్గు రంగంలో భూమి సేకరణనష్టపరిహారంపునరావాసంపునరావాస పునరుద్దరణ సంబంధిత ప్రక్రియలను సరళతరం చేయడానికి అభివృద్ధి చేసిన సమగ్ర డిజిటల్ వేదిక. భూమి రికార్డుల కోసం కేంద్రీకృత భాండాగారంగా పనిచేస్తూ.. బొగ్గు పీఎస్ యూల్లో వాస్తవిక డేటా సమీకరణమానిటరింగ్ సౌకర్యాన్ని అందిస్తుందిభూమి వివరాల అప్లోడ్ చేయడం నుంచి నష్టపరిహారం చెల్లింపుల వరకు పూర్తి ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడం ద్వారా  పోర్టల్ పారదర్శకతజవాబదారీతనంవిభాగాల మధ్య సమన్వయం పెంపొందిస్తుందిఅంతేకాకండా విధానపరమైన ఆలస్యాన్ని తగ్గించి డేటా డేటా పునరావృతాన్ని నివారిస్తుంది.

2. కోయిల శక్తి డాష్బోర్డ్:

కోయిల శక్తి డాష్బోర్డ్.. బొగ్గు రంగంలో మెరుగైన పారదర్శకతసామర్థ్యంవాస్తవిక సమన్వయం ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు రూపొందించిన  మార్గదర్శక డిజిటల్ వేదికగని నుంచి మార్కెట్ వరకు మొత్తం బొగ్గు వ్యవస్థను ఒకే ఇంటర్ఫేస్లో ఏకీకృతం చేయడం ద్వారా బొగ్గు సంస్థలురైల్వేలుఓడరేవులువినియోగదారుల మధ్య సహకారం సాధ్యమవుతుందికోయిల శక్తి డేటా ఆధారిత పరిపాలనలాజిస్టిక్‌, ఆప్టిమైజేషన్సరఫరా నిర్వహణను బలోపేతం చేస్తుంది మార్గదర్శక ముందడుగు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా.. దేశ బొగ్గు రంగానికి డిజిటల్ వెన్నెముకగా పనిచేస్తుంది.

పరిశ్రమ నాయకులుపెట్టుబడిదారులువాటాదారులను  ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొని భారతదేశ బొగ్గు వ్యవస్థ భవిష్యత్తును రూపొందించడంలో దోహదపడాలని బొగ్గు మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తుంది.

వికసిత్ భారత్ లక్ష్యం వైపు సాగుతున్న సమయంలో సంస్కరణలను అమలు చేయడంవ్యాపార సౌలభ్యాన్ని పెంచడంస్థిరమైనబాధ్యతాయుత బొగ్గు తవ్వకాల వాతావరణాన్ని ప్రోత్సహించడంలో మంత్రిత్వ శాఖ నిబద్ధతఅంకితభావంతో వ్యవహరిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2183575) आगंतुक पटल : 33
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Tamil