మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
వికసిత్ భారత్ బిల్డథాన్-2025... విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన
ఆత్మరనిర్భర భారత్ సాధించేలా బిల్డథాన్‌లో పాల్గొనాలని యువ ఆవిష్కర్తల్లో స్ఫూర్తి నింపిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2025 8:11PM by PIB Hyderabad
అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ భాగస్వామ్యంతో వికసిత్ భారత్ బిల్డథాన్ -2025 కార్యక్రమాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న 2.5 లక్షల పాఠశాలలకు చెందిన విద్యార్థుల నుంచి ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. ఇది దేశంలోనే ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొన్న ఆవిష్కరణల కార్యక్రమంగా.. వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా నడిపించే చారిత్రక కార్యక్రమంగా నిలిచింది.
విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలనీ, ఆత్మనిర్భర భారత్‌కు తోడ్పడాలనీ వీడియో సందేశం ద్వారా భారతీయ వాయుసేన టెస్ట్ పైలెట్, ఇస్రో వ్యోమగామి, వికసిత్ భారత్ బిల్డథాన్ బ్రాండ్ అంబాసిడర్ అయిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా కోరారు. 6 నుంచి 12 గ్రేడ్లకు చెందిన విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శించేందుకు ఈ బిల్డథాన్ ప్రత్యేక వేదికను అందిస్తుందని ఆయన అన్నారు. ప్రతి ఆలోచనా.. అది చిన్నదైనా.. పెద్దదైనా.. వికసిత్ భారత్ 2047 సాధించేందుకు తోడ్పడుతుందని వివరించారు. విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి, వాస్తవ సమస్యలను పరిష్కరించే నమూనాలను అభివృద్ధి చేయాలని, లోకల్ ఫర్ ఓకల్‌తో సహా స్వదేశీ సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఫొటోలు, వీడియోల రూపంలో పాఠశాలలు సమర్పించిన ఎంట్రీలను నిపుణుల కమిటీ మూల్యాంకనం చేస్తుంది. విజేతలుగా నిలిచిన బృందాలకు రూ. కోటితో ఏర్పాటు చేసిన నిధి నుంచి బహుమతులు అందుతాయి.
ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి: http://vbb.mic.gov.in
***
(రిలీజ్ ఐడి: 2176304)
సందర్శకుల సూచీ సంఖ్య : : 33