ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యక్రమాల గురించి ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్‌కు వివరించిన మంత్రులు


అనుసంధానం, ఆవిష్కరణ, ప్రాంతీయ వృద్ధిలో మంత్రిత్వ శాఖల కృషిని అభినందించిన ఉపరాష్ట్రపతి

బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ, పోస్టల్ సంస్కరణలను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి

ఈశాన్య ప్రాంతంలో వేగవంతమైన అభివృద్ధి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి

Posted On: 16 OCT 2025 5:12PM by PIB Hyderabad

కేంద్ర కమ్యూనికేషన్లుఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖా మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎంసింధియా ఈ రోజు పార్లమెంట్ హౌస్‌లో ఉపరాష్ట్రపతి శ్రీ సి.పిరాధాకృష్ణన్‌ను కలిశారుసహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్‌ కూడా ఆయన వెంట ఉన్నారు

కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ,  ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖల పనితీరుప్రధాన  కార్యక్రమాలువిజయాలుభవిష్యత్ ప్రణాళికల గురించి వారు ఉపరాష్ట్రపతికి వివరించారు.

దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న టెలికాంఇంటర్నెట్ మౌలిక సదుపాయాల గురించిఅందరికీ కనెక్టివిటీనితక్కువ ధరకు డేటా సేవలను అందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వారు శ్రీ రాధాకృష్ణన్‌కు వివరించారుఈ ప్రయత్నాలు భారతదేశ డిజిటల్ మార్పునకు దోహదపడుతున్నాయని తెలిపారు.

విస్తృత తపాలా వ్యవస్థ గురించిఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌తో సహా వినూత్న ప్రాజెక్టుల ద్వారా దాని విస్తృతమైన పరిధిని వినియోగించుకోవడానికి మంత్రిత్వ శాఖ చేపడుతున్న ప్రయత్నాల గురించి ఉపరాష్ట్రపతికి వివరించారుబీఎస్ఎన్ఎల్ సేవల పునరుద్ధరణనుపోస్టల్ శాఖ చేపట్టిన కొత్త కార్యక్రమాలను శ్రీ రాధాకృష్ణన్ ప్రశంసించారుస్పీడ్ పోస్ట్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడాన్ని అభినందించారు.

బడ్జెట్ కేటాయింపుల పెంపురైలురహదారి కనెక్టివిటీ విస్తరణకొత్త విమానాశ్రయాల అభివృద్ధి,  పర్యాటక ప్రోత్సాహంఈశాన్య ప్రాంత పెట్టుబడుల కోసం శిఖరాగ్ర సమావేశాల నిర్వహణప్రైవేట్ పెట్టుబడుల పెంపు,  ఈ ప్రాంత జలవిద్యుత్ సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలతో సహా ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యక్రమాల గురించి ఉపరాష్ట్రపతికి వివరించారు.

ఈశాన్య ప్రాంతంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుండటంకొత్త అవకాశాలు ఏర్పడటంమొత్తం భద్రతా పరిస్థితి మెరుగుపడటం పట్ల శ్రీ రాధాకృష్ణన్ హర్షం వ్యక్తం చేశారు.

 

***


(Release ID: 2180103) Visitor Counter : 5