భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

బీహార్‌ ఎన్నికలతో పాటు 8 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలించడం కోసం పరిశీలకులను నియమించిన ఈసీఐ


స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు-అభ్యర్థులకు సమానంగా అవకాశాలు

Posted On: 19 OCT 2025 3:25PM by PIB Hyderabad

1.     2025 బీహార్ శాసనసభ సార్వత్రిక ఎన్నికలు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది.

2.    రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 20బీ ద్వారా పొందిన ప్లీనరీ అధికారాల ప్రకారం కమిషన్ స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడంలో సహాయం చేయడానికి కేంద్ర పరిశీలకులను నియమిస్తుంది.

3.    2025 బీహార్ శాసనసభ ఎన్నికల మొదటి దశ కోసం 121 మంది సాధారణ పరిశీలకులు, 18 మంది పోలీస్ పరిశీలకులను... రెండో దశ కోసం 122 మంది సాధారణ పరిశీలకులు, 20 మంది పోలీస్ పరిశీలకులను కమిషన్ ఇప్పటికే నియమించింది. 8 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల కోసం 8 మంది సాధారణ పరిశీలకులను, 8 మంది పోలీస్ పరిశీలకులనూ నియమించారు.

4.    వివిధ నియోజకవర్గాలకు వారి నియమాకాన్ని అనుసరించి అందరు పరిశీలకులు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో తొలి విడత సందర్శనలను ఇప్పటికే పూర్తి చేశారు. ఇప్పుడు వారు తమ నియోజకవర్గాలకు తిరిగి చేరుకుని విధులు నిర్వహిస్తున్నారు.

5.    మొత్తం ఎన్నికల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలనీ... ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా చూసుకోవాలని ఈసీఐ పరిశీలకులను ఆదేశించింది.

6.    రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఓటర్లకు పరిశీలకులు పూర్తిగా అందుబాటులో ఉండాలని, వారి ఫిర్యాదులు పరిష్కరించేందుకు కృషి చేయాలని పరిశీలకులకు సూచించింది.

7.    పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ఓటర్ల సౌలభ్యం కోసం కమిషన్ ఇటీవల తీసుకున్న చర్యల అమలును నిర్ధారించుకోవాలని పరిశీలకులకు సూచించింది.


(Release ID: 2180889) Visitor Counter : 6