రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఈ దీపావళికి కానుకగా... ఫాస్టాగ్ వార్షిక పాస్!
Posted On:
18 OCT 2025 11:37AM by PIB Hyderabad
ప్రయాణంలో సౌలభ్యాన్ని, సౌకర్యాన్నీ అందించే ఫాస్టాగ్ వార్షిక పాస్... ఈ పండుగ సీజన్‌లో ప్రయాణికులకు సరైన కానుక అవుతుంది. ఇది దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలలో ఏడాది పొడవునా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించే వీలు కల్పిస్తుంది. రాజ్‌మార్గయాత్ర యాప్ ద్వారా వార్షిక పాస్‌ను ఎవరికైనా కానుకగా ఇవ్వవచ్చు. యాప్‌లోని ‘యాడ్ పాస్’ ఎంపికను క్లిక్ చేయడం ద్వారా వినియోగదారులు తాము ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను బహుమతిగా ఇవ్వాలనుకునే వ్యక్తి వాహన నంబరు, సంప్రదించు వివరాలను జోడించాలి. సాధారణ ఓటీపీ ధృవీకరణ తర్వాత ఆ వాహనానికి జోడించిన ఫాస్టాగ్‌పై వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుంది. ఫాస్టాగ్ వార్షిక పాస్ జాతీయ రహదారిపై ప్రయాణించే వారి కోసం ఎలాంటి ఇబ్బందిలేని, ఆర్థికంగా సరసమైన ప్రయాణ ఎంపికను అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1,150 టోల్ ప్లాజాలలో ఇది వర్తిస్తుంది.
రూ. 3,000 వన్-టైమ్ ఫీజు చెల్లింపు ద్వారా ఈ వార్షిక పాస్ ఒక సంవత్సరం చెల్లుబాటును గానీ, 200 టోల్ ప్లాజా దాటడానిగానీ వర్తించడంతోపాటు తరచూ ఫాస్టాగ్ రీఛార్జ్ చేయాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. చెల్లుబాటయ్యే ఫాస్టాగ్ ఉన్న అన్ని వాణిజ్యేతర వాహనాలకు ఈ పాస్ వర్తిస్తుంది. రాజ్‌మార్గయాత్ర యాప్ ద్వారా వన్-టైమ్ ఫీజు చెల్లింపు తర్వాత వాహనానికి అనుసంధానించిన ప్రస్తుత ఫాస్టాగ్‌పై రెండు గంటల్లోపు ఈ వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుంది.
2025 ఆగస్టు 15న ప్రారంభమైన ఫాస్టాగ్ వార్షిక పాస్ విధానం మొదటి రెండు నెలల్లోనే దాదాపు 5.67 కోట్ల లావాదేవీలతో ఇరవై ఐదు లక్షల మంది వినియోగదారుల మైలురాయిని అధిగమించింది. ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు లభించిన అఖండ స్పందన జాతీయ రహదారి వినియోగదారులకు సాఫీగా, సజావుగా సాగే ప్రయాణ అనుభవాన్ని నిర్ధారిస్తుంది.
****
(Release ID: 2180755)
Visitor Counter : 9