గనుల మంత్రిత్వ శాఖ
జాతీయ కీలక ఖనిజాల మిషన్ కింద మరో రెండు అత్యుత్తమ కేంద్రాలను గుర్తించిన గనుల మంత్రిత్వ శాఖ
కీలక ఖనిజాల వ్యవస్థకు సంబంధించి పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించటానికి అత్యుత్తమ కేంద్రాల ఏర్పాటు
Posted On:
25 OCT 2025 11:03AM by PIB Hyderabad
జాతీయ కీలక ఖనిజాల మిషన్ (ఎన్ సీఎంఎం) కింద ఇప్పటికే ఉన్న 7 సంస్థలతో పాటు మరో 2 సంస్థలను అత్యుత్తమ కేంద్రాలుగా గనుల మంత్రిత్వ శాఖ గుర్తించింది. వాటిలో బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ), హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీ-ఎంఈటీ) ఉన్నాయి. గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరంధికర్ సహ అధ్యక్షతన 24.10.2025న జరిగిన సమావేశంలో ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ అడ్వైజరీ కమిటీ (పీఏఏసీ) ఇచ్చిన ఆమోదం మేరకు ఈ కేంద్రాలకు అనుమతి లభించింది.
ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగం, అంతరిక్షం వంటి వ్యూహాత్మక రంగాలతో పాటు అధునాతన సాంకేతికత, క్లీన్ ఎనర్జీ, మొబిలిటీ ట్రాన్సిషన్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు కీలక ముడి పదార్థాలు ముఖ్యమైన సరఫరా వ్యవస్థను ఏర్పరుస్తాయి. సమగ్ర వ్యవస్థాగత విధానంలో సాంకేతికతలను అభివృద్ధి చేయటానికి, ప్రదర్శించటానికి, అమలు చేయటానికి, ఉన్నత స్థాయి టెక్నాలజీ సంసిద్ధతా స్థాయి (టీఆర్ఎల్)ని, టీఆర్ఎల్ 7/8 పైలట్ ప్లాంట్, వాణిజ్య-పూర్వ ప్రదర్శన స్థాయిని చేరుకోవటానికి ఆర్ అండ్ డీ అవసరం. కీలక ఖనిజాల రంగంలో దేశ సైన్స్, సాంకేతికల సామర్థ్యాన్ని బలోపేతం చేయటానికి, ముందుకు తీసుకెళ్లటానికి నూతన, పరివర్తనాత్మక పరిశోధనలను ఈ సీఓఈలు చేపడతాయి.
కీలక ఖనిజాలపై పరిశోధన, అభివృద్ధిని సమర్థవంతంగా వినియోగించుకోవటానికి, ప్రతి భాగస్వామి సామర్థ్యాన్ని ఒకే వేదికపైకి తీసుకురావటానికి హబ్ అండ్ స్పోక్ నమూనాపై కన్సార్టియంగా ప్రతి అత్యుత్తమ కేంద్రం పనిచేస్తుంది. సీఓఈ మార్గదర్శకాల ప్రకారం, ప్రతి సీఓఈ (హబ్ సంస్థ) కన్సార్టియంలో కనీసం ఇద్దరు పారిశ్రామిక భాగస్వాములు, కనీసం ఇద్దరు ఆర్ అండ్ డీ లేదా విద్యా రంగ భాగస్వాములను చేర్చుకోవటం తప్పనిసరి. ఇప్పటివరకు గుర్తించిన 9 సీఓఈలు కలిసి సుమారు 90 పారిశ్రామిక, విద్య లేదా ఆర్ అండ్ డీ భాగస్వాములను తీసుకువచ్చాయి.
***
(Release ID: 2182558)
Visitor Counter : 4