రాష్ట్రపతి సచివాలయం
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము
నాడు పోస్టు చేయడమైనది:
19 OCT 2025 6:19PM by PIB Hyderabad
దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము శుభాకాంక్షలు తెలిపారు.
ఒక సందేశంలో, రాష్ట్రపతి ఇలా పేర్కొన్నారు:
‘‘దీపావళి శుభ సందర్భంగా, దేశ విదేశాల్లోని భారతీయులందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పండుగల్లో ఒక పండుగే దీపావళి. ఈ పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంతో, ఉల్లాసంగా జరుపుకొంటాం మనం. చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, మంచిపై చెడు విజయం సాధించడానికి ఒక ప్రతీక ఈ పండుగ. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో నిర్వహించుకొనే శుభప్రదమైన దీపావళి, మనమంతా పరస్పరం ఆత్మీయతతో, సోదర భావంతో జీవించాలనే సందేశాన్ని అందిస్తోంది. సిరి సంపదల, సౌభాగ్యాల దేవత లక్ష్మీ అమ్మవారిని ఈ రోజున భక్తులంతా పూజిస్తారు.
ఈ ఆనందోత్సవం మనం మన లోపలికి తొంగి చూసుకోవడానికీ, మనల్ని మనం సంస్కరించుకోవడానికీ లభించిన ఓ అవకాశం. అంతే కాదు, ఈ పండుగ రోజు.. అవసరార్థులకూ, సమాజంలో వంచనకు గురైన వారికీ సాయాన్నిచ్చి అండగా నిలిచి వారి జీవనంలో సంతోషాన్ని నింపాల్సిన సందర్భం కూడా.
అన్ని జాగ్రత్తలనూ తీసుకొంటూ, బాధ్యతాయుతంగా మెలగుతూ, పర్యావరణానికి అనుకూలంగా నడుచుకొంటూ దీపావళి పండుగ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ దీపావళి అందరికీ సుఖ శాంతులనూ, సమృద్ధినీ అందించాలని నేను కోరుకుంటున్నాను.’’
Please click here to see the President's message-
***
(రిలీజ్ ఐడి: 2181045)
సందర్శకుల సూచీ సంఖ్య : : 23