ప్రధాన మంత్రి కార్యాలయం
ఛఠ్ పూజలో సంధ్య వేళ అర్ఘ్య సమర్పణ ఘట్టం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
27 OCT 2025 2:02PM by PIB Hyderabad
ఈ రోజు ఛఠ్ పూజలో భాగంగా సంధ్య వేళ సూర్యునికి అర్ఘ్యాన్నిచ్చే ఆచారాన్ని దేశ ప్రజానీకం పాటించనుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు.
ఛఠీ మాతకు అంకితమిచ్చిన భక్తి గీతాలను కూడా శ్రీ మోదీ ప్రజలతో పంచుకున్నారు.
‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా రాశారు:
‘‘దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులకు ఛఠ్ మహాపర్వం లోని సంధ్యా అర్ఘ్య ఘట్టానికి గాను అనేకానేక శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో, సంజె కాలంలో సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించడం చాలా విశిష్ట సంప్రదాయం. సూర్యదేవుని కృపతో అందరికీ శుభాలు కలగాలని, అందరి జీవనంలో సుఖసంపదలు, విజయం సిద్ధించాలని నేను అభిలాషిస్తున్నాను. జయ్ ఛఠీ మాతా.
https://m.youtube.com/watch?v=er0EO-Zp904
https://m.youtube.com/watch?v=OrlnX9zM5-k&pp=0gcJCR4Bo7VqN5tD’’
***
MJPS/SR
(రిలీజ్ ఐడి: 2183081)
సందర్శకుల సూచీ సంఖ్య : : 28
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam