నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
దేశంలోని సృజనాత్మక మేధావులను "గ్రీన్ హైడ్రోజన్ మిషన్" కోసం లోగో రూపొందించమని ఆహ్వానిస్తున్న మంత్రిత్వశాఖ... విజేతకు రూ.1,00,000 నగదు బహుమతి!
భారత్ గ్రీన్ హైడ్రోజన్ లక్ష్యాన్ని, స్వావలంబన, బహుళ రంగ సామర్థ్యాన్ని ప్రతిబింబించాలనేది లోగో రూపకల్పన ఉద్దేశ్యం, 2025 నవంబర్ 5 వరకు ఎంట్రీలకు అనుమతి
Posted On:
23 OCT 2025 3:09PM by PIB Hyderabad
దేశంలో హరిత హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను స్థాపించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అందించడమే లక్ష్యంగా నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం వేగంగా ఎదుగుతున్న రంగంలోని అవకాశాలు, సవాళ్లకు సమగ్రంగా స్పందించే విధానాన్ని ప్రోత్సహిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థలో కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించడం, శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, హరిత హైడ్రోజన్ రంగంలో సాంకేతికత, మార్కెట్ నాయకత్వాన్ని పొందేందుకు ఈ మిషన్ వీలు కల్పిస్తుంది.
ప్రపంచ స్థాయిలో హరిత హైడ్రోజన్ మిషన్ ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ లక్ష్యాన్ని సాధించడానికి పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సమగ్ర విధానాన్ని అవలంబించింది.. ఈ మిషన్ కోసం లోగో డిజైన్ పోటీలో పాల్గొనేందుకు దేశ పౌరులందరినీ వయస్సుతో సంబంధం లేకుండా ఆహ్వానిస్తుంది. దీని ద్వారా పౌరుల సృజనాత్మకతను, ఆశయాలను ఈ మిషన్ లక్ష్యాలతో అనుసంధానించనుంది.. హరిత హైడ్రోజన్, దాని ఉత్పత్తుల ఉత్పత్తి, వినియోగం, ఎగుమతుల కోసం దేశాన్ని ప్రపంచ హబ్‌గా మార్చాలనే మిషన్ లక్ష్యాన్ని లోగో డిజైన్ ప్రతిబింబించాలి. ఉక్కు, రవాణా, ఎరువులు, నౌకాయానం, పెట్రోకెమికల్స్ వంటి బహుళ రంగాల్లో స్వావలంబన, పెట్టుబడి అవకాశాలు, హరిత గ్రీన్ హైడ్రోజన్ వినియోగాన్ని కూడా లోగో ప్రతిబింబించాలి.
జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ లోగో డిజైన్ పోటలో పాల్గొనేవారు.. లోగోను జేపీఈజీ, పీఎన్ జీ, లేదా పీడీఎఫ్ ఫార్మాట్‌లో మాత్రమే పంపించాలి. లోగో అధిక రిజల్యూషన్‌లో కనీసం 300 డీపీఐతో ఉండాలి. లోగో పరిమాణం 15సెంటిమీటర్లు X 20సెంటిమీటర్లు ఉండాలి. సృజనాత్మకత, వాస్తవికత, కూర్పు, సాంకేతిక నైపుణ్యం, సరళత, కళాత్మక విలువ, దృశ్య ప్రభావం, మిషన్ కు అనుగుణ్యత వంటి అంశాల ఆధారంగా లోగోలను పునర్పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖలోని అంతర్గత కమిటీ పరిశీలిస్తుంది. ఈ పోటీలో గెలిచిన ప్రధాన విజేతకు రూ. 1,00,000/- నగదు బహుమతి, మంత్రిత్వశాఖ మిషన్ డైరెక్టర్ ద్వారా ప్రశంసా పత్రం అందించనున్నారు. పది మంది రన్నరప్‌లకు ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున బహుమతి ఇవ్వనున్నారు. ప్రధాన విజేతకు న్యూ ఢిల్లీకి వెళ్ళి రావడానికి డొమెస్టిక్ ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణ ఖర్చులు తిరిగి చెల్లించనున్నారు.
ఎంట్రీ సమర్పించడానికి చివరి తేదీ 05-11-2025. పాల్గొనేవారు తమ ఎంట్రీలను నమోదు చేసుకోవడానికి, సమర్పించడానికి నేరుగా https://www.mygov.in/task/logo-design-contest-national-green-hydrogen-mission/ కు లాగిన్ అవ్వవచ్చు.
***
(Release ID: 2181973)
Visitor Counter : 4