ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు 2025 సందర్భంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన కేంద్ర మంత్రి శ్రీ జేపీ నడ్డా
అప్రమత్తత సంస్థాగత అలవాటుగా మారాలి: శ్రీ జేపీ నడ్డా
నైతికత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటిస్తామనే ప్రతిజ్ఞతో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ
విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా.. నైతిక పరిపాలన, అవినీతి నిరోధక నిఘా గురించి వివరించిన శ్రీ నడ్డా
प्रविष्टि तिथि:
27 OCT 2025 1:36PM by PIB Hyderabad
విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు 2025లో భాగంగా.. మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు సిబ్బందితో కలసి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా ప్రతిజ్ఞ చేశారు.
‘‘సత్కృత: హమారీ సాఝా జిమ్మేదారీ’’ (జాగరూకత: మన ఉమ్మడి బాధ్యత) అనే అంశంపై 2025 అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు దేశవ్యాప్తంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. కేంద్రీయ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజా సేవలో నైతికతను, పారదర్శకత్వాన్ని, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
ప్రతిజ్ఞ సందర్భంగా నైతిక విధానాలను వ్యవస్థీకృతం చేయడం, పరిపాలనలో ప్రతి దశలోనూ జాగరూకతగా ఉండే సంస్కృతిని నిర్మించాల్సిన అవసరాన్ని శ్రీ నడ్డా స్పష్టం చేశారు. ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజలు తప్పు చేయకుండా ఉండటానికి వారికి అర్థమయ్యే విధంగా అత్యంత సరళమైన భాషలో చేయాల్సిన, చేయకూడని పనుల జాబితాను సిద్ధం చేయాలి. అందరూ అవగాహనతో, అప్రమత్తంతో వ్యవహరించడానికి.. శిక్షణ, సామర్థ్య నిర్మాణం నిరంతర ప్రక్రియగా ఉండాలి’’ అని ఆయన అన్నారు.
విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు 2025కు సన్నాహకంగా.. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఒక నోటీసును ఈ ఏడాది ఆగస్టు నెలలో జారీ చేసింది. దానిలో 2025 ఆగస్టు 18 నుంచి నవంబర్ 17 వరకు మూడు నెలల పాటు అవినీతిని నిరోధక నిఘాపై ప్రచారం నిర్వహించాలని అన్ని సంస్థలకు సూచించి.. ప్రధానంగా అయిదు కీలకాంశాలపై దృష్టి సారించాలని కోరింది. అవి: పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించడం, పెండింగ్ కేసుల పరిష్కారం, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు, ఆస్తుల నిర్వహణ, డిజిటల్ కార్యక్రమాలు.
ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సేవలో నైతిక విలువలను, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాటించాలనే తమ అంకితభావాన్ని సుస్పష్టం చేశారు.
***
(रिलीज़ आईडी: 2183067)
आगंतुक पटल : 107