భారత ఎన్నికల సంఘం
రాబోయే బీహార్ ఎన్నికల్లో ధనబలాన్ని ఉపయోగించకుండా నిరోధించాలని ప్రభుత్వ సంస్థలకు ఈసీఐ ఆదేశాలు
· ఎన్నికల ఖర్చుల పరిశీలన కోసం వ్యయ పరిశీలకుల నియామకం
Posted On:
15 OCT 2025 10:07AM by PIB Hyderabad
- బీహార్ శాసనసభ సాధారణ ఎన్నికలతోపాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూలును భారత ఎన్నికల సంఘం 2025 అక్టోబరు 6న ప్రకటించింది.
- రాబోయే ఎన్నికల్లో ధనబలం, ఉచిత ప్రలోభాలతోపాటు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు, మద్యం వినియోగాన్ని అరికట్టడం కోసం.. రాష్ట్ర పోలీసు విభాగం, రాష్ట్ర ఎక్సైజ్ విభాగం, ఆదాయపు పన్ను శాఖ, ఎఫ్ఐయు-ఐఎన్డీ, ఆర్బీఐ, ఎస్ఎల్బీసీ, డీఆర్ఐ, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, కస్టమ్స్, ఈడీ, ఎన్సీబీ, ఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, బీసీఏఎస్, ఏఏఐ, తపాలా విభాగం, రాట్ర అటవీ శాఖ, రాష్ట్ర సహకార శాఖ సహా అన్ని ప్రభుత్వ సంస్థలకూ ఎన్నికల సంఘం మార్గనిర్దేశాలు జారీ చేసింది.
- అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను పర్యవేక్షించడానికి వ్యయ పరిశీలకులను ఇప్పటికే నియమించారు. ఎన్నికల నోటిఫికేషన్ రోజునే వారి వారి నియోజకవర్గాలకు చేరుకున్నారు. పర్యటన సందర్భంగా వ్యయ పర్యవేక్షణలో పాల్గొంటున్న అన్ని బృందాలను వారు కలుస్తారు.
- ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, నిఘా బృందాలు, వీడియో పర్యవేక్షణ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ.. ధన బలం లేదా ఇతర ప్రలోభాలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలపై పర్యవేక్షించాలి.
- ఎన్నికల సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, ఎస్‌ఎస్‌టీలు, అమలు సంస్థలు గుర్తించిన అవకతవకలు/ వాటి స్వాధీనాలను ఎప్పటికప్పుడు నివేదించడం కోసం ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) అనే ఆన్‌లైన్ వ్యవస్థను కూడా ఎన్నికల సంఘం క్రియాశీలం చేసింది.
- 2025 అక్టోబర్ 6న ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి.. మొత్తం రూ. 33.97 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, ఉచితాలను వివిధ అమలు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి.
- ఈ ఆదేశాల అమలు కోసం తనిఖీలు, పర్యవేక్షణల సమయంలో సాధారణ పౌరులు అసౌకర్యానికి, వేధింపులకు గురికాకుండా సంబంధిత అధికారులు చూసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది.
- ఉల్లంఘనలకు సంబంధించి ప్రజల్లో ఎవరైనా సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
***
(Release ID: 2179330)
|