మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పాఠశాల నిర్వహణ సౌలభ్యాన్ని పెంపొందించటానికి డిజిటల్ పరివర్తన సంస్కరణల్లో భాగంగా ఫీజుల చెల్లింపునకు
స్కూళ్లలో యూపీఐ విధానాన్ని ప్రోత్సహిస్తున్న విద్యా మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
11 OCT 2025 4:15PM by PIB Hyderabad
విస్తృతంగా శాసన, విధాన, సంస్థాగత సంస్కరణల ద్వారా జీవనం, పాఠశాల విద్యను సులభతరం చేయటానికి భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది.
పాఠశాలల్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పరిపాలనా ప్రక్రియలను ఆధునీకీకరణ, పాఠశాల విద్యా సౌలభ్యాన్ని బలోపేతం చేసేందుకు విద్యా మంత్రిత్వ శాఖలోని పాఠశాల విద్య, అక్షరాస్యతా విభాగం కీలక లేఖ రాసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)ని తప్పకుండా ప్రోత్సహించాలని, ఈ విధానాన్ని పాఠశాలలు స్వీకరించేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఇతర భాగస్వాములకు రాసిన లేఖలో స్పష్టం చేసింది.
డిజిటల్ చెల్లింపుల వేదికలు విస్తృతమైన నేపథ్యంలో అడ్మిషన్, పరీక్ష ఫీజులను సురక్షితమైన, పారదర్శకమైన డిజిటల్ పద్ధతుల ద్వారా వసూలు చేసేందుకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ), మొబైల్ వాలెట్లు, నెట్ బ్యాంకింగ్ వంటి వాటిని వినియోగించుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మంత్రిత్వశాఖ పరిధిలోని ఎన్ సీఈఆర్ టీ, సీబీఎస్ఈ, కేవీఎస్, ఎన్ వీఎస్ వంటి స్వయంప్రతిపత్తి సంస్థలను పాఠశాల విద్యా విభాగం కోరింది.
నగదు ఆధారిత చెల్లింపుల నుంచి డిజిటల్ చెల్లింపులకు మారటం వల్ల తల్లిదండ్రులు, విద్యార్థులకు ప్రయోజనకరమని.. సులభంగా, పారదర్శకతతో, పాఠశాలలను సందర్శించకుండానే ఇంటి నుంచే చెల్లింపులు చేసే సామర్థ్యం పెరుగుతుందని లేఖలో పేర్కొంది.
ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విధానాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ లక్ష్యమైన డిజిటల్ పరివర్తనకు అనుగుణంగా విద్యా పాలనను మార్చేందుకు పాఠశాలల్లో డిజిటల్ చెల్లింపులు ప్రవేశపెట్టటం కీలక ముందడుగని పాఠశాల విద్య, అక్షరాస్యతా విభాగం స్పష్టం చేసింది. దీనివల్ల ప్రతి ఒక్కరూ ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవటంతో డిజిటల్ లావాదేవీల పరిధి విస్తృతమవుతుంది. 2047 నాటికి వికసిత్ భారత్ కలను నేరవేర్చటంలో భాగంగా డిజిటల్ సాధికారత, సమ్మిళిత, ప్రజలకు ప్రాధాన్యతనిచ్చే విద్యా వ్యవస్థ నిర్మాణనికి ఈ కార్యక్రమం సహకరిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2177965)
आगंतुक पटल : 22