ఆర్థిక మంత్రిత్వ శాఖ
రూ. 16 లక్షల కోట్లు దాటిన ఎన్‌పీఎస్, ఏపీవై ఆస్తులు (ఏయూఎం) 9 కోట్లు దాటిన ఎన్‌పీఎస్,ఏపీవై చందదారుల సంఖ్య
प्रविष्टि तिथि:
09 OCT 2025 7:46PM by PIB Hyderabad
ఎన్‌పీఏ (నేషనల్ పెన్షన్ సిస్టమ్), ఏపీవై (అటల్ పెన్షన్ యోజన) కింద నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ ఇవాళ రూ. 16 లక్షల కోట్లను దాటింది. చందాదారుల సంఖ్య కూడా 9 కోట్లను దాటటంతో భారతదేశ పింఛను ప్రయాణంలో ఇది ఒక ప్రధాన ఘట్టంగా నిలిచిపోనుంది.
ఎన్‌పీఎస్‌ను బలోపేతం చేయటం, పింఛన్ల విషయంలో సమ్మిళితత్వాన్ని పెంచేందుకు పీఎఫ్‌ఆర్‌డీఏ కీలక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. 2025 అక్టోబర్ 1 నుంచి ఎమ్ఎస్ఎఫ్‌ను (మల్టీ స్కీమ్ ఫ్రేమ్‌వర్క్) అమల్లోకి తెచ్చింది. ఇది పెట్టుబడుల విషయంలో చందదారులకు మరింత వెసులుబాటును అందిస్తోంది. ఎన్‌పీఎస్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ మోడల్ ద్వారా గిగ్ కార్మికులను పింఛను ప్రయోజనాలు అందనున్నాయి. పదవీ విరమణ సమయంలో తీసుకునే మొత్తం విషయంలో మరింత వెసులుబాటు కల్పించేందుకు గ్రేడెడ్ చెల్లింపులు, సౌకర్యవంతమైన యాన్యుటీని ప్రతిపాదిస్తోన్న ఎన్‌పీఎస్‌లో సమూల మార్పులపై కన్సల్టేషన్ పత్రాన్ని కూడా ప్రకటించింది. రైతులు, ఎంఎస్ఎంఈ కార్మికులు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, ఇతర అవ్యవస్థీకృత రంగాల్లోని వారికి పదవీ విరమణ ప్రయోజనాలను కల్పించాలన్న లక్ష్యంతో వివిధ అవగాహన కార్యక్రమాలను పీఎఫ్ఆర్‌డీఏ నిర్వహిస్తోంది. సమ్మిళితత్వం, మరింత వెసులుబాటు, దీర్ఘకాలిక ఆర్థిక భద్రతపై పీఎఫ్‌ఆర్‌డీఏ దృష్టిని ఇది తెలియజేస్తోంది.
రూ. 16 లక్షల కోట్లకు పైగా ఆస్తులనే కీలక ఘట్టంతో పీఎఫ్‌ఆర్‌డీఏ.. భారతీయులందరికీ వృద్ధాప్య సమయంలో ఆదాయ భద్రత ఉండేలా చూసుకోవాలన్న దార్శనికతకు కట్టుబడి ఉంది.
***
(रिलीज़ आईडी: 2177512)
आगंतुक पटल : 26