వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రజాస్వామ్యీకరణలో భాగంగా భౌగోళిక , మౌలిక సదుపాయాల సమాచారాన్ని ప్రజలకు


అందించేందుకు 'పీఎం గతిశక్తి పబ్లిక్' వేదికను ప్రారంభించిన

వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖా మంత్రి శ్రీ పీయూష్ గోయల్

యూనిఫైడ్ జియోస్పేషియల్ ఇంటర్‌ఫేస్ ద్వారా ప్రారంభించిన ‘పీఎం గతిశక్తి పబ్లిక్’ వేదిక..

మౌలిక సదుపాయాలు, భౌగోళిక సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర

प्रविष्टि तिथि: 13 OCT 2025 5:09PM by PIB Hyderabad

ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ నాలుగు సంవత్సరాల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా.. వాణిజ్యంపరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమఅంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీలాజిస్టిక్స్ విభాగం నేడు న్యూఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిందిదీనికి కేంద్ర వాణిజ్యంపరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అధ్యక్షత వహించారుగత నాలుగేళ్లలో పీఎం గతిశక్తి ద్వారా దేశంలోని మౌలిక సదుపాయాల ప్రణాళికఅమలుసమన్వయంలో జరిగిన కీలకమైన మార్పులను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఈ  కార్యక్రమాల్లో యూనిఫైడ్ జియోస్పేషియల్ ఇంటర్‌ఫేస్ (యూజీఐద్వారా ‘‘పీఎం గతిశక్తి పబ్లిక్’ వెబ్‌సైట్‌ ప్రారంభం కీలక మైలురాయిగా నిలిచిందిఇది భౌగోళికమౌలిక సదుపాయాల సమాచారాన్ని ప్రజాస్వామ్యీకరణలో భాగంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు దోహదపడుతుందిపీఎం గతిశక్తి ఎన్‌ఎంపీ వేదిక ద్వారా సున్నితంకాని సమాచారం ప్రజలకు చేరువ కానుందిదీనివల్ల ప్రైవేట్ సంస్థలుకన్సల్టెంట్లుపరిశోధకులుపౌరులు  మౌలిక సదుపాయాల ప్రణాళికపెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో ఆధునిక విశ్లేషణా సాధనాలను వినియోగించుకోవచ్చుపీఎం గతిశక్తి జాతీయ మాస్టర్‌ ప్రణాళిక కోసం భాస్కరాచార్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్‌ఫర్మాటిక్స్ అభివృద్ధి చేసిన ఈ జియోస్పేషియల్ వేదిక.. నేషనల్ జియోస్పేషియల్ డేటా రిజిస్ట్రీ ఆధారంగా పనిచేస్తుందిఈ వేదిక వినియోగదారులకు భౌతికసామాజిక మౌలిక సదుపాయాల సమాచారం గురించి 230 ఆమోదించిన డేటాసెట్‌లుసైట్ అనుకూలత విశ్లేషణలుకనెక్టివిటీ మ్యాపింగ్అలైన్‌మెంట్ ప్లానింగ్సమ్మతి తనిఖీలను నిర్వహించడానికి అనుమతిస్తుందిఅలాగే ముందుగా నిర్వచించిన టెంప్లేట్లువినియోగదారు నిర్వచించిన ప్రమాణాల ఆధారంగా విశ్లేషణాత్మక నివేదికలను రూపొందించడానికి కూడా అనుమతిస్తుందివినియోగదారులు బహుళ లేయర్ల భౌగోళిక సమాచారాన్ని చూడవచ్చుమెరుగైన ప్రాజెక్టు డిజైన్‌ఏజెన్సీల మధ్య సమన్వయంప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

స్వీయ నమోదు ద్వారా పీఎం గతిశక్తి వేదికను ఉపయోగించాలిఇందుకు బలమైన ధృవీకరణడేటా భద్రతా ప్రమాణాలు అవసరంఇది భద్రతా ప్రమాణాలువిధాన నిబంధనలకు అనుగుణంగా వినియోగదారుల గోప్యతను కాపాడుతుందివినియోగదారుల అభిప్రాయాలుపెరుగుతున్న అవసరాల ఆధారంగా కొత్త డేటా లేయర్లుఅధునాతన విశ్లేషణా సాధానాలతో భవిషత్తులో తదుపరి దశల్లో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

2021 అక్టోబర్ 13న ప్రారంభించిన పీఎం గతిశక్తి.. 57 కి పైగా కేంద్ర మంత్రిత్వ శాఖలువిభాగాలురాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి భౌగోళిక సమాచారాన్ని ఒకే వేదికపై అందించడం ద్వారా దేశంలో మౌలిక సదుపాయాల ప్రణాళికఅమలులో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందిఇది ప్రాజెక్ట్ ప్రణాళికలో సమన్వయంవేగవంతమైన అమలుమరియు రవాణా ఖర్చుల తగ్గింపునకు దోహదపడిందిదీని ద్వారా సేవల నాణ్యత పెంపుప్రాజెక్ట్ అమలులో వేగంపారదర్శకతఆర్థిక వృద్ధికి తోడ్పాటుదేశంలో ప్రపంచ పోటీతత్వాన్ని పెంచింది .గత నాలుగు సంవత్సరాల్లో పీఎం గతిశక్తి వందలాది ప్రధాన మౌలిక ప్రాజెక్టులను చేపట్టిందిఅన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలువిభాగాలురాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానించిందిప్రణాళికవిశ్లేషణ కోసం కృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించిందిఈ కార్యక్రమం దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో ఒక మూలాధారంగా ముందుకు సాగుతూనే ఉంది.

పీఎం గతిశక్తి ఆధునిక డేటా విశ్లేషణ సామర్థ్యాలను ప్రైవేటు రంగానికిప్రజలకు విస్తరించడం ద్వారా ఈ పథకం ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా..పారదర్శకతసమగ్ర ప్రణాళికఆవిష్కరణలకు నిబద్ధతను బలోపేతం చేస్తుందిమౌలిక సదుపాయాల ప్రణాళికఅమలు విషయంలో మంత్రిత్వ శాఖలుపరిశ్రమలుపౌరుల మధ్య ససహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా ‘ప్రభుత్వ సమగ్రత’ ‘సమాజ సమగ్రత’ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందిఈ వేదిక ప్రామాణిక నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తుందిఅలాగే వికసిత్‌ భారత్‌ 2047 సాధనకు మద్దతుగా నిలుస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2178752) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Tamil , Malayalam